-భవిష్యత్ దర్శనం లేని,భావితరాల గురించి ఆలోచించని వాళ్లే చంద్రబాబు విజన్ ని తప్పు పడతారు
– విజనరీ (చంద్రబాబు) ఆలోచనలు రాష్ట్రాభివృద్ధి.. ప్రజాక్షేమం చుట్టూ తిరుగుతుంటే. ప్రిజనరీ (జగన్ రెడ్డి) ఆలోచనలు ఎవర్నిచంపి అధికారంలోకి రావాలి…వ్యవస్థలను ఎలా ధ్వంసంచేయాలనే వాటిచుట్టూ తిరుగుతుంటాయి
• అమరావతి అయినా.. చెన్నై , బెంగుళూరు అయినా ఒక్కరోజులో రాత్రికిరాత్రి అభివృద్ధి చెందలేదు
• ప్రభుత్వాలు మారినా, క్రమం తప్పకుండా అభివృద్ధిని కొనసాగించాయి కాబట్టే.. నేడు ప్రధాన నగరాలుగా మారి, రాష్ట్రఖజానాకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి
– సమాజాన్ని వర్గాలు, కులాలు, మతాలపరంగా విభజించి.. ప్రజలుకొట్టుకునేలా చేసి, తిరిగి ముఖ్యమంత్రి కావాలన్న దుర్మార్గపు ఆలోచనల్లో జగన్ రెడ్డిఉన్నాడు
– టీడీపీ ఎమ్మెల్సీ నారాలోకేశ్
మూర్ఖుడికి లాజిక్ ఉండదు.. తెలియదు. పదోతరగతి ఫెయిల్ అయిన వాడికి చట్టాలు, వ్యవస్థలపై నమ్మకం గౌరవం ఉండవు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టమనేది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అని కోర్టు చాలాస్పష్టంగాచెప్పింది. దాన్నిమార్చేహక్కు రాష్ట్రానికి, రాష్ట్రంలోని చట్టసభలకు లేదనికూడా స్ఫష్టంచేసింది. రైతులకు ఇచ్చినహామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, భూములిచ్చినరైతులకు న్యాయంచేయాలని చాలాచాలా క్లియర్ గా చదువురానివాళ్లకుకూడా అర్థమయ్యేలా చెప్పింది.
భూమ్మీద నేనో , జగన్మోహన్ రెడ్డో శాశ్వతంకాదు… వ్యవస్థలు శాశ్వతం. అటువంటి వ్యవస్థలవిధ్వంసమే లక్ష్యంగా జగన్ రెడ్డి తీరుఉంది. వ్యవస్థలను దెబ్బతీయడం..కోర్టు తీర్పులను ఉల్లంఘించడం అనేది జగన్ రెడ్డికి హాబీగా మారింది. వ్యవస్థలను కాపాడే న్యాయస్థానాలపై దాడిచేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. భారతదేశ చరిత్రలో వ్యవస్థలపై దాడిచేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. 2014 నుంచి 2019మధ్యన ఐదేళ్లలో మద్యంసేవించి 100మంది చనిపోతే, జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అమ్ముతున్న పిచ్చిమద్యం, నాటుసారాతో నెలకు 100మంది వరకు చనిపోతున్నారు. కానీ ఆ మరణాలు ఏవీలెక్కల్లోకి రావడంలేదు. వ్యక్తులు చనిపోతుంటే బడ్జెట్ పైచర్చిస్తామనడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాం? 42మంది ఇప్పటికే చనిపోయారు..ఇంకెంతమంది చనిపోతారో తెలియడం లేదు.
అయినాకూడా మద్యంఅంశం ముఖ్యమైనది కాదని ప్రభుత్వం అనుకుంటేఎలా? ప్రజలేలేనప్పడు బడ్జెట్లు ఎందుకు? మేం 9రోజుల నుంచీ అడుగుతున్నా.. నాటుసారా మరణాలపై ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు. కల్తీమద్యం… నాటుసారా అంశాలపై ముఖ్యమంత్రేస్పందించాలి. రాష్ట్రంలో చాలాసమస్యలు ఉన్నాయి. దళితులకు ఎలాంటి పథకాలు అమలుకావడంలేదు. మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతులుసహా ఏవర్గం ప్రజలు సంతోషంగా లేరు.
మార్చి 29 తర్వాత ఈ ముఖ్యమంత్రి వైఖరిపై, ప్రజలసమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించేలా కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ జగన్ రెడ్డి రాష్ట్రాన్ని గుజరాత్ తో పోలుస్తున్నాడు.. గుజరాత్ రాష్ట్రం పరిశ్రమలు, కంపెనీలు వచ్చి అభివృద్ధిచెందిదా..లేక కొత్తజిల్లాలతో.. వ్యవస్థల విధ్వంసంతో అభివృద్ధిచెందిందా? పరిపాలన ఒకేచోట ఉండాలి.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది తెలుగుదేశం నినాదం. గతంలో చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే చేసి చూపించారు. మరలా ముఖ్యమంత్రి అయ్యాకకూడా అలానే చేస్తారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుల్లో ఎన్ని బిల్లులు చట్టసభల్లో ఆమోదంపొందాయి. ఇప్పటివరకు ఆమోదంపొందిన బిల్లుల్లో ఎన్నికోర్టులు అడ్డుకున్నాయి. ఎందుకు ఊరికేకోర్టులను తప్పుపట్టడం? చేతగానివాడు కాబట్టే జగన్ రెడ్డి, తనవైఫల్యాలను కోర్టులపై, ప్రతిపక్షాలపై నెడుతున్నాడు. జగన్ రెడ్డి చెప్పింది నిజమేఅయితే… ఈ ప్రభుత్వంతీసుకొచ్చిన చట్టాలను, బిల్లులన్నింటినీ న్యాయస్థానాలు ఆపేయాలికదా! గతసమావేశాల్లో దాదాపు 26, 27 బిల్లులు ఆమోదంపొందాయి.
జగన్ రెడ్డికి పాలనచేయడం చేతగాదు. ఈమూడేళ్లలో ఇన్నిఉద్యోగాలు ఇచ్చాను.. ఇంతమందికి స్వయంఉపాధికల్పించాను…ఇన్నివర్గాలప్రజలను ఆదుకున్నానని జగన్ రెడ్డి చెప్పగలడా? ఏమీచేయలేనప్పుడు ఏంచెప్పుకుంటాడు? సమాజాన్నివర్గాలు, కులాలుమతాలపరంగా విభజించి… ప్రజలు తన్నుకునేలాచేసి, మరలా ముఖ్యమంత్రికావాలన్న ఆలోచనల్లో జగన్ రెడ్డిఉన్నాడు. అంతేగానీ రాష్ట్రాన్ని అభివృద్ధిచేసో.. ప్రజలకు కావాల్సినవి అమలుచేసో ముఖ్యమంత్రికావాలన్న ఆలోచనఆయనకు లేదు. గతంలోకూడా డీఎస్పీల ప్రమోషన్ల అంశాన్నితెరపైకితెచ్చి కులాలకుంపట్లు రాజేశాడు.
ముఖ్యమంత్రి అయ్యాక దేవాలయాలు పడగొట్టి… విగ్రహాలుధ్వంసంచేసి.. మతాలమధ్య చిచ్చుపెట్టాలని చూశాడు. రైతులకు గిట్టుబాటు ధరకల్పించాలని… వారికి సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలని, మహిళలకు ఇబ్బందిలేకుండా నిత్యావసరాల ధరలు తగ్గించాలని ముఖ్యమంత్రికి ఉండదు. అందుకే ప్రజలమధ్య చిచ్చుపెట్టి తనపబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు.
రోడ్డుపై ఉన్న గుంతలు పూడ్చలేని వాడు… మూడు రాజధానులు నిర్మిస్తాడా?
ప్రిజనరీ ఆలోచనలన్నీ విధ్వంసం.. వినాశనం చుట్టూ తిరుగుతుంటే.. విజనరీ ఆలోచనలు రాష్ట్రాభివృద్ధి… ప్రజాక్షేమం చుట్టూ తిరుగుతుంటాయి.
జగన్ రెడ్డి నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ.. కోర్టుఆదేశాలను అమలుచేయమని చెప్పాడు. అప్పుడే అర్థమైంది… ఈ ముఖ్యమంత్రి చేతగానివాడని. టీడీపీహాయాంలోనే ఇప్పుడున్న సచివాలయం….అసెంబ్లీ, అధికారుల నివాససముదాయాలు పూర్తిచేశాం. రాష్ట్రంలో రోడ్లపైఉన్నగుంతలు పూడ్చలేని జగన్ రెడ్డి.. మూడురాజధానులు కడతాడా? ఊరికే ప్రజల్ని అమాయకుల్నిచేసే ప్రయత్నంతప్ప…ఏమీకాదు. ప్రిజనర్ కి .. విజనర్ కి చాలాతేడా ఉంటుంది.
జైలుకెళ్లి వచ్చినవాడు..ఏమీచేయలేడు. ఏంచేయాలన్నా భయం. హైదరాబాద్ లో అన్నీఉన్నాయని అక్కడి ముఖ్యమంత్రి ఇకరోడ్లువేయం.. గుంతలుపూడ్చం.. ప్రజలకు ఇళ్లుకట్టించం అంటున్నాడా? బెంగుళూరు, చెన్నైలలో కొత్తరోడ్లువేస్తున్నారా..లేదా? అమరావతినిర్మాణంకూడా ఒక్కరోజులోనే … ఒక్కసంవత్సరంలోనో పూర్తికాదు. క్రమక్రమంగా ఒక్కోటి పూర్తిచేసుకంటూ…ఏటేటా అభివృద్ధిని పెంచుకుంటూపోవాలి. అప్పుడు రాజధాని అయినా..రాష్ట్రమైనా ఒకరూపు సంతరించుకుంటుంది. అదిఎలాచేయాలో ప్రిజనర్ కి తెలియదు.
చంద్రబాబునాయుడి ని విజనరీ అనడానికి చాలాచాలాకారణాలు ఉన్నాయి. ఉమ్మడిరాష్ట్రంలో హైదరాబాద్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైబర్ టవర్ అనేవిత్తనం నాటారు. ఆనాడు దాన్నికూడా కాంగ్రెస్ వారు అవహేళనచేశారు. ఆనాడు చంద్రబాబుగారు వేసిన ఆ విత్తనంవల్లే, నేడు తెలంగాణ ప్రభుత్వానికి లక్షలకోట్ల ఆదాయం వస్తోంది. చంద్రబాబు విజన్ 2020 అంటే ఎగతాళిచేశారు. ఆయన విజన్ గురించి తెలియనివాళ్లు … భవిష్యత్ దర్శనంచేయలేని, భావితరాల గురించి ఆలోచించని వాళ్లే.. హేళనగామాట్లాడతారు.
రాష్ట్రంలో ప్రిజనర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడుకాబట్టే… వ్యవస్థలను ధ్వంసంచేస్తున్నాడు.. అధికారంలోకి రాగానే ప్రజావేదిక నేలమట్టంచేశాడు.. తరువాత దేవాలయాలు.. ఆతరువాత రాజధానిని విధ్వంసం చేశాడు. ఇప్పుడు ఏకంగా కోర్టులపైనే పడ్డాడు. ప్రిజనరీకి తెలిసింది అంతా నాశనమే కదా! విజనరీకి ప్రిజనరీకి ఉన్న తేడాను ప్రజలు గమనించాలి.
సొంతబాబాయ్ ని..లేదా ఇతరుల్ని చంపి అధికారంలోకి వద్దామని ప్రిజనరీ ఆలోచిస్తే.. విజనరీ ఏమోదేశదేశాలు తిరిగిరాష్ట్రాన్ని ఎలాబాగుచేయాలా అని ఆలోచిస్తాడు. శాసనసభ.. మండలి అంతా ఏకపక్షంగా నడుస్తోంది..అక్కడ మీడియావాళ్లు అడగడం.. ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానంచెప్పడం అనేది ఉండదు.
తాళిబొట్లను నేలకేసికొట్టడం ఎలాంటి సంప్రదాయమో ఆమేచెప్పాలి : పరుచూరి అశోక్ బాబు
నేటితో అసెంబ్లీ, మండలి సమావేశాలు ముగుస్తున్నాయని తెలిసి, తాము నాటుసారా మరణాలపై సభలో చర్చించాలని ఛైర్మన్ నుకోరితే, ఆయన సీరియస్ అయ్యారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విద్యార్థుల సమస్యలపై చర్చించాలని కోరుతూ, వారువాయిదా తీర్మానంఇస్తే, దానిపై సానుకూలంగా స్పందించినఛైర్మన్, తమకు అసలు అవకాశమే ఇవ్వనని ఖరాకండిగా తేల్చిచెప్పాడు. నాటుసారా, జేబ్రాండ్స్ మద్యంతో 42మంది చనిపోతే, దానిపై చర్చకోసం టీడీపీసభ్యులుగా తాము 9రోజులుగా పట్టుబడుతున్నా..ప్రభుత్వంలో చలనంలేదు. తెల్లకాగితం కనిపిస్తే దాన్ని చించేస్తారు.
కానీ అదే కాగితంపై దేవుడిబొమ్మ ఉంటే త్వరగా చించలేము. అలానే ఈ ముఖ్యమంత్రికి నాటుసారా మరణాల్లోని వాస్తవికతను తెలియచేయడంకోసం… తాము సభకు తాళిబొట్లు తీసుకొచ్చాము. తాళిబొట్లను సభకు తీసుకురావడమే నేరమన్నట్లు వైసీపీమహిళాసభ్యులు సభలో మాపట్ల దురుసుగా ప్రవర్తించారు. వారు సీట్లలోనుంచి లేచివచ్చిమరీ మమ్మల్ని మాటలన్నారు. కుటుంబంలోని మగదిక్కును కోల్పోయిన ఆడబిడ్డల వేదనను ముఖ్యమంత్రికి, మండలిఛైర్మన్ కు తెలియచేయాలనే తాముసభకు తాళిబొట్లు తీసుకొచ్చాము.
దానికే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన పోతులసునీత ఓవర్ గా రియాక్ట్ అయ్యింది. ఆమె మా సభ్యుడి చేతిలోని తాళిబొట్టుని లాక్కొని నేలకేసి కొట్టడమేగాక, టీడీపీసభ్యులను దుర్భాషలాడింది. ఆమె ఎందుకంత ఓవరాక్షన్ చేసిందో ఆమెకే తెలియాలి. ఆడబిడ్డలజీవితాలు కల్తీసారా, జేబ్రాండ్స్ మద్యానికి నాశనమవుతున్నాయి అధ్యక్ష్యా… ఈతాళిబొట్లు చూశాకైనా మీరు మద్యంమరణాలపై సభలో చర్చకు అనుమతించాలని కోరుతూ పోడియంలోకి వెళ్లాము.
దానికే వైసీపీమహిళాసభ్యులను ముందుపెట్టి, అధికారపార్టీ సభ్యులు మాపై దురుసుగా ప్రవర్తించారు. సీరియళ్లలో చూపించే దానికంటే ఎక్కువగా నటనాకౌశలం ప్రదర్శించారు. వైసీపీ వారుసభలో చూపిన నటనాకౌశలాన్ని నాటుసారాతో ప్రాణాలు పోగొట్టుకున్నవారి కుటుంబసభ్యుల ముందుచూపితే సంతోషిస్తాం. పోతులసునీతసహా, ఇతర వైసీపీమహిళాసభ్యులతో మమ్మల్ని తిట్టించడం అనేదిఅధికారపార్టీ కుట్రలో భాగంగానే జరిగింది. ప్రభుత్వతీరుని.. వైసీపీసభ్యులు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నాం.
మేం తాళిబొట్లను గౌరవించలేదని చెప్పి చిందులుతొక్కిన మహిళాఎమ్మెల్సీ, అదేతాళిబొట్లను మానుంచి లాక్కొని నేలకేసి కొట్టింది. మరి అలాచేయడం ఎలాంటి సంప్రదాయమో ఆమే విచక్షణకే వదిలేస్తున్నాం. సమాజంలో కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవారు చనిపోతే, ఆ కుటుంబం మొత్తం ఎంతబాధ అనుభవిస్తుందో.. అది అనుభవించే వారికే తెలుస్తుంది. మమ్మల్ని ఈరోజు ఇంతత్వరగా సభనుంచి బయటకు పంపడానికి కారణం (సస్పెండ్ చేయడం) ప్రభుత్వం ఆదరాబాదరగా ఆమోదించుకోవాల్సిన బిల్లులు కొన్ని ఉన్నాయి.
వాటికోసమే సభ ప్రారంభం కాగానే మాపైకి మహిళాసభ్యుల్ని ఉసిగొల్పారు. ఇదివరకు మండలిలో ఒకరు మగతనం గురించి మాట్లాడారు. మరి నేడు మహిళాసభ్యులను అడ్డంపెట్టుకొని మాపై దురుసుప్రవర్తనకు పాల్పడటం ఎలాంటి మగతనమో సదరు సభ్యుడే చెప్పాలి. నిన్నటికి నిన్నసభలో వైసీపీసభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ మాపైకి, ఛైర్మన్ పైకి 500రూపాయల నోట్లు విసిరితే అతన్నేమీ అనలేదు. మమ్మల్ని మాత్రం ఈరోజు తాళిబొట్లు సభలోకి తేవడమే పెద్దనేరమన్నట్టుగా బయటకు పంపించారు. 9రోజులు ఒకేఅంశంపై ఎందుకు పట్టుబడుతున్నారని కొందరు అంటున్నారు.
రైతులైనా, మహిళలైనా.. విద్యార్థులు, యువతైనా అందరూనష్టపోయేది..నష్టపోతున్నది కల్తీసారా.. జేబ్రాండ్స్ మద్యం.. డ్రగ్స్ వల్లనే. మేం మండలిలో లేవనెత్తిన అంశాలు… వాటితాలూకా సమస్యలు ప్రజల్లోకి వెళ్లకుండా చేయడానికి ఈ ప్రభుత్వంచేయాల్సినవన్నీ చేస్తోంది. వైసీపీ సభ్యులప్రవర్తన నిజంగా ఈరోజుని బ్లాక్ డేగా మార్చింది. టీడీపీ ఆవిర్భావదినోత్సవ సభలో ఈ ప్రభుత్వం ఏ అంశాలనైతే సభల్లో చర్చకురాకుండా చేసిందో, వాటినే ప్రాధాన్యతాక్రమంలో చర్చించి, ప్రజల్లోకి తీసుకెళతాం. వైసీపీప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మాటల్లో చెప్పడం అయిపోయింది… ఇక నుంచీ పోరాటమే.. ఒక్కమాటలో చెప్పాలంటే యుద్ధమే.
సారా మరణాలపై చర్చించడానికి ముఖ్యమంత్రికి ఎందుకంత భయం? – బచ్చుల అర్జునుడు
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వవిధానాలు, ముఖ్యమంత్రి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 42 మంది చనిపోయినాకూడా ముఖ్యమంత్రి సారామరణాలను సహజమరణాలే అనిచెబుతున్నాడంటే, సమస్యపై చర్చించడానికి ఆయన భయపడుతున్నాడని అర్థమైంది. మద్యపాననిషేధంపైగానీ, సారామరణాల అంశంగానీ, జేబ్రాండ్స్ మద్యం అమ్మకాలపై గానీ ప్రభుత్వం ఎందుకు చర్చకు రాలేకపోయింది. అరగంటకూడా చర్చించడానికి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎందుకు ధైర్యంలేకపోయింది. చర్చించడానికి, స్టేట్ మెంట్ ఇవ్వడానికి చాలావ్యత్యాసంఉంది. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటనచేస్తే, దానిపై చర్చించకూడదా?
ఆయన ప్రకటనతో ప్రజలకు వాస్తవాలుతెలిశాయని వైసీపీసభ్యులు అంటున్నారు. ఏవి వాస్తవాలో మేం చెబుతామని, అసలైన ఆధారాలు బయటపెడతామని అంటుంటే ప్రభుత్వంఎందుకు పట్టించుకోదు? కల్తీసారా మరణాలు.. జేబ్రాండ్స్ మద్యం మరణాలు, జేబ్రాండ్స్ తయారీ, వాటిఅమ్మకాల వంటి వాటిపై రాష్ట్రవ్యాప్తంగా తాముసేకరించిన ఆధారాలను బయటపెడతామని చెబుతుంటే ప్రభుత్వానికి ఎందుకంత వణుకు?
టీడీపీసభ్యులు ఏంచెబుతారో వినొచ్చుకదా? స్వతంత్ర్యం వచ్చాక ఇంతటి దౌర్భాగ్యకరస్థితిలోఉన్న ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం. తాములేవనెత్తిన అంశాలపై కనీసబాధ్యతగా కూడా ముఖ్యమంత్రి సభలోకి వచ్చి సమాధానం చెప్పకపోతే ఎలా? జంగారెడ్డిగూడెం జనాభా లెక్కల ప్రకారం ఇంతమందిసాధారణంగానే చనిపోవాలి..కానీ ఇంతమందే చనిపోయారని కాకిలెక్కలు చెప్పడానికి ముఖ్యమంత్రి ఉంది? జగన్మోహన్ రెడ్డీ.. మనిషిప్రాణం అనేది ఎవరూ తిరిగి తీసుకురాలేనిది. దాన్ని మర్చిపోయి నీఇష్టమొచ్చినట్లు సభలో మాట్లాడుతున్నావు.
టీడీపీనుంచి వైసీపీలోకి వెళ్లిన సునీత సభలో దుర్మార్గంగా ప్రవర్తించింది. నాటుసారా తయారీ , అమ్మకాలు, పోతున్న ప్రాణాలపై ప్రజలవద్ద సమాచారం ఉందా? టీడీపీ ఆవిర్భవించి 29వతేదీకి 40ఏళ్లు అవుతోంది. ఆరోజు నుంచీ ఈ ప్రభుత్వ వైఖరిని, ముఖ్యమంత్రి దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే తీరుతాం. సభలో మా సంఖ్య తక్కువ ఉందని మమ్మల్ని బయటకు పంపి, మీ ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. సభలో అడ్డుకుంటున్నారుకానీ… ప్రజాక్షేత్రంలో మమ్మల్ని అడ్డుకోలేరు.
వెల్ లో నించొని మా వాదన మేంచేస్తూ మంగళసూత్రాలు చూపుతూ, అరగంట చర్చిద్దామని కోరితే, అదే తప్పయినట్టు వైసీపీమహిళాసభ్యులను మాపైకి ఎగదోశారు. మాపై దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించారుకానీ.. వారికి ఆ అవకాశమివ్వకుండానే సింహాల్లా ప్రతిఘటించాము. చట్టసభలను ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా నిర్వహిస్తోంది. అందులే ఎలాంటిసందేహమే లేదు. సభను అటెన్షన్ లోకి తేవడానికి మొన్నసభలో విజిల్స్ వేశాము.
అదే తప్పంటే మరి ఇదేసభలో గతంలో వైసీపీ సభ్యులు…మంత్రులు ఎలా ప్రవర్తించారో ఛైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తిని ఎన్నిమాటలన్నారో ప్రజలకు బాగా తెలుసు. 9 రోజులనుంచీ వైసీపీ సభ్యులు సభలో భజనచేస్తుంటే తాము చూస్తూఊరుకోవాలా? సారామరణాలపై సభలో చర్చించకుండా మీకు మీరు సహజమరణాలని చెప్పుకుంటే సరిపోతుందా?
సమాధానంచెప్పలేక ప్రభుత్వం పారిపోయిందని సభాసమావేశాల నిర్వహణను బట్టే అర్థమైంది : దీపక్ రెడ్డి
అసెంబ్లీ.. మండలిప్రారంభమై 20రోజులు అవుతోంది. మేం అడిగామని కాకుండా సారామరణాలు, జేబ్రాండ్స్ మద్యంపై బాధ్యతగలప్రభుత్వం ఒక అరగంట చర్చిస్తే వచ్చే నష్టమేంటి? మద్యంఅమ్మకాలు, కల్తీసారావ్యాపారం ముసుగులో ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎంతదోచుకున్నారనేది ప్రజలకు తెలియకూడదనుకుంటున్నారా? ప్రభుత్వంచేస్తున్న కుంభకోణాలు ప్రజలకు తెలియకుండా ఎన్నాళ్లు ఇలా అడ్డగోలుగా ప్రవర్తిస్తారు?
ఈరోజుతో సమావేశాలు అయిపోతాయని భావించి, మరోరోజు పొడిగించైనా సారామరణాలపై చర్చించాలని కోరితే, దానికీ సమాధానంలేదు. ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనవి చట్టసభలే. వాటిలోనే చర్చకు ప్రభుత్వం వెనుకాడుతోందంటే, చట్టసభలనుంచి కూడా ప్రభుత్వం పారిపోయిందనే చెప్పాలి.