సూర్యుడి చుట్టూ భూమితో సహా ఇతర రాతి గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? 460 కోట్ల సంవత్సరాల క్రితం ఏం జరిగింది? ఇలాంటి రహస్యాలు ఛేదన దిశగా ఖగోళ శాస్త్రజ్ఞులు ముందడుగు వేశారు. అంతరిక్షంలో సూర్యుడి లాంటి ఒక బేబీ స్టార్ చుట్టూ గ్రహాలు ఏర్పడుతున్న తొలి దశను వాళ్లు కనుగొన్నారు. కొత్త ప్రపంచాలు ఆవిర్భవించే క్షణాలు ఇలాగే ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
విశ్వంలో కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాల పుట్టుక వాటి రహస్యాలను తెలుసుకునేందుకు మనిషికి ఎల్లప్పుడూ ఆసక్తి ఉంటుంది. మన సౌరవ్యవస్థ ఎలా ఆవిర్భవించిందన్న రహస్యాన్ని ఛేదించడానికి మనిషి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఖగోళ పరిశోధనల్లో ఒక పెద్ద విజయాన్నే నమోదు చేశాడు. అంతరిక్షంలో సూర్యుడు లాంటి ఒక బేబీ స్టార్ చుట్టూ ఉన్న వాయువుల నుంచి గ్రహాల లాంటి రాతి శకలాలు ఏర్పడుతున్న దాఖలను కాఙ్మాలజిస్టులు కనుగొన్నారు.
ఇది మన సౌరవ్యవస్థ ఆవిర్భావ రహస్యాన్ని ఛేదిస్తుందని వాళ్లు భావిస్తున్నారు. గ్రహ నిర్మాణం ప్రారంభమైన టైం జీరో క్షణాన్ని ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలిసారి అని ఆస్ట్రోఫిజిసిస్టులు చెబుతున్నారు.
– సూరజ్ భరద్వాజ్