Suryaa.co.in

Telangana

అభివృద్ధి, సంక్షేమ, సేవారంగా ప్రగతిశీల బడ్జెట్

– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమ, సేవారంగా, ప్రగతిశీల బడ్జెట్ అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు. బుధవారం డా. బీ ఆర్ అంబేద్కర్ సచివాలయం మీడియా సెంటర్ లో చిన్నారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్ర బడ్జెట్ ప్రగతికి బాటలు వేస్తుందని, అభివృద్ధి, సంక్షేమ రంగాలకు సమపాళ్ళలో నిధుల కేటాయింపులు జరిగాయని చిన్నారెడ్డి పేర్కొన్నారు. సేవారంగానికి సింహ భాగం ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందని, వృద్ధి రేటు గణనీయంగా సాధించామని, తలసరి ఆదాయం 1.8 శాతం పెరిగిందని చిన్నారెడ్డి అన్నారు.

విద్య, వైద్యం, వ్యవసాయం, నీటి పారుదల, విద్యుత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పట్టణాభివృద్ధి రంగాలకు బడ్జెట్ లో పెద్ద పీట వేషారని చిన్నారెడ్డి పేర్కొన్నారు.

జీ ఎస్ డీ పీ 10.1 శాతం నమోదు కావడం గొప్ప విషయం అని అన్నారు. బడ్జెట్ ను విశ్లేషణ చేస్తే ఫ్యూచర్ సిటీ, మూసి సుందరీకరణ, హైదరాబాద్ మహా నగరంగా అభివృద్ధి చెందడం ఖాయమని చిన్నారెడ్డి తెలిపారు.

LEAVE A RESPONSE