-ఏపీ మత్స్య శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
చేపల రిటైల్ & అవుట్ లెట్లు కలిగిన లబ్దిదారులకు ఆన్ లైన్ చెలింపుల కోసం పాయింట్ ఆఫ్ సేల్ మిషన్ల పంపిణీ. ఏపీలో ఉత్పత్తి అవుతున్న 30 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్వా ఉత్పత్తులలో 15 లక్షల మెట్రిక్ టన్నుల వినియోగం స్థానికంగానే ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుతం ఏపీలో తలసరి చేపల వినియోగం 8-9 కేజీలు మాత్రమే ఉందని, దీన్ని 21 కేజీలు పెంచాలన్నది ప్రభుత్వ ఆలోచన.
ఫిష్ ఆంధ్రా బ్రాండ్ తో ఏపీలో రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 2, 725 మినీ రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. ప్రస్తుతం 355 ఫిష్ రిటైల్ అవుట్ లెట్లు పని చేస్తున్నాయి. 15 ఎఫ్పీఓ ఆక్వా హబ్ లు & పులివెందుల, విశాఖ, వినుకొండ లలో ఫిష్ ఆంధ్రా సూపర్ రిటైల్ అవుట్ లెట్లు పని చేస్తున్నాయి. ఆసక్తి ఉన్న యువత ఎవరైనా ఫిష్ ఆంధ్రా బ్రాండ్ అవుట్ లెట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫిష్ ఆంధ్రా మినీ అవుట్ లెట్ల ఏర్పాటుపై కేంద్రం అభినందించి ఈ ఏడాదికి స్కోచ్ గోల్డ్ అవార్డు ఇచ్చింది.