– సాయి ఈశ్వర చారి మరణం ఆత్మహత్య కాదు
– ఎమ్మెల్సీ డా శ్రవణ్ దాసోజు
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ కోసం పోరాడిన యువ బీసీ బిడ్డ… 42% న్యాయం కోసం నమ్మకంగా నిలిచిన యువకుడు… రాష్ట్రంపై విశ్వాసం పెట్టిన ఓ పౌరుడు…స్వయంకృతమైన కారణాలతో కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వ రాజకీయ వంచనతో సాయి ఈశ్వర చారి ప్రాణాలు కోల్పోయాడు. బీసీల ప్రాణాలతో, బీసీల కలలతో, బీసీల ఆశలతో, బీసీల గౌరవంతో ఆటలాడిన ఈ వంచక ప్రభుత్వం అతన్ని చీకటిలోకి నెట్టింది. ఆ చీకటి అతని జీవితాన్ని మింగేసింది.
అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా హృదయపూర్వక సానుభూతులు. సాయి ఆత్మకు శాంతి చేకూరాలి. కానీ ఈ నిజం ఎప్పటికీ మారదు. అతని మరణం అతని స్వరం ముగింపు కాదు. అది బీసీ ప్రతిఘటనకు ఆరంభం. ఈ దుర్ఘటన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోని అహంకారం, వంచన, తానాశాహిత్వం కు శాశ్వత నిదర్శనం. బీసీ రిజర్వేషన్లు అమలు అయ్యే వరకు, రాజ్యాంగ హామీలు నెరవేర్చే వరకు, సామాజిక న్యాయం ద్రోహులను శిక్షించే వరకు మేము పోరాటం కొనసాగిస్తాము సాయి మరణం వ్యర్థం కాదు. అతను ఒక ఉద్యమాన్ని ప్రజ్వలించాడు.