Suryaa.co.in

Features

ఆ బ్రాండ్ల కిక్కే వేరు బాసూ!

అప్పుడూ ఉన్నాయి.. ఇప్పుడూ ఉన్నాయి. కాలక్రమంలో మనం వినియోగించే ప్రోడక్ట్స్ మారుతూ ఉంటాయి. యాభై ఏళ్లు క్రితం ఉన్న పాపులర్ వస్తువులు ఇప్పుడు దొరక్కపోవచ్చు. ఐతే అప్పుడు ఇప్పుడు కూడా ఉన్న కొన్ని పాపులర్ ప్రోడక్ట్స్ పై ఓ లుక్కేద్దాం.

పియర్స్ సబ్బు 110 ఏళ్ల క్రితం నాటిది. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ట్రాన్స్ పెరంట్ సోప్ ఇది. తల్లీ బిడ్డ అనుబంధాన్ని తెలిపే యాడ్ అప్పుడూ ఉంది ఇప్పుడూ ఉంది.

5 star చాక్లెట్ కూడా లండన్ కి చెందినదే. 1971 లో ఇది చాలా ఖరీదైన చాక్లెట్.. ధర ఒక రూపాయి. ఇప్పుడు 20 50 పైనే.. ఐనా కొనేస్తున్నారు చాలామంది.

అమూల్ టేస్ట్ ఆఫ్ ఇండియా స్లోగన్ అప్పుడూ ఇప్పుడూ ఫేమస్సే. పాపులర్ పాల ఉత్పత్తులను అందించే భారతీయ సంస్థ గుజరాత్ రాష్ట్రం ఆనంద్ లో ఉంది. బేబి.. వీరి యాడ్స్ లో ఉంటుంది.

లక్స్.. తెలుపు మరియు నాలుగు వానవెల్లి రంగులలో దొరికే సబ్బు, సినీతారలు సౌందర్య రహాస్యం అంటూ లక్స్ యాడ్స్ వచ్చేవి. సినిమా తారలు ఈ యాడ్స్ కి ఆధారం. లక్స్ తొలుత బట్టలుతికే సబ్బుగా పుట్టి 1925లో వందేళ్ల క్రితం స్నానపు సబ్బుగా మారిందన్న సంగతి ఇప్పుడు ఎవ్వరికీ తెలియదు. ఈ బ్రిటిష్ ఉత్పత్తి ఇప్పుడు వంద దేశాల్లో లభ్యం. లక్స్ ప్రకటనలో అగుపించిన తొలి సినీతార.. లీలా చట్నీస్ 1941లో. యాభైవ దశకంలో మహానటి సావిత్రి ఫోటోతో లక్స్ కేలండర్లం వచ్చాయి.

వందేళ్ల చరిత్ర గల ఈనో కడుపుబ్బరాన్ని చిటికెలో దూరం చేస్తుందని చెబుతుంది. 1960 లో చిన్న గాజు సీసాలో లభించే ENO ఇప్పుడు పలురకాల flavours లో pouch ల రూపంలో లభిస్తోంది.

బోర్న్ విటా 1948లో మనకి క్యాడ్ బరీ సంస్థ ద్వారా పరిచయం అయింది. మేటి పిల్లల డ్రింక్ గా ఫేమస్ ఐన బోర్న్ విటా ప్రాభవం.. విరివిగా లభ్యమౌతున్నా ఇప్పుడు కొంత తగ్గింది. కాస్మొటిక్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న లోరియల్ సంస్థను 1909లో ఫ్రాన్స్ లో స్థాపించారు.

పెప్సీ.. 130 ఏళ్ళనాటి ఈ కూల్ సాఫ్ట్ డ్రింక్ ఆరంభంలో బ్రాడ్స్ డ్రింక్.. తరువాత పెప్సీ కోలా గా మారి చివరికి పెప్సీ గా స్థిరపడింది. లాక్మే.. అచ్చమైన ఈ భారతీయ లక్ష్మీ బ్రాండ్ ఆధునిక యుగంలో లక్మే అయ్యింది. లక్మే అంటే సిరులిచ్చే దేవత అని ఓ భాషలో అర్ధం. మన తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రోత్సాహం ఈ కాస్మొటిక్ సంస్థకు ఉండేది.

పాండ్స్.. ఒక అమెరికన్ ఫార్మాసిస్ట్ ద్వారా ఊపిరి అందుకున్న పాండ్స్ 18వ శతాబ్దం నాటిది. పాండ్స్ ఫేస్ పౌడర్లు, ఇతర ప్రోడక్ట్స్ కు నేటికీ చెక్కుచెదరని ఆదరణ ఉండటం నిజంగా గొప్ప విషయమే. పాండ్స్ ఫేస్ వాష్, కోల్డ్ క్రీమ్ లు కూడా మనదేశంలో బాగా వ్యాప్తిలో ఉన్నాయి ఈనాటికీ.. పాండ్స్ పౌడర్ గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు.. ఇవన్నీ మనం నిత్యం వాడుతున్న ప్రోడక్ట్సే.

– గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని)
విజయనగరం
ఫోన్ 99855 61852…

LEAVE A RESPONSE