Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుకి ఇదే ఆఖరి పోరాటం

ఎంపీ విజయసాయిరెడ్డి

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకి ఇదే ఆఖరి పోరాటం అని అర్ధమైనట్లుందని కాబట్టే ఆయన ఖరీదైన దుష్ప్రచారం మొదలు పెట్టించారని రాజ్యసభ సభ్యులు, వైయాస్సార్ సిపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ఉదయమో చోద్యం, సాయంత్రమో వింత అనే బాబుగారి నైజం ప్రజల్ని ఎమోషన్, కామెడీ, సెంటిమెంటు, విషాదంలో ముంచెత్తుతోందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పలు అంశాలపై సొమవారం నాడు స్పందించారు. ఏకపత్నీవ్రతుడైన రాముని ఇల్లాలు సీతమ్మ ప్రస్తావన చంద్రబాబు తేవడం బాధాకరమన్న ఆయన పోలికకు ఒక హద్దుండాలని మండిపడ్డారు.

దిక్కుతోచని స్థితిలో టీడీపీ నేతలు
టీడీపీ నాయకులు అనేక మానసిక జాడ్యాలతోపాటు సిద్ధాంతపరంగా కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఓటమి తథ్యం అని ముందే అంగీకరించినట్టు జరుగుతున్న పరిణామాలనుబట్టి అర్థమవుతోందన్నారు. ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ వారి మన్నలను పొందుతున్న వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, ఆయన బృందం చేస్తున్న మతిలేని అసంబద్ద చిల్లర రాజకీయాలు ఆపార్టీ పతనాన్ని మరింత వేగంగా తెచ్చిపెడుతున్నాయని చెప్పారు. టిడిపి చేస్తన్న ప్రకటనలన్నీ ప్రజలకు అర్థం అవుతున్నాయన్నారు. ఇప్పుడు చంద్రబాబు మాయాఫెస్టోలో ప్రకటిస్తున్న సంక్షేమాలు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అమలు చేయలేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక, పాకిస్తాన్ అవుతోందని గొల్లుమన్న వారు రేపు సంక్షేమానికి ఫండ్స్ ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.

ప్రతిపక్షాలకు రాష్ట్ర అభివృద్ధి ప్రధానం కాదు
ఏపీలోని ప్రతిపక్షాలకు ఏపీకి సంబంధించిన ఎజెండా లేదు, వారికి కేవలం జెండాలు మాత్రమే ఉన్నాయి. ఏపీ అభివృద్ధిపై దృష్టి లేదు, ప్రణాళికాబద్ధమైన విధాన ఆలోచనలు లేవని అన్నారు. వారి ఏకైక ఎజెండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతికూల ప్రచారం మాత్రమేనని అన్నారు. ఎన్నికలొస్తే సీఎం స్థానంతో మ్యూజికల్ చైర్స్ ప్లే చేస్తారని అన్నారు.

పొలిటికల్ విజిటర్స్ సాధించిందేమీ ఉండదు
టీడీపీ నాయకుల నోటి నుంచి ఒకే రకమైన విద్వేష జ్వాలలు ఎగిసిపడుతున్నాయని దీనిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. క్రెడిబులిటి లేనివారు ఎన్ని మాట్లాడినా కంఠశోష తప్ప నమ్మేవారుండరని ఆయన అన్నారు. వారంలో మూడురోజులు ఆవేశంగా మాట్లాడి కనిపించకుండా పోవడం ప్రతివారం జరిగే తంతేనని ఈ పొలిటికల్ విజిటర్స్ సాధించేది ఏమీ ఉండదని ప్రజలకు తెలుసని అన్నారు.

కోస్తా తీరానికి కొత్త అందాలు
బీచ్ పర్యాటకంతో కోస్తా తీరానికి కొత్త కళ చేకూరనుందని, పన్నెండు జిల్లాల్లొ కోస్తా తీరం వెంట 363 బీచ్ లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిదని తెలిపారు.ఫిషరీష్ యూనివర్సీటి,పర్యాటక శాఖ,మత్స్యశాఖలతో 11 బృందాలు కోస్తా తీరం వెంబడి ఎక్కడెక్కడ బీచ్ లను అభివృద్ధి చేయ్యవచ్చో గుర్తించారని ఆయన అన్నారు

వినతులు స్వీకరించిన విజయసాయిరెడ్డి
తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలను కలుసుకుని వారి నుండి వినతులు స్వీకరించారు.

LEAVE A RESPONSE