Suryaa.co.in

Political News

జగన్ ని నమ్మని ఆ “నలుగురు”

రాజకీయలలో ఇప్పటి జమానా లో హత్యలు, ఆత్మహత్యలు రెండు సమాంతరం గా చలామణి లో సాగడం నిత్య కృత్యం అయింది. పూర్వం ఆ రెండిటిలో ఒక్కటే శరణ్యం అనేది నానుడి. ప్రాంతీయ పార్టీల కు సమానంగా జాతీయ పార్టీలు సైతం పోటాపోటీగా ఎన్నికల్లో నెగ్గడం కోసం, ఖజానా శక్తి కి మించి, ప్రజల వాస్తవ అవసరాన్ని మించి వాగ్దానాలు అలవోకగా గుప్పి0చే ప్రక్రియ దశాబ్దాల నుంచి ఉన్నా, జగన్ పార్టీ ఆవిర్భావం తర్వాత నే ప్రభుత్వ పరిపాలనకు, ఇవి కొరకు రాని కొయ్య గా తయారయ్యాయి.

సంక్షేమ పథకాలు అర్హులకు అందించడం నిరభ్యంతరంగా ప్రజలకు అవసరమే, ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వీటి ముసుగులో జరిగిన తంతు ఏమిటి? సన్న బియ్యం ఇస్తామని వాగ్దానం చేయడం, ఆచరణలో ముతక బియ్యం ముసుగులో కాకినాడ పోర్టు లో జరిగిన మోసం, కుంభ కోణం వెనుక అప్పటి ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితులు పరోక్షంగా ప్రభుత్వ అండదండలు.. వెరసి ఆంధ్ర రాష్ట్ర పరువు, ప్రఖ్యాతలు బంగాళాఖాతంలో కలిసిపోయినవి. వీలు అయిన వరకు డబ్బు పోగేసు కోవాటం , అవి సీ పోర్ట్ లు అడ్డంగా రాసి ఇవ్వటం దగ్గర నుంచి.. అడ్డంగా కరెంట్ కొనుగోలు ఒప్పందాలు దరిమిలా ప్రజల పై కరెంట్ బిల్లుల రూపంలో మోయలేని భారాన్ని మోపడం. మద్యం, ఇసుక మాఫియా లకు తోడుగా విశాఖపట్నం రాజధాని పేరుతో చేసిన ఆర్థిక విన్యాసాలు, బలవంతంపు భూ ఆక్రమణలు, అయిన వాళ్లకు కావలసినంత దోచిపెట్టడం. అందులో ముఖ్యంగా ఆ “నలుగురు ” కోసం!

చివరికి కాటికి నలుగురు అవసరం అయినా, చిత్రంగా ఆ నలుగురే ఇంత దోచి పెట్టిన జగన్ ని ప్రస్తుతం ఓర చూపు చూడటం గమనిస్తే.. రాజకీయ లలో హత్యలు, ఆత్మహత్యలు రెండూ సాధ్యం అన్నది నిఖార్సయిన నిజం. సరే ఇది ఒక ఎత్తయితే , జగన్ ని అధికారంలో కూర్చో బెట్టింది 51% రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు. జగన్ రెడ్డి మాత్రం కేవలం 6% కూడా లేని వారి సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వటం. అందులో నలుగురు సామంతరాజులుగా రాష్ట్రంలో నాలుగు దిక్కు లకు దిక్పాలకులుగా విర్రవీగడం. ఫలితమే వారికి మొన్న ఎన్నికల్లో దక్కిన పదకొండుతో మూడవ స్థానం.

ఏ రాజకీయ పార్టీలకు అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కులాలు, మతాల కు సమానంగా అవకాశాలు కల్పించాలి. అది సంపూర్ణంగా కొరవడిన నేపధ్యంలో అంతర్లీనంగా పెరిగిన అసంతృప్తి కి తోడుగా.. నాయకుల విశృంఖల అవినీతి, అరాచకం కలగలసి జగన్ అధికారాన్ని ప్రజలు పాతేశారు. భారత దేశంలో జగన్ పరిపాలన పార్టీలకు, వివిధ ప్రభుత్వలకూ ఒక “కేసు స్టడీ ” లాంటిది. విభజిత ఒక చిన్న రాష్ట్రం, పరిపాలన దక్షత లేమితో ఏ విధంగా అప్పుల వూబిలో కొట్టు మిట్టాడుతూ.. అభివృద్ధి, సంపద సృష్టి సహజ వనరుల వినియోగం పై దృష్టి సాధించడం మరిచి, కేవలం డబ్బు కొల్ల గొట్టాలను కోవడం జగన్ పతనానికి మూల కారణం.

చి0పిన విస్తరిలా తయారు చేసిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కి తీసుకు రావడం అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. కానీ ఒక ఆశ, భరోసా ఈ రాష్ట్ర ప్రజల్లో ఇప్పుడు ఉందంటే అది చంద్ర బాబు విజన్, సంపద సృష్టి లో వారికి ఉన్న అనుభవం, కార్యదక్షత, అభివృద్ధి పై కసి- పట్టుదల, ఇప్పటికీ మెండుగా ఉండటమే. అందుకే గతంలో లో కాకుండా, ఈ దఫా కూటమితో నెగ్గుకు రాగలుగు తారన్న నమ్మకం ప్రజల్లో మెండుగా ఉంది.

జాతీయ రాజకీయాల్లో ఈ రాష్ట్రం సంఖ్యా పరంగా శాసిం చే స్థానం లో ఉన్నా.. రాష్ట్ర అభివృద్ధి కి కావలసిన వనరులు సాధించడం లో, కాస్త వెనకబడే ఉన్నామన్న మాట అంగీకరించ వలసిన విషయం. ఆ దిశగా కూటమి సమిష్టి గా కదం కదం కలిపితే, అనుకున్న లక్ష్యం సాధించడం గొప్ప విషయం కాక పోవచ్చు. ఎందుకంటే గత జగన్ ప్రభుత్వం కూడా కేంద్రంతో అత్యంత సన్నిహితంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. జమిలి ఎన్నికలు ముందస్తుగా వచ్చినా రాకపోయిన చంద్ర బాబు, కూటమి నాయకులు సమైక్యంగా చెప్పిన హామీలు అన్ని సకాలంలో పూర్తి చేసి భారత దేశ పటం లో ఆంధ్రప్రదేశ్ ని సగర్వం గా నిలపగలర న్న సంపూర్ణ విశ్వాసం తో ప్రజలు ఉన్నారు.

– ఓ.వి.రమణ
టీటీడీ బోర్డు మాజీ పాలక మండలి సభ్యులు
తెలుగు దేశం పార్టీ నాయకులు

LEAVE A RESPONSE