Suryaa.co.in

Andhra Pradesh

తిరుమల-పాపవినాశనం రోడ్డు మూసివేత

తిరుమల: తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. గాలుల ధాటికి పలు చోట్ల పదుల సంఖ్యలో భారీ వృక్షాలు, చెట్టు కొమ్మలు రోడ్లపై పడ్డాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తిరుమల- పాపవినాశనం రోడ్డును అధికారులు మూసివేశారు. అటవీ, తితిదే అధికారులు రంగంలోకి దిగి రోడ్లపై పడిన చెట్లను తొలగిస్తున్నారు. మరోవైపు వర్షం కారణంగా రెండు ఘాట్‌ రోడ్లలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఘాట్‌ రోడ్డులో ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు.

LEAVE A RESPONSE