Suryaa.co.in

Political News

ఇదీ .. చంద్రబాబు -జగన్మోహన్ రెడ్డికి తేడా

ఆంధ్రుడా… మీకు అర్ధమవుతోందా?

అది 1998 …
దేశంలో మొట్టమొదటి త్రిబుల్ ఐటీ ని హైదరాబాదులో ఏర్పాటు చేయటానికి నిర్ణయం జరిగిన సందర్భం.

రాష్ట్రానికి వచ్చిన అరుదైన అవకాశాన్ని వీలైనంత త్వరగా ఆచరణలో పెట్టాలన్న ఉద్దేశంతో…..
ఒక కొత్త క్యాంపస్ ని,నూతన భవనాలను నిర్మించిన తర్వాత కోర్సులు ప్రారంభించడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి….
హైదరాబాద్ నగరంలో అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించమని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

హైదరాబాదు నగర శివారులో గచ్చిబౌలిలో,రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం కోసం నిర్మించబడి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న భవనాల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు.
అప్పటికే హైదరాబాద్ నడిబొడ్డున లకిడికపూల్ లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం పనిచేస్తుంది కాబట్టి…..
గచ్చిబౌలిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న భవనాలను యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతిష్టాత్మకమైన త్రిబుల్ ఐటీ సంస్థకు కేటాయించడం జరిగింది.
విద్యా సంవత్సరం ప్రారంభించడం జరిగింది.

ఈ నిర్ణయం లో ఉన్న పాజిటివ్ అంశం ఏంటంటే…
రంగారెడ్డి జిల్లాకు కొత్త కలెక్టర్ కార్యాలయం ఇంపార్టెంట్ విషయమే…కానీ అర్జెంటు విషయం కాదు.

ఇంపార్టెంట్ విషయాలకు…అర్జంట్ విషయాలకు తేడా తీసుకోవడం మంచి పాలకుడి లక్షణం.

కలెక్టర్ కార్యాలయం అంటే….ఒక సాధారణ ప్రభుత్వ భవనం.కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పని చేసుకునే భవన సముదాయం.

హైదరాబాద్ నడిబొడ్డున లకిడికాపూల్ లో ఉన్న రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం అన్ని విధాల సౌకర్యవంతంగానే ఉండేది.

కానీ….
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం…రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండాలి అనే ఒకే ఒక కారణం వల్ల అప్పట్లో గచ్చిబౌలిలో నూతన భవన సముదాయాన్ని సిద్ధం చేయడం జరిగింది.

సిద్ధంగా ఉన్న భవనాలలో ఒక ప్రతిష్టాత్మక విద్యా సంవత్సరం ప్రారంభించడం వల్ల….కొన్ని వందల మంది బోధన బోధనేతర సిబ్బందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి.కొన్ని వందల మంది జాతీయస్థాయి ప్రతిభావంతులైన విద్యార్థులకు
విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.
ఇది దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేసే నిర్ణయం. ఆరోజు చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల
గత 25 సంవత్సరాల లో హైదరాబాదు త్రిబుల్ ఐటీ నుండి కొన్ని వేలమంది ప్రపంచస్థాయి సంస్థలలో ఉన్నత స్థానాలకు ఎదిగారు. మనం అంచనా వేయలేనంత నాలెడ్జ్ ఎకానమీ అభివృద్ధికి బాటలు వేశారు.

ఇక జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే…..
విశాఖపట్నం- రిషికొండ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో,వేలకోట్ల పెట్టుబడి లక్ష్యంగా నిర్మించిన, వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నిర్మించిన…. మిలీనియం టవర్ ని…. ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పేరుతో…. నెలలో ఒకటి రెండు సార్లు…. సరదాగా విశాఖపట్నం వెళ్లే( ట్రాన్సిట్ ఎకామిడేషన్ అని జీవోలోనే పేర్కొన్నారు) రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కేటాయించటం…. అత్యంత బాధ్యతారాహిత్యం…. అభివృద్ధి నిరోధకం.
ఎందుకంటే….ఒక ప్రాంతంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే కంపెనీలు చూసే మొట్టమొదటి అంశం… మౌలిక సదుపాయాల అభివృద్ధి.
ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే…..
ఒక మామూలు ప్రభుత్వ కార్యాలయ భవనాన్ని …చంద్రబాబు నాయుడు ఒక నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా తీర్చిదిద్దితే.

ఒక గ్రోత్ ఇంజన్ లాంటి
రిషి కొండ మిలీనియం టవర్స్ ని….జగన్మోహన్ రెడ్డి….ఒక మామూలు ప్రభుత్వ కార్యాలయంగా మార్చాడు.

ఆంధ్రుడా తేడా గమనించు…అరాచకాన్ని బంగాళాఖాతంలో ముంచు.

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

LEAVE A RESPONSE