Suryaa.co.in

Andhra Pradesh

బాబును కలిసిన సీఎస్, డీజీపీ

– సీఎస్‌కు పెద్దగా స్పందించని బాబు?
– వివరణ ఇవ్వబోయే ప్రయత్నం చేసిన సీఎస్?
– సెలవుపై సీఐడీ చీఫ్ సంజయ్
– సెలవుపై వెళ్లేందుకు మరికొందరు?

ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ముఖ్యులు కలుస్తున్నారు. సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా బాబును ఆయన నివాసంలో కలసి అభినందించారు. ప్రమాణస్వీకార ఏర్పాట్లపై వారిద్దరూ ఆయనతో చర్చించారు. కాగా సీఎస్ జహహర్‌రెడ్డి కలిసిన సందర్భంలో, బాబు ముభావంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఏదో చెప్పబోతున్న సందర్భంలో బాబు దానికి ప్రాధాన్యం ఇవ్వలేదని సమాచారం. కాగా చంద్రబాబునాయుడు విపక్ష నేతగా ఉండగా, ఆయన సహా టీడీపీ ప్రముఖలందరినీ కేసులు పెట్టి అరెస్టు చేయించిన సీఐడీ చీఫ్ సంజయ్, అకస్మాత్తుగా సెలవుపై విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశమయింది. జగన్ హయాంలో ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో రెచ్చిపోయిన మరికొందరు ఐపిఎస్‌లు కూడా ఇప్పుడు సెలవుపై విదేశాలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

LEAVE A RESPONSE