– ఏపీలో పతనమవుతున్న శాంతిభద్రతలు
– హోంమంత్రి రాజీనామా చేయాలి
– టీడీ పీ ఆఫీసుపై దాడి చేసిన ముష్కరులపై చర్యలేవీ?
హోంమంత్రి రాజీనామా చేయాలి
– టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ
అమరావతి ఉద్యమానికి మద్దతునిచ్చేందుకు వచ్చిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్పై వైసీపీ కిరాయి గూండాల దాడి పోలీసుల వైఫల్యానికి పరాకాష్ఠ. దీనికి బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలి. ఏపీలో అదుపుతప్పుతున్న శాంతిభద్రతలపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించాలి. ఇందులో కొందరు పోలీసు అధికారుల పాత్ర కూడా ఉంది. దానిపై విచారణ జరపాలి. ఇన్నేళ్ల నా రాజకీయ చరిత్ర, అనుభవంలో పోలీసులను ఇంత దారుణంగా వాడుతున్న ప్రభుత్వాలేవీ లేవు. సత్యకుమార్-ఆదినారాయణరెడ్డి వాహనంపై వైసీ గూండాలు రాళ్లు వేసి, రౌడీయిజం చేస్తున్న అక్కడే ఉన్న పోలీసులు చోద్యం చూడ టం దారుణం. ఈ రాష్ట్రంలో.. ముఖ్యంగా డీజీపీ ఆఫీసు ఉన్న జిల్లాలో, మాజీ సీఎం చంద్రబాబునాయుడు నుంచి జాతీయ పార్టీ నాయకుడు సత్యకుమార్ వరకూ రక్షణ లేకపోవడం సిగ్గుచేటు. గతంలో టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంపై అమానవీయంగా దాడి చేసిన రౌడీమూకలపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడం బట్టి, పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదని తేలిపోతోంది. పోలీసులు తరిగిపోతున్న తమ ప్రతిష్ఠను నిలబెట్టుకోకపోతే, భవిష్యత్తు వారికి గౌరవం ఇవ్వదు. ఒకప్పుడు ఏపీ ప్రతిష్ఠ పెంచిన పోలీసులు ఇప్పుడు దానిని దిగజారనీయకుండా చూసుకోవడం వారి నైతిక బాధ్యత.