ఇది జగనాసుర రక్త చరిత్ర

-గత ఎన్నికలకు వారం రోజుల ముందు సాక్షిలో నారా సుర రక్త చరిత్ర అని తప్పుడు కథనాన్ని రాశారు
-ఇప్పుడు ఎన్నికలకు రెండు వారాల ముందు అసలు నిజాన్ని దస్తగిరి బయట పెట్టారు
-అవినాష్ రెడ్డి ఏది చెబితే అది చేయాలని ఆనాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి ఆదేశించారని స్వయంగా దస్తగిరే వెల్లడించారు
-వైఎస్ వివేకానంద హంతకులెవరో ప్రజలకు తెలుసునని చెప్పకనే నిజం చెప్పేసిన జగన్మోహన్ రెడ్డి
-వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనక ఉన్నది ఆ జంటే
-రాయలసీమలోనూ కూటమిదే ప్రభంజనం… 150 స్థానాలు ఖాయం
-జగన్ కావాలా… పోవాలా అని జరుగుతున్న ఈ ఎన్నికల్లో జగన్ పోవాలనుకునే వారంతా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమికి ఓటు వేయండి
-నరసాపురం ఎంపీ , తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు

గత ఎన్నికలకు వారం రోజుల ముందు సాక్షి దినపత్రికలో రాసినట్టుగా ఇది నారాసుర రక్త చరిత్ర కాదని, జగనాసుర రక్త చరిత్ర అని దస్తగిరి ప్రకటన ద్వారా స్పష్టం అయిందని నరసాపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. అవినాష్ రెడ్డి ఏమి చెబితే అది చేయమని, నీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానని ఆనాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో A 1 నిందితుడి గా అభియోగాన్ని ఎదుర్కొంటూ , అప్రూవర్ గా మారిన దస్తగిరి స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. దీనితో ఇది జగనాసుర రక్త చరిత్ర అని తేట తెల్లమయ్యిందన్నారు .

గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… తన చిన్నాన్న హత్యకు ముందు అవినాష్ రెడ్డి ఎలా చెబితే అలా చేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని, ఎవరైతే తప్పు చేసి తన తప్పు తెలుసుకుని అప్రూవర్ గా మారిన దస్తగిరి చేసిన ప్రకటనను పరిశీలిస్తేఈ హత్య వెనుక ఉన్నది జగన్మోహన్ రెడ్డేనని స్పష్టమవుతుందన్నారు. గతంలోనూ అనేక అనుమానాలు ఉన్నాయి. అర్ధరాత్రి, తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి కాల్స్ ఎక్కడకు వెళ్లాయన్న ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది . ఆధారాలన్నీ అంత క్లియర్ గా ఉన్నప్పటికీ, అర్థం కావడం లేదా? అని రెండు రోజుల క్రితం వైఎస్ షర్మిలారెడ్డి ప్రజలను ఉద్దేశించి అన్నారు.

మీ కుటుంబానికి న్యాయం జరిగిందంటేనే ఓట్లు వేయమని, న్యాయం జరగకపోతే ఓట్లు వేయవద్దంటున్న జగన్మోహన్ రెడ్డి తన సొంత కుటుంబంలోనే హత్యా రాజకీయాలను ప్రోత్సహించి అధికారంలోకి వచ్చిన వ్యక్తి అని, అటువంటివాడు ప్రజలకేమీ న్యాయం చేస్తాడని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. హింస నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి ఏ కుటుంబానికైనా మంచి చేయగలరా? అంటూ నిలదీశారు.

గత ఎన్నికల్లో వెన్నంటే ఉన్న సొంత తల్లి, ఇప్పుడు అమెరికాకు వెళ్ళిపోయింది. గతంలో ఎన్నికల ప్రచారంలో అన్ని విధాలుగా సహకరించిన సొంత చెల్లి ఇప్పుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లిపోయింది. జగన్మోహన్ రెడ్డి తన రక్త చరిత్రను ఎంతగా దాయాలనుకుని ప్రయత్నిస్తున్న దాగదన్నారు.

యధాలాపంగా నిజాన్ని చెప్పిన జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి ఇటీవల కడప ఎన్నికల సభలో పాల్గొని, యధాలాపంగా నిజాన్ని చెప్పేశారని రఘురామ కృష్ణంరాజు అన్నారు . వైఎస్ వివేకానంద రెడ్డి హంతకులు ఎవరో ప్రజలకు తెలుసునని , అనవసరంగా అవినాష్ రెడ్డి పై నిందలు వేస్తున్నారన్న ఆయన, చెప్పకనే నిజాన్ని చెప్పేశారని అపహాస్యం చేశారు. దస్తగిరి చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత, కడప ఎన్నికల ప్రచారసభలో జగన్మోహన్ రెడ్డి నిజమే చెప్పారని పిస్తోందన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హంతకులు ఎవరోనన్న పచ్చి నిజాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా బయటపెట్టారన్నారు.

దస్తగిరి ప్రకటన, న్యాయస్థానంలో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్ లోని విషయాలు కో రిలేటెడ్ గా ఉన్నాయని గుర్తు చేశారు. అర్ధరాత్రి, తెల్లవారుజామున అవినాష్ రెడ్డి ఫోను నుంచి కాల్స్ వెళ్లాయని సిబిఐ గుర్తించింది. తెల్లవారుజామున మేనిఫెస్టో రూపకల్పన పై సమావేశం జరుగుతుండగా, జగన్మోహన్ రెడ్డికి ఫోను రావడంతో ఆయన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయి, తిరిగి వచ్చిన అనంతరం బాబాయి చనిపోయారని చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం రెడ్డి సిబిఐ కి ఇచ్చిన రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంది. వీటన్నింటిపై ప్రజలకు అనుమానం రావడం సహజం.

నిజానికి అతి దగ్గరగా నిజాన్ని దాటి కూడా ఆనవాళ్లు స్పష్టంగా ఉన్నాయని వైఎస్ షర్మిలా రెడ్డి ఇటీవల చక్కటి ప్రశ్నను సంధించారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. గూగుల్ టేక్ అవుట్ 50 నుంచి 1000 మీటర్ల తేడాను చూపెడుతుందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొనగా, అటువంటప్పుడు గూగుల్ టేక్ అవుట్ నీ ఇల్లే ఎందుకు చూపెడుతుందనీ షర్మిలా రెడ్డి ప్రశ్నించారన్నారు. నీ ఇంట్లో జరిగినట్టు కాకుండా 50 మీటర్ల నుంచి 1000 మీటర్ల దూరం అవతల చూపించవచ్చు కదనని నిలదీశారన్నారు. గూగుల్ మ్యాప్స్ నిర్దేశిత ప్రదేశానికి పది మీటర్ల దూరాన్ని చూపెడతాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఈరోజు ప్రతి ఒక్కరూ గూగుల్ మ్యాప్ ఆధారంగానే, అడ్రస్ కనుక్కొని ఇతరుల ఇళ్లల్లోకి వెళ్తున్నారని గుర్తు చేశారు. సహజంగా ప్రతి ఇంటి కాంపౌండ్ పది మీటర్లు అంటే 30 అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని, అందుకే పది మీటర్ల డిస్టెన్స్ ను చూపెడుతుందని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్య వెనుక ఆ జంట ప్రమేయం ఉందని అన్ని వేళ్ళు అటువైపే చూపెడుతున్నాయన్నారు. సొంత వాళ్లనే కడతేర్చిన నాయకులు మనకు మంచి చేస్తారంటే నమ్మి ఓటు వేయగలమా అంటూరఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

అందరూ సౌమ్యులే… నేనొక్కడినే దేశద్రోహి, రాజ ద్రోహినా? జగన్మోహన్ రెడ్డి
జగన్మోహన్ రెడ్డి ఇటీవల ప్రతి సభలో స్థానిక వైకాపా అభ్యర్థులను ప్రజలకు పరిచయం చేస్తూ… మంచివాడు, సౌమ్యుడని పేర్కొనడం పట్ల రఘు రామకృష్ణంరాజు ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైకాపాలో అందరూ మంచివాళ్లే నట… అందరూ సౌమ్యులేనట… నేనొక్కడినే దేశద్రోహిని, రాజద్రోహినా జగన్మోహన్ రెడ్డి అంటూ నిలదీశారు. అయితే మంచివాడు లేకపోతే సౌమ్యుడు అని తప్ప మరొక మాట చెప్పడం లేదంటూ జగన్మోహన్ రెడ్డి తీరును ఎండగట్టారు. తనకు తండ్రి సమానుడట కానీ ఆయన్ని మాత్రం అన్నా అని పిలుస్తారట అంటూ ఎద్దేవా చేశారు. అతని భాష అతనిది, అతని మైండ్ అతనిది. అందరూ సౌమ్యులే అయితే మరి నన్నెందుకు పుట్టినరోజు ఎత్తుకెళ్లిపోయి అంత దారుణంగా హింసించావు… చంపాలని చూసావు. బాబాయిని లేపేసినట్లుగా లేపేయమని ఎందుకు నీ వందిమాగాదులను ఆదేశించావు జగన్మోహన్ రెడ్డి అంటూ రఘు రామ కృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు.

సౌమ్యులందరికీ నాయకత్వం వహించే సూపర్ సౌమ్యుడివైన నీవు ముందు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అంటూ నిలదీశారు. మరి నన్ను ఎందుకు చంపించాలనుకున్నావు … కాళ్లు బద్దలయ్యేలా కొట్టించి, చూసి ఆనందించిన తర్వాత చంపేయమని చెప్పావు . ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దయవల్ల నేను బ్రతికి బయటపడ్డాను. ఈ విషయం గురించి మాట్లాడవద్దని అనుకున్నాను. కానీ నువ్వు అందరినీ సౌమ్యలు అని చెబుతుంటే, ఇప్పుడు మాట్లాడుతున్నాను. అందుకే ఈ విషయమై ప్రత్యేకంగా నిన్ను ప్రశ్నిస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

వైఎస్ వివేకా హంతకులెవరో తెలిసిన తర్వాత రాయలసీమలోను కూటమిదే ప్రభంజనం
వైఎస్ వివేకానంద రెడ్డి హంతకులెవరో తెలిసిన తరువాత రాయలసీమ ప్రజల వైఖరిలోను స్పష్టంగా మార్పు కనిపిస్తుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగిందన్నారు. దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత కాఫీ సేవిస్తూ, అక్కడికి విచ్చేసిన రాయలసీమ ప్రాంతం తో పాటు ఇతర ప్రాంతాల ప్రజలతో ముచ్చటించటం జరిగిందన్నారు.

ఇప్పటివరకు కోస్తాంధ్రలో కూటమి స్వీప్ చేస్తుందని, రాయలసీమ ప్రాంతంలో కాసింత టైట్ ఫైట్ ఉంటుందని భావించాము. కానీ తిరుమలలో భక్తులతో మాట్లాడిన తర్వాత రోజు వారీగా వైకాపా గ్రాఫ్ పతనమవుతున్నట్లు వారి మాటల ద్వారా తెలిసిందన్నారు.. కుల మతాలకతీతంగా రాయలసీమ ప్రాంత ప్రజలు హత్యా రాజకీయాలను చేసే జగన్మోహన్ రెడ్డి వంటి నాయకులను పక్కన పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రజాభిప్రాయం రూపం లో వ్యక్తం అవుతోందన్నారు . ఇంకా రాయలసీమ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి వంటి వారికి అవకాశాన్ని ఇస్తే, మన పరువు పోతుందని ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారన్నారు.

రాయలసీమ ప్రాంతానికి కూడా జగన్మోహన్ రెడ్డి తీవ్ర అన్యాయాన్ని చేశారని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. రాయలసీమ రైతాంగ సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు అధికారంలో డిప్ ఇరిగేషన్ వ్యవస్థను ప్రోత్సహించారని గుర్తు చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని బంగారు మయం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓటేసినందుకు ఇత్తడి చేశారని స్థానికులు మండిపడుతున్నారన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలను తెలుసుకున్న తర్వాత రాష్ట్రంలో కూటమి 150 స్థానాలతో తిరుగులేని విజయాన్ని సాధించడం ఖాయమని అనిపిస్తోందన్నారు.

రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో చూసినా కూటమి నేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ లా ప్రభంజనమే కనిపిస్తుందని, వినిపిస్తోందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ప్రజల్లో పెను మార్పు వచ్చిందన్న ఆయన, ప్రజల ఆస్తులు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వారి పేరిట ఉంటాయన్న గ్యారెంటీ లేదు.. ఎవరైనా లిటిగేషన్ పెడితే, ఆస్తులు హరించుకుపోయే ప్రమాదం ఉందన్నారు. నాసిరకమైన మద్యం వల్ల మగువల మాంగల్యాలు తెగిపోతున్నాయన్నారు. మన ఫోటోలతో కూడిన భూమి పత్రాలు మన చేతికి అందాలన్న, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలన్న ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపక తప్పదన్నారు. ప్రజలు చాలా విజ్ఞులని, విజ్ఞతతోనే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుతారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

నాపై ఇంకా అక్కసు తగ్గలేదు
జగన్మోహన్ రెడ్డికి నాపై ఇంకా అక్కసు తగ్గలేదని, అందుకే తెలుగుదేశం పార్టీ ముసుగులో వైకాపా మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిని బరిలోకి దించారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నరసాపురం పార్లమెంట్ టికెట్ నాకు రాకుండా చేసింది జగన్మోహన్ రెడ్డే నని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. నాకు టికెట్ రాకుండా అడ్డుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం లేకపోతే, సాక్షి దినపత్రికలో రాసినట్టే ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. ఏ పార్టీ నుంచి ఎంపీ సీటును నాకు దక్కదని సాక్షి దినపత్రికలో రాశారు.

పొత్తులో భాగంగా నరసాపురం స్థానం బిజెపికి వెళ్తుందని సాక్షి దినపత్రికలో రాశారంటే, పొత్తులో భాగంగా ఆ పార్టీకే వెళుతుందని, నాకు టికెట్ ఇవ్వరని సాక్షి దినపత్రికకు ఎలా తెలుసునంటూ ప్రశ్నించారు. నాకు టికెట్ రాకుండా అడ్డుకోవడంలో సక్సెస్ అయినా జగన్ మోహన్ రెడ్డి, నేను ఉండి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం కూడా నాపై అనధికారికంగా మరొక అభ్యర్థిని పోటీ చేయిస్తున్నారన్నారు. దీనితో జగన్మోహన్ రెడ్డి, నన్ను చూసి ఎంతగా భయపడుతున్నారో ఇట్టే అర్థమవుతుందన్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా తరపున ఇప్పుడు బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారన్నారు.

అధికారికంగా ఒక అభ్యర్థి ఉంటే, అనధికారికంగా మరొక అభ్యర్థి ఉన్నారన్నారు. నాకు ఒకప్పటి మిత్రుడైన శివరామరాజు 20 వేల మందికి భోజనాలు పెట్టి భారీ ఎత్తున ఖర్చు చేసి, టిడిపి ముసుగులో వైకాపా మద్దతుతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారన్నారు. శివరామరాజుకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాబోతున్నానని, మీకు చక్కటి స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిసిందన్నారు. ఈ ఎన్నికలు జగన్ కావాలా?, జగన్ పోవాలా?? అనే ప్రాతిపదికపై జరుగుతున్నాయన్న రఘురామకృష్ణంరాజు, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకులు అందరికీ కీలక ప్రతినిధి నారా చంద్రబాబు నాయుడు అని, జగన్ సమర్థకులకు జగన్మోహన్ రెడ్డి ప్రతినిధి అని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డిని కావాలనుకునేవారు అన్ని నియోజకవర్గాలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తారని, జగన్మోహన్ రెడ్డి దరిద్రం వదిలించుకోవాలనుకునే ఎక్కువ స్థానాలలో పోటీ చేస్తున్న తెదేపా ఎన్నికల గుర్తు సైకిల్ పై, జనసేన ఎన్నికల గుర్తు గ్లాస్, బిజెపి ఎన్నికల గుర్తు కమలంపై ఓటేస్తారన్నారు. కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడుని బలపరచాలనుకునే ఓటర్లంతా రాష్ట్రంలో ఎక్కడైనా ఇలా తెదేపా ముసుగులో వైకాపా బలపరిచిన అభ్యర్థులు పోటీ లో ఉంటే వారిని పట్టించుకోకుండా, దయచేసి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. టిడిపి ముసుగులో జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట తీసుకుని, వైకాపా ప్రభుత్వం వస్తే పదవులను అనుభవించాలనుకునే వారిని ఓడించాలని కోరారు.

జగన్మోహన్ రెడ్డి ని కావాలనుకునే వారికి ఉండి నియోజకవర్గంలో రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. వైకాపా తరపున పోటీ చేస్తున్న నరసింహారాజు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, శివరామరాజుకు రెండు రెక్కల ఫ్యాన్ గుర్తు ఇస్తారేమో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆయన గుట్టు తెలిసిందని, గుర్తు తెలియదన్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమానులకు బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉండగా, కూటమి నాయకులకు కార్యకర్తలకు తెదేపా తరుపున ఒకే ఒక అభ్యర్థిగా నేనున్నానని తెలిపారు . టిడిపి ముసుగులో తెదేపా కార్యకర్తల వద్దకు రావాలని భావిస్తున్న వారికి ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు సరైన సమాధానం చెబుతారన్నారు.

ఉండి నియోజకవర్గం కార్యకర్తలు అంటేనే తెలుగుదేశం పార్టీకి కట్టుబడిన కార్యకర్తలను పేర్కొన్నారు. టిడిపి ముసుగులో వైకాపా పార్టీతో కలిసి టిడిపి రెబెల్ అభ్యర్థిని చెప్పుకొని తిరిగితే నిజమైన టిడిపి కార్యకర్తలు నమ్మరన్నారు. 20వేల మంది కి చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేసినా , ఆ విందు భోజనానికి హాజరైన వారిలో ఎక్కువ మంది వైకాపా కార్యకర్తలే ఉన్నారన్నారు. విందు భోజనం అంటే ఎవరైనా వస్తారని, ఓటు మాత్రం వేయరని శివరామరాజు గుర్తిస్తే మంచిదన్నారు. ఎవరైనా టిడిపి కార్యకర్తలు శివరామరాజు ఇచ్చిన విందు భోజనానికి తెలియక హాజరైతే, మన గుర్తు సైకిల్ గుర్తు అని గుర్తించాలన్నారు.

ఇదే పరిస్థితి నెలకొన్న నియోజకవర్గాలలోని కార్యకర్తలంతా మనది సైకిల్ గుర్తు అని, సైకిల్ గుర్తుపైనే ఓటు వేయాలని రఘు రామకృష్ణంరాజు కోరారు. ఉండి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థులు ఆ పార్టీ ఓట్లను సమానంగా పంచుకుంటారేమోతెలియదు కానీ, తెదేపా, జనసేన, బిజెపి కార్యకర్తలు, సానుభూతిపరులు, ఏ పార్టీకి సంబంధం లేని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకుల ఓట్లన్నీ టిడిపికే పడుతాయని నా నమ్మకమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నా నమ్మకం నిజమవుతుందన్న పరిపూర్ణ విశ్వాసం నాకు ఉందని తెలిపారు.

రామరాజే ముందుండి నన్ను నడిపిస్తున్నారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రామరాజే ముందుండి నన్ను నడిపిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా మేమిద్దరం కలిసి తిరుగుతున్నామని చెప్పారు. ఎక్కువ వాహనాలలో వెళ్లకుండా కాలినడకనే ఓటర్లను కలుసుకుంటున్నామని, ఎక్కువ వాహనాలను వినియోగిస్తే ఎన్నికల కమిషన్, ఆ ఖర్చును అభ్యర్థి ఖాతాలో రాసే ప్రమాదం ఉందన్నారు. ఈరోజు కూడా మూడు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని కలిసి నిర్వహించామని తెలిపారు. మీరు చెబుతున్న రెండవ వ్యక్తి ఫిజికల్ పార్టీ మారకపోయినప్పటికీ, గతంలోని నా సొంత పార్టీతో కెమికల్ బాండింగ్ ఉండి ఉందేమోనన్నారు.

ఇప్పుడు అది ఫెవికాల్ కంటే తీవ్రమైన బంధంగా మారిందన్నారు. ఆయన్ని పార్టీ మారవద్దని నేను కోరాను. నూటికి నూరుపాళ్లు ప్రభుత్వం వస్తుందని, వైకాపా చరిత్రలో కూడా మిగిలినదని నాతోపాటు పార్టీ పెద్దలు కూడా చెప్పి చూశారన్నారు. అయినా ఆయన వినిపించుకోలేదని తెలిపారు. ఇంత భారీ ఎత్తున నామినేషన్ వేసిన తర్వాత ఆయనకు పార్టీకి తెగ తెంపులైనట్టే భావించాలన్నారు. ప్రస్తుతం ఆయన మానసికంగా వైకాపా లో ఉన్నారని, నామినేషన్ వేశారు కాబట్టి తెదేపా క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంటుందేమో చూడాలన్నారు. శివరామరాజు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు . 2014లో తిరిగి ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో, టికెట్ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఒకరు ఉన్నారని, అది నేనేనని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

ఆయనకు గతంలో నా వల్లే సీటు వచ్చిందని… నేను ఆయన్ని పార్టీ వీడకుండా అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని తెలిపారు. శివరామరాజు దృష్టిలో వైకాపా అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీ నాయకత్వం పదవి ఇస్తుందని భావిస్తున్నారేమోనని అన్నారు. నరసింహ రాజు, శివరామరాజు మధ్య ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయోనని పోటీ నెలకొందన్న రఘురామ కృష్ణంరాజు, ప్రస్తుతం నా వెనుక ఎవరూ లేరని శివరామకృష్ణం రాజు బుకాయించవచ్చు. ఎన్నికల అనంతరం ఆయన, వైకాపాలో చేరవచ్చునన్నారు.

నేను అభ్యర్థి కావడంతో వైకాపా నుంచి కూడా ఆయనకు పోటీ చేయాలని ఒత్తిడి ఉండి ఉండవచ్చునని అన్నారు. శివరామరాజు పోటీ వల్ల నాకు ఓట్లు తగ్గుతాయని అనుకుంటున్నారని, వైకాపా మద్దతుదారులతోనే శివరామరాజు ఎక్కువగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని , శివరామరాజు పోటీ చేయడం వల్ల నాకు మేలే జరుగుతుందని తెలిపారు. వారి వేలితో వారే కన్నెపొడుచుకుంటున్నారని, పాత మిత్రుడిగా ఆయన్ని అభ్యర్థించానని కానీ ఆయన నాకు మేలు చేసేందుకు పోటీ చేస్తున్నారన్నారు

Leave a Reply