– ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వరకు నేను ఉంటాను
– నేను సినిమా నటుడిని కాదు…. కానీ అద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తోంది
– ఒక్క చాన్స్ అని కరెంట్ తీగను పట్టుకుంటారా అన్నాను…మీకు గుర్తుందా….?
– ఇప్పుడు ఏం జరుగుతోంది…..నేను నాడు చెప్పిందే జరుగుతుంది కదా
-మద్యం డబ్బు అంతా ఇంట్లోకి పోతోంది. వాటికే జగన్ బటన్ నొక్కేది
-ఇంత నీచమైన సిఎంను ఎక్కడా చూడలేదు
-నిడదవోలులో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో
తనకు ఇవి చివరి ఎన్నికలు కావని, వైసీపీని భూస్థాపితం చేసేవరకూ తాను ఉంటానని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. నిడదవోలు సభలో ఆయన సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. రోడ్ షోలో టిడిపి అధినేత చంద్రబాబు ఏమన్నారంటే..
ఎన్నో సార్లు నేను నిడదవోలు వచ్చాను…కానీ ఎప్పుడూ ఇంత ఆదరణ చూడలేదు. నేను సినిమా నటుడిని కాదు….నా సినిమా రిలీజ్ కాలేదు. కానీ అద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తోంది. నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు…..రాష్ట్రం నాశనం అవుతుంటే కాపాడుకునే బాధ్యత నాపై ఉంది. అందుకే వచ్చాను. నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశాను…కానీ ఇంత నీచమైన సిఎంను ఎక్కడా చూడలేదు.
ఎపికి చెందిన అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్లిపోయింది. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి నిదర్శనం. అమర్ రాజా రూ.9,500 కోట్ల పెట్టుబడి పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయింది. పార్టీలో ఎవరూ సొంత అజెండాలు వద్దు…ప్రజా అజెండానే మన అజెండా కావాలి. అమర్ రాజాకు రాజశేఖర్ రెడ్డి భూమి ఇస్తే ఆయన కొడుకు ఆ కంపెనీని ఇబ్బంది పెడుతున్నాడు.
నాడు తెచ్చిన రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు పూర్తి గా వచ్చి ఉంటే 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవి. ఎపికి చెందిన వ్యక్తి తెలంగాణలో పెట్టుబడులు పెట్టుకోవాల్సిన పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోతుందిఅత్యున్నత శిఖరాలకు వెళ్లిన నారాయణ సంస్థల అధిపతి నారాయణను బెదిరించారు
నిన్న పోలవరం వెళితే అడ్డుకున్నారు. 22 సార్లు పోలవరంలో పర్యటించాను. 82 సార్లు రివ్యూ చేశాను.ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని దూరదృష్టితో పనిచేశాను.ముంపు మండలాలు ఎపికి ఇస్తే తప్ప సిఎంగా ప్రమాణస్వీకారం చెయ్యను అని కేంద్రానికి చెప్పాను.దీంతో అప్పుడు 7 మండలాలను ఎపిలో కలిపారు.
దుర్మార్గపు ముఖ్యమంత్రి పోలవరాన్ని గోదాట్లో ముంచేశాడు.పోలవరంలో జరిగింది చూస్తే కడుపు రగిలిపోతుంది. ప్రశ్నిస్తున్న నాపై దాడి చేస్తున్నారు… ఇది నాకు చివరి ఎన్నికలు కాదు….వైసిపి సైకోలను భూ స్థాపితం చేసే వరకు నేను ఉంటాను. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే వరకు నేను ఉంటాను. యువత అంతా నా మీటింగ్ లకు తరలి వస్తున్నారు. వారిలో కసి కనిపిస్తోంది.
రేపు ఏం కావాలి అని ఆలోచించి పని చేస్తా…అందుకు హైదరాబాద్ ఒక ఉదాహరణ.సంక్షేమానికి, అభివృద్దికి నాంది పలికిన పార్టీ టిడిపి.ఇదేం ఖర్మ రాష్ట్రానికి అని పేరు పెడితే చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు అదే కరెక్ట్ అని అన్ని వర్గాలు అంగీకరించాయి.వివేకా హత్యకేసులో సునితా రెడ్డి పోరాటంతో తండ్రి కేసు తెలంగాణకు బదిలీ చేశారు.
అందుకే ఇదేంఖర్మ రాష్ట్రానికి అని అంటున్నా….ఎపికి అన్నీ ఉన్నాయి…..కానీ అల్లుడి నోట్లో శని ఉంది. ఆ శని జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రానికి శనిలా పట్టిన జగన్ ను వదిలించుకోవాలి.ఇప్పుడే సర్పంచ్ లు కలిశారు. వారి బాధలు చెప్పుకున్నారు. వాళ్లే చీపుర్లు పట్టి రోడ్లు ఊడ్చే పరిస్థితికి వచ్చారు. వాళ్లే అంటున్నారు ఇదేం ఖర్మ మా సర్పంచులకు అని. ఉద్యోగస్తులు అందరినీ బెదిరించాడు….ఇప్పుడు టీచర్లు ఎన్నికల్లో విధులు చేపట్టకూడదు అని ఉత్తర్వులు తెచ్చాడు.
నా జీవితంలో ఒకే వర్గానికి పని చేసింది లేదు. మాది సామాజికవర్గం పార్టీ. తెలుగుదేశం అన్ని వర్గాల పార్టీ.సిఎం, చీఫ్ సెక్రటరీ, డిజిపి, సలహాదారు సజ్జల..ప్రభుత్వంలో అంతా ఒకటే జిల్లా…ఒకటే వర్గం.రాష్ట్రంలో ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదు. ప్రశ్నిస్తే పోలీసులతో బెదిరింపులు. నాడు సమర్థవంతంగా పనిచేసిన పోలీసులు ఇప్పుడు గోడలు దూకుతున్నారు.
తప్పు చేసిన వాడు జైల్లో ఉండాలి…కాని ఇప్పుడు తప్పు చేసిన వాళ్లు అధికారంలో ఉన్నారు. అదే మన ఖర్మ. ఒక సైకోకు అధికారం ఇచ్చి ఇప్పుడు అంతా బాధపడుతున్నారు. నాడు ముద్దులకు పడిపోయారు….ఒక్క చాన్స్ అంటే నమ్మి ఇచ్చారు. సిఎం పరదాలు కట్టుకుని మీటింగ్ లు పెట్టుకుంటున్నాడు.
జాబు రావాలంటే బాబు రావాలి. రైతులు బాగు పడాలి అంటే టిడిపి ప్రభుత్వం రావాలి.సిఎం బటన్ నొక్కితే గేట్లు తెరుచుకుంటాయి…ఇసుక డబ్బు అంతా ఇంట్లోకి పోతోంది.మద్యం డబ్బు అంతా ఇంట్లోకి పోతోంది. వాటికే జగన్ బటన్ నొక్కేది.ఇసుక ఇప్పుడు బంగారం అయ్యింది. ఎక్కడా దొరకడం లేదు..
కొత్త కొత్త మద్యం బ్రాండ్లు తెచ్చాడు ఈ ముఖ్యమంత్రి. వీటి తయారీ అంతా జగన్ చేతుల్లోనే ఉంది. అతని కంపెనీలే తయారీ, వాళ్లే సరఫరా, వాళ్లే అమ్మకం.. నిన్న ఎ2 ఫోను పోయింది అని ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఫోన్ పట్టుకున్నారా.?
ఎంపి సాయిరెడ్డి ఫోన్ పోయిందని ఫిర్యాదు ఎందుకు ఇచ్చాడు.? ఎల్ బి క్రియేట్ చెయ్యడానికి ముందే ఫోన్ పోయింది అని ఫిర్యాదు చేశాడు. డిజిపి విచారణ చెయ్యవచ్చు కదా….ఎందుకు చెయ్యడం లేదు.? జగన్ రెడ్డికి ఓటేస్తే అమరావతి ఉండదని నాడు చెప్పాను…..పోలవరం అపేస్తాడు అని చెప్పానుఒక్క చాన్స్ అని కరెంట్ తీగను పట్టుకుంటారా అన్నాను…మీకు గుర్తుందా….?ఇప్పుడు ఏం జరుగుతోంది….. నేను నాడు చెప్పిందే జరుగుతుంది కదా?ఏ వర్గం కూడా భయపడాల్సిన పనిలేదు..మీరు పోరాడండి మీకు అండగా నేను నిలడబతాను.