Home » జగన్ ఎస్టేట్ గా తిరుమల 

జగన్ ఎస్టేట్ గా తిరుమల 

* బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి

జగన్ ఎస్టేట్ గా తిరుమలను మార్చారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు.  విజయవాడలోని బీజేపి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా తిరుమల జగన్ ఎస్టేట్ గా మారిందని, ఎస్టేట్ మేనేజర్ గా ధర్మారెడ్డి వ్యవహరించారని ఆరోపించారు.

జగన్ పాలనలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఏపీలో కొనసాగిందన్నారు. 2020 లో టీటీడీకి చెందిన ఐదు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారన్నారు. ఆర్నెల్ల ముందు ఒక్క శాతం టీటీడీ మనీ మున్సిపల్ కార్పొరేషన్ కి కేటాయించారు. కోర్టు తీర్పుతో మళ్ళీ తిరిగి ఇచ్చేశారు.

ఐదేళ్లలో జరిగిన అవినీతి మీద, టీటీడీ విజిలెన్స్ మీద రాష్ట్ర విజిలెన్స్ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ చరిత్రలోనే కరుణాకర్ అనే వ్యక్తి 10 నుంచి 15 శాతం కమిషన్ తీసుకున్నట్లు భక్తులు ఆరోపించినట్లు ఆయన తెలిపారు.

తిరుమల తిరుపతిలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో దేవుడి ఆగ్రహం జగన్ మీద ఉంటే… ప్రజల ఆశీర్వాదం ఎన్డీయే కి లభించిందని ఎద్దేవా చేశారు.

Leave a Reply