– కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
ఆనాటి దేశ స్వతంత్ర సంగ్రామ ఉద్యమం గుర్తు తెచ్చుకునే విధంగా కృష్ణమ్మ ఉగ్రరూపం ఆంధ్రుడి ఆక్రోషం కట్టలు తెంచుకొని ఉదృతంగా ఉరకలు వేసే ఉద్యమ కెరటంలా ఎగిసిపడే జన సాగరం.జాతిపిత స్ఫూర్తి తో అమరావతి రాజధాని కోసం శాంతియుతంగా,నిరంతరాయంగా పోరాడిన మహిళామూర్తులా త్యాగఫలమే! ఈనాటి విజయం.
రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర రాజధాని కోసం పంట పండే పచ్చటి పొలాలను త్యాగం చేసి, ఎంతమంది హేళన చేసిన అవమానించిన అమరావతే రాజధాని అని నిర్విఘ్నంగా సాగిన ఆ మహా యజ్ఞం లో, నేను పాల్గొన్నందుకు సంతృప్తిగా ఉంది.
అమరావతి రైతుల కృషి- పట్టుదల కార్యదీక్షిత పోరాటం త్యాగం చరిత్రలో మరిచిపోని సంఘటనగా చెప్పుకోవాలి. ఏదేమైనా మీరందరూ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాభివృద్ధి పథంలో భాగస్వామ్యులు కావాలని, అమరావతి రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలని ఆశిస్తూ మీ అందరి పోరాట ఉద్యమ స్ఫూర్తికి నా అభినందనలు, శుభాకాంక్షలు.