Suryaa.co.in

Andhra Pradesh

అమ్మాయిని ఆత్మహత్య నుంచి కాపాడిన ఆ ముగ్గురు పోలీసులు

జీవితం చాలా విచిత్రమైనది., ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు., అలాంటి ఒక సంఘటన ఈరోజు మా ముగ్గురి జీవితంలో జరిగింది., ఆ సంఘటనే ఒక అమ్మాయి ప్రాణాలను కాపాడగలిగింది., నేను, జయరాం, కోటీ ముగ్గురం ఈరోజు డ్యూటీలో ఉండగా ఒక 50 సంవత్సరాల వయసున్న వ్యక్తి హడావిడిగా మా దగ్గరికి వచ్చి ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు.

అంతలో అక్కడ RTC OPలో ఉన్న నా స్నేహితుడు కోటీ ఏమైందని విచారించగా ” నా కూతురిని కాలేజిలో చేర్పించడానికి తీసుకొచ్చానని, ఇప్పుడు కనిపించట్లేదని చెప్పడం జరిగింది”.. మా CI ఉత్తర్వుల మేరకు వెంటనే అప్రమత్తమైన నేను, జయరాం, కోటీ ఒకరికొకరం అనుకోకుండా ఎవరి ప్రయత్నం వారు చేయడం ప్రారంభించాం.. తర్వాత తెలిసింది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళిందనీ… కారణం ఏమైనా కావచ్చు, ఎలాగైనా బ్రతికించాలని మా ప్రయత్నం మేము చేసాము.. చివరికి ఆ అమ్మాయి విజయవాడలో ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండగా మా స్నేహితుల సహాయంతో పట్టుకున్నాం.. ఏదీ ఏమైనా చివరికి ఒక అమ్మాయి ప్రాణాన్ని కాపాడగలిగాము.. ఇదంతా కేవలం 98 నిమిషాల్లో చేసాము.

మాలో ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా ఆ అమ్మాయి బ్రతికేది కాదు.. మనిషి ప్రాణాన్ని కాపాడటం కంటే గొప్ప పని ఇంకొకటి లేదని నా ఉద్దేశ్యం.. చివరిగా అమ్మాయి వాళ్ళ నాన్న మా CI గారి సమక్షంలో చెప్పిన ఒక మాట జీవితాంతం గుర్తుండిపోతుంది మాకు.. “ఎంతో మంది పోలీసులని చూసాను కానీ మీలాంటి దేవుళ్ళని చూడలేదని” ఈ ఒక్క మాట చాలదా మాకు జీవితాంతం గర్వంగా బ్రతకడానికి….! ఆ ఆనందంలో దిగిన ఫోటో నే ఇది..

నోట్: ఎంత కష్టం వచ్చినా బ్రతకడానికే ప్రయత్నించండి… చచ్చి సాధించేది ఏమీ లేదు…

LEAVE A RESPONSE