Suryaa.co.in

Andhra Pradesh

ఇది సైకో పాలన..అందుకే జగన్ కు సైకో అని పేరు

-ఎస్సీలపై పెట్టిన దొంగ కేసులు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కొట్టేస్తాం
-సింగల్ పేజీలో యువత మేనిఫెస్టో ఉంటుంది
-చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కాపుకండ్రికలో ఎస్సీలతో నారా లోకేష్ ముఖాముఖి

ముఖాముఖిలో నారా లోకేష్ ప్రసంగం :-
• ఎస్సీ సోదరులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకునేందుకే మీ ముందుకొచ్చా.
• అధికారంలోకి వచ్చేది టీడీపీయే. దళితులకు ఏం కావాలో నేరుగా తెలుసుకుంటున్నా.
• దళిత ద్రోహి జగన్. దళితులు ఓట్లతో గెలిచి వాళ్లకే వెన్నపోటు పొడిచారు.
• సబ్ ప్లాన్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో నిధులు కేటాయించి అభివృద్ధికి ఖర్చు చేయాలి. దశాబ్ధాలుగా పేదరికంలో ఉన్న దళితులను బయటకు తెచ్చేందుకు సబ్ ప్లాన్ నిధులు వినియోగిస్తారు.
• టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు దళితుల నిధులను దారి మళ్లించలేదు. కానీ జగన్ సీఎం అయ్యాక దళితులకు ప్రత్యేకంగా కేటాయించలేదు. అమ్మఒడి, పెన్షన్లు కూడా సబ్ ప్లాన్ కింద చూపిస్తున్నారు.
• డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దళిత వర్గానికి చెందిన వ్యక్తి. ఒక్కరికన్నా.. సబ్సీడీ, లోన్లు వచ్చాయా.?
• ఈ నియోజవకర్గంలో నడుస్తుంటే గుంతల్లో రోడ్లను ఎతుక్కునే పరిస్థితి.
• దళితుల సమస్యలపై ఏనాడైనా సీఎంను నారాయణ స్వామి అడిగారా.? జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుర్చీల్లో కూర్చుంటే వారి వెనక నారాయణ స్వామి చేతులు కట్టుకుని కూర్చుంటారు.
• చంద్రబాబు పక్కన డిప్యూటీ సీఎంలు, మంత్రులు కూర్చునేవారు.
• దేశంలో ఎక్కడా ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెట్టలేదు. కానీ మన రాష్ట్రంలో పెడుతున్నారు.
• దామాషా ప్రకారం ఎక్కువ నిధులు కేటాయిస్తాం. పాదయాత్రలో చూశా..చాలా మంది దళిత పిల్లలు బెంగళూరులో ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
• డాక్టర్ చదవడం చాలా కష్టం. విశాఖలో డాక్టర్ సుధాకర్ మాస్కుల కోసం పోరాడితే ఈ ప్రభుత్వం పిచ్చివాడిగా ముద్ర వేసి చంపేసింది. పుంగనూరులో కల్తీ మద్యంపై ఓంప్రతాప్ అనే యువకుడు మాట్లాడితే చంపేశారు.
• తూర్పు గోదావరిలో వైసీపీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ ను కొట్టి చంపి శవాన్ని ఇంటి దగ్గర వదిలిపెట్టారు. యాక్సిడెంట్ లో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. చీరాలలో మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపారు. కానీ అట్రాసిటీ కేసు ఎందుకు కేసు పెట్టలేదు.?
• అట్రాసిటీ చట్టం ఎత్తేయాలని దేశంలో చర్చ జరిగింది. అట్రాసిటీ చట్టం కొనసాగాలి చంద్రబాబు స్పష్టం చేశారు.
• చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దళితులపై దాడులు, ఆత్మహత్యలు జరిగాయా.? ఇది సైకో పాలన..అందుకే జగన్ కు సైకో అని పేరు.
• టిడ్కో ఇళ్లను ప్రతి ఒక్కరూ చూడాలి. అపార్టుమెంట్లకు ధీటుగా టిడ్కోఇళ్లను నిర్మించాం. షేర్ వాల్ టెక్నాలజీతో ఇళ్లు నిర్మించాం. గ్రానైట్ రాయి, టైల్స్ తో బాగా నిర్మించాం. కానీ వాటిని ఇవ్వకుండా ఈ సీఎం ఆపేశాడు.
• టిడ్కో ఇళ్లకు కట్టే రుణాన్ని మాఫీ చేస్తానన్నాడు.
• నారాయణ స్వామి కూడా ఈ ప్రభుత్వం చేతిలో బానిస
• విదేశీ విద్యకు పేరు మార్చడమే కాదు..పథకాన్నే జగన్ రెడ్డి ఎత్తేశారు. దళితులు అభివృద్ధి చెందేందుకే విదేశీ విద్య ప్రవేశపెట్టాం.
• అధికారంలోకి రాగానే మళ్లీ విదేశీ విద్య తీసుకొస్తాం..అంబేద్కర్ పేరు కొనసాగిస్తాం.
• ఏపీ చరిత్రలో మొదటి సారిగా దళితుల చేతుల్లో భూమి తగ్గింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా దళితుల భూములు కొట్టేస్తున్నారు.
• అధికారంలోకి రాగానే భూ పంపిణీ చేస్తాం. ఏ ఎమ్మెల్యే, ఏపార్టీకి చెందిన వాళ్లయినా భూములు లాక్కుంటే వాటిని మళ్ళీ దళితులకు అప్పగిస్తాం.
• కోర్టులో కేసుల్లో ఎక్కువగా రెవెన్యూ కేసులో ఉన్నాయి. గతంలో చంద్రబాబు విశాఖ, సింహాచలం భూముల్ని రెగ్యులర్ చేసి పట్టాలు అందించారు.
• డీకేటీ పట్టా విషయంలో కర్నాటక మోడల్ చేయాలని నా అభిప్రాయం. పార్టీలో పెద్దలతో చర్చించి ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచిస్తాం.
• బీహార్, యూపీలో పెట్టుబడులు పెడుతున్నారు. మన రాష్ట్రానికి రావడం లేదు.
• ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కేసులు. అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పెట్టి..చైతన్య పరుస్తున్నాం.
• ఎస్సీలపై పెట్టిన దొంగ కేసులు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కొట్టేస్తాం. దొంగ కేసులు బనాయించిన అధికారులపై జ్యుడిషియల్ విచారణ చేయించి చట్టపరంగా శిక్షిస్తాం.
• చంద్రబాబు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు..అమలు చేశారు. కానీ జగన్ 300 యూనిట్లు ఫ్రీ అన్నాడు..అమలు చేయలేదు. సర్వీస్ కు డబ్బులు కట్టలేని దళితులకు ఉచితంగా అమర్చుతాం.
• బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్ల గురించి అడిగితే ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లను మార్చాం అని మేరుగ నాగార్జున అన్నారు. నియామకాలు లేకుండా ధీటుగా ఎలా తయారవుతాయి.?
• బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్ల బిల్లులను ఈ ప్రభుత్వం ఇంకా చెల్లించలేదు. కేజీ టు పీజీ సిలబస్ ను ఇంకా పతిష్టం చేయాలి. బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్లు లేని చోట ప్రైవేటు స్కూళ్లలో చేరిన వారికి ఫీజు రీయింబర్స్ చేస్తాం.
• సిస్టమ్యాటిక్ గా ఉద్యోగాల నియామకం ఉండాలి. ప్రభుత్వ చేతకాని తనం వల్ల యువత ఇబ్బందిపడుతున్నారు. ఇష్టమొచ్చినట్లుగా ఏపీపీఎస్సీని మార్చారు. ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాలను ప్రోత్సహించాలి. స్వయం ఉపాధికి బాటలు పడాలి. సింగల్ పేజీలో యువత మేనిఫెస్టో ఉంటుంది.

LEAVE A RESPONSE