– స్పష్టత ఇచ్చిన ఎన్నికల కమిషన్
-జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తొలగిన గందరగోళం
విజయవాడ: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో టీచర్ ఓటర్లలో నెలకొన్న గందరగోళానికి ఎన్నికల సంఘం తెరిదించింది. ఆ ప్రకారంగా టీచరు నియోజకవర్గాల ఎన్నికల పరిథి ఇదీ..
తూర్పు – పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలోకి కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు, ద్వారకాతిరుమల, పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, టి నర్సాపురం, కుక్కునూరు, వేలేరుపాడు, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, జంగారెడ్డిగూడెం మండలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం, ఏజెన్సీ గంగవరం, అడ్డతీగల, వై రామవరం, దేవీపట్నం, రాజవొమ్మంగి, మరేడుమిల్లి, చింతూరు. వరరామచంద్రాపురం, ఎటపాక, కూనవరం మండలాలు ఉంటాయి.
శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజకవర్గం పరిధిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ, పెదబయలు, డుంబ్రిగూడ, మంచంగిపుట్టు, హుకుంపేట, అనంతగిరి, పాడేరు, జి మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు మండలాలు వస్తాయి.
కడప – అనంతపురం – కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాలు, అన్నమయ్య జిల్లాలోని నందలూరు, రాజంపేట, టి చుండుపల్లి, వీరబల్లి, చిట్యాల, కోడూరు, ఓబులవారిపల్లె, పెనగలూరు, పుల్లంపేట, రాయచోటి, చిన్నముండెం, గాలివీడు,
ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గం పరిధిలో ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు, బాపట్ల జిల్లాలోని చీరాల, వేటపాలెం, ఆద్దంకి, జె పంగలూరు, సంతనూతలపాడు, బల్లికురవ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు, అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కురబలకోట, పెద్దతిప్పసముద్రం, బి కొత్తకోట, గుర్రంకొండ, కలకడ, కెవి పల్లె, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, చిత్తూరు. తిరుపతి మండలాలు ఉంటాయి.
కృష్ణా – గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలు, ఏలూరు జిల్లాలోని నూజివీడు, ముసునూరు, చాట్రాయి, ఆగిరిపల్లి, కైకలూరు, కదిలిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాలు, బాపట్ల జిల్లాలోని వేమూరు, కొల్లూరు, చుండూరు, భట్టిప్రోలు, అమృతలూరు, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, రేపల్లె, బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం మండలాలు ఉండనున్నాయి.