– నోటికి పనిచెప్పే కుక్కలు, పందులను రాష్ట్రం మీదకు వదిలిన బాబు
– ముఖ్యమంత్రిని నోటికొచ్చినట్లు మాట్లాడితే.. ఊరుకోం
– బద్వేల్ లో ఫలితం ఏం వస్తుందో తెలుసుకాబట్టే బాబు పోటీ నుంచి పారిపోయాడు
– మీరు ఎంతమంది కట్టగట్టుకుని వచ్చినా.. శ్రీ జగన్ సింగిల్ గానే ఎన్నికల్లో పోటీచేస్తారు
– సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబరుగా అయినా గెలిచి మాట్లాడు పట్టాభి
– వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ప్రెస్ మీట్
టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకునేందుకు రాష్ట్ర ప్రజల ముందు రావడం జరిగింది. ఏ రాజకీయ పార్టీ అయినా తాను ఎదిగేందుకు, సుస్థిరంగా ఉండేందుకు, స్థిరమైన, బలమైన పునాదులు, సిద్ధాంత బలాలతో మరీ ముఖ్యంగా బలమైన నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేయడం సర్వసాధారణ ప్రక్రియ. విచిత్రం ఏంటంటే ఏపీలో… 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకునే, స్వశక్తిలేని, పనికిమాలిన, వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన అందలం ఎక్కి దాన్ని కాపాడుకునేందుకు కుటిల రాజకీయాలు చేయడంలో నిష్ణాతుడు అయిన వ్యక్తి ఒకవైపున.. పౌరుషం, ఖచ్చితత్వం ఉన్న నిఖార్సు అయిన రాజకీయాలు చేసే నాయకుడు మరోవైపు ఉన్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ లు పెట్టి, ప్రజా సమస్యలపై మాట్లాడవచ్చు. ప్రభుత్వ పరమైన, విధాన పరమైన అంశాలపై మాట్లాడవచ్చు. అందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈ మధ్య టీడీపీ ప్రెస్‌మీట్లు అన్నీ కూడా నోటికి పనిచెప్పే.. పందులు, కుక్కలు, నక్కలతో, బురదలో పొర్లాడే సీమ పందులతో నిర్వహిస్తోంది. నోటీకి హద్దూఅదుపు లేకుండా మాట్లాడుతున్నారు.
మీరు ఒక్కమాట మాట్లాడితే… మేము లక్ష కోట్ల గొంతులతో మాట్లాడించగలిగే శక్తి, సామర్థ్యం ఉన్న రాజకీయ నాయకుడి మీద, ఢిల్లీని ఢీకొట్టిన నాయకుడి మీద, తండ్రి చనిపోయినా మొక్కవోని నాయకత్వ పటిమతో ప్రజల ద్వారా తిరుగులేని నాయకుడిగా ప్రజాబలంతో ప్రజల కోసం ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిగారిని మీ నోటికి వచ్చినట్లు మాట్లాడించే మీ నీచ రాజకీయాలకు మేము ప్రజల మధ్యలో సరైన మాటలతోనే సమాధానం చెబుతాం.
ఓటమిని ఇప్పటికూడా చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యమంత్రిని పదేపదే దూషించే కుక్కలు, పందులును మీడియా ముందుకు తెచ్చి, వారితో ప్రెస్‌మీట్లు పెట్టి రాష్ట్రం మీదకు వదులుతున్నారు. మాట్లాడేవాళ్లను ప్రపంచంలో ఉన్న ఏ తిట్టుతో తిట్టినా ఆ తిట్టు కూడా సిగ్గుపడుతుంది. వెధవ అంటే వెధవలందరికి బాధ కలుగుతుంది. పంది అని అంటే పందులు కూడా సిగ్గుపడతాయి. నక్క అంటే అవి కూడా సిగ్గుపడతాయి. ఈ ప్రపంచంలో ఏ బూతు తిట్టినా చంద్రబాబుకు సరిపోదు. చంద్రబాబుతో పోల్చారని సిగ్గుపడతారు.
ప్రపంచంలో ఉండే ఏ తిట్లకు కూడా వీరు సరిపోరు. అందుకే సీమ పందులతో బాగా ఎర్రగా, బొద్దుగా ఉండేవాడితో, పళ్లు ఊడిపోయినవాడితో, కార్పొరేటర్‌గా కూడా గెలవలేనివాడితో, ఇంట్లో ఆడవాళ్లు భోజనం కూడా పెట్టకపోతే రోడ్లమీదకు వచ్చి కూర్చునేవాళ్లతో ముఖ్యమంత్రి ని చంద్రబాబు తిట్టిస్తున్నాడు.
చంద్రబాబు ఫ్రస్టేషన్‌ను మేము అర్థం చేసుకున్నాం. మీరు బతికి ఉండగానే, ముఖ్యమంత్రిగా ఉండి, మీరు ఎంపిక చేసిన రాజధాని అమరావతిలో.. మీ కొడుకు మంగళగిరిలో గెలవలేదు.
కొడుకు చేతగాని, పనికిమాలినవాడు అయ్యాడని, ఎందూకు పనికిరాని అసమర్థుడు అయ్యాడని కోపం. దానిని రాష్ట్ర ప్రజల మీద ద్వేషంగా మార్చుకున్నారు.
ఇన్ని ఫ్రస్టేషన్ల మధ్య… పదే పదే మీ పార్టీ నేతలతో కుక్కలు, పందులు అంటూ తిట్టించినా.. తండ్రి లేకపోయినా, ఢిల్లీ రాజకీయాలకు ఎదురొడ్డి, ఒకే ఒక్కడుగా అడుగు వేసి, ఒక రాజకీయ పార్టీగా ఉద్భవించి, ఈరోజు 151మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ముఖ్యమంత్రి జగన్ ని పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేయించినా ఆయన స్థాయిని మీరు ఇంచు కూడా తగ్గించలేరు.
పెదబాబు, చినబాబు ఇప్పటికూనా సిగ్గుతెచ్చుకోండి. నిజాయితీగా బతకడం ఇప్పటికైనా అలవాటు చేసుకోండి. మీ పార్టీ ఏంటో, ప్రస్తుత మీ పరిస్థితి ఎక్కడికి వెళ్లిపోయిందో, ఓట్ల కోసం జోలె పట్టుకుని అడిగేందుకు ఎవరు వస్తారో అంటూ రోడ్లమీద తిరుగుతూ అద్దె కొడుకు, ప్యాకేజీ కొడుకు కోసం ఒకవైపు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని పత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఎటునుంచి చూసినా మీరు మాకు పోటీనే కాదు. మాకు బలమైన ప్రతిపక్ష నేతను కోరుకుంటున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాలు, ఇళ్ళు నిర్మిస్తున్న జగన్ మోహన్ రెడ్డి లాంటి నాయకుడిని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు.
కరోనా మహమ్మారితో ప్రపంచం అంతా తలకిందులవుతుంటే.. ఈ రాష్ట్రంలోని నిరుపేదలకు, ఆకలితో అలమటిస్తున్నవారికి, అన్నం పెట్టే నాయకుడిని జగన్ గారిలో చూస్తున్నాం. ఇంకొంచెం ఎక్కువ పెట్టండి అనే అడిగే ప్రతిపక్షం కోసం ఎవరైనా చూస్తారు. మీ మాటలు, మీ చేతలు, మీ ప్రెస్‌మీట్లను చూస్తుంటే చాలా ఇరిటేషన్‌గా ఉంది. అమరావతిలో నక్కా ఆనందబాబు, విశాఖలో అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణ మాట్లాడే విధానం అదేనా? ఉగ్రవాదుల దండు మాట్లాడినట్లు ఉందేకానీ, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు మాట్లాడే మాటలేనా అవి? చంద్రబాబుకు ఫ్రస్టేషన్ పీక్స్ లో ఉండబట్టే మిమ్మల్ని అందరినీ మీడియా ముందుకు వదిలాడు. మీరు మాట్లాడే వాటిలో ఒక్కదానికి అయినా అర్థం ఉందా? ఒక్క ప్రశ్న అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగగలుగుతున్నారా?
అమ్మ ఒడి పథకం కింద తల్లులకు అందుతున్న డబ్బులు రూ.15 వేలు కాదు రూ.16 వేలు చేయమని ఒక్కనాడైనా అడిగాడా? వైయస్సార్ చేయూత ద్వారా ఇచ్చే రూ.18,750 సరిపోవు.. రూ.20వేలు చేయమని ఒక్కరైనా అడిగాడా? దేనికోసం మీ ప్రయాస, దేనిమీద మీ యుద్ధం? ఫేడ్ అవుట్ అయిన వాళ్ల కోసం, కళ్లు సరిగా కనిపించని, పళ్లు ఊడిపోయిన నాయకుడు, నిలబడితే కూర్చోలేని నాయకుడు. .75 ఏళ్ల ముసలితనంతో కొట్టుమిట్టాడుతున్న నాయకత్వాల ముందు మీరు బతకలేరని మీకు ముందే తెలుసు, మీ నాయకుడికి తెలుసు. అందుకే మీ ఆంతరంగిక సమావేశాలల్లో ఏమేమి మాట్లాడారో.. మీడియాలో వార్తలు వచ్చాయి.
చంద్రబాబుకు ఫ్రస్ట్రేషన్ కు కారణాలు ఇవే..
స్వయానా కమ్యూనిస్టులకు సంబంధించి పత్రికల్లో వచ్చిన వార్తలనే ఉటంకిస్తున్నాం. “అద్దె కుమారుడి కోసం చంద్రబాబు టెలిఫోన్ కాల్స్ అని. ఓట్లు జనం వేయడం లేదని ఒక వార్త. తన కొడుకు లోకేష్ రాజకీయాలకు పనికిరాడని చంద్రబాబు తేల్చినట్లు ఆ పత్రికలో వచ్చిన వార్త. ప్రత్యక్షంగా ప్రజా క్షేత్రంలో కార్పొరేటర్‌గా కూడా ఎన్నిక కాలేడని, చంద్రబాబు విశ్లేషించుకున్న వార్త. తన కొడుకును పార్టీ సీనియర్లు అసహ్యించుకుంటున్నారని ఆ పత్రికలో వచ్చిన వార్త. లోకేష్ రాజకీయాలకు పనికిరాడు కాబట్టి అతని నాయకత్వాన్ని ఆ పార్టీలోని మెజార్టీ నాయకులు సమర్థించడం లేదని వార్త. లోకేష్ వ్యవహరిస్తున్న తీరు సీనియర్ నాయకులకు కంటగింపుగా ఉందని వార్త. ఇవన్నీ గమనించే చంద్రబాబు ఓ అద్దె కొడుకు కోసం ప్రయత్నించాడని వార్త. అద్దె కొడుకుతో ఫోన్‌లో మాట్లాడని వార్త. ఆ అద్దె కొడుకు కొన్ని డిమాండ్లు పెట్టాడని, నారా లోకేష్‌ను కేవలం శవయాత్రలకు, పరామర్శలకు మాత్రమే పరిమితం చేస్తేనే మద్దతు పలుకుతానని వార్త. జగన్ గారిని ఎదిరించడానికి టీడీపీ సరిపోదని, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వైయస్సార్ సీపీ దూసుకుపోతుందని వార్త. సామాజిక సమీకరణలను బలంగా చేసి అట్టడుగు వర్గాలకు, రాజ్యాధికారాన్ని అలవాటు చేసి వారికి 50శాతం, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందించారు కాబట్టే టీడీపీ నక్కజిత్తులు చెల్లవని వార్త. అద్దె పుత్రుడు, ప్యాకేజీ పుత్రుడిని మద్దతు పలకాలని చంద్రబాబు అడుక్కుంటున్నట్లు వార్త. ప్యాకేజీ స్టార్ కు మీరు ఎంత ఆఫర్ ఇస్తే అంత తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని వార్త. సొంత కొడుకు ఉండగా, అద్దె, ప్యాకేజీ కొడుకు కోసం ఎందుకు తాపత్రాయ పడుతున్నావని మీ కొడుకు మీ మీద అలిగాడని వార్త. తనకు తానుగా దొడ్డిదారిన మంత్రి అయ్యి, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ ను పార్టీ అధ్యక్షుడిని చేస్తే కుక్క తోక పట్టుకుని సముద్రం ఈదినట్లేనని వార్త.” ఇవన్నీ చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ కు కారణం.
“పార్టీ లేదు.. బొక్కా లేదన్న అచ్చెన్నాయుడు మాటలను పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయని వార్త. సుజనా చౌదరి, సీఎం రమేష్ లానే విజయవాడ ఎంపీ కూడా బీజేపీలో జాయిన్ అవుతున్నట్లు వార్త. తన సొంత సామాజిక వర్గం వాళ్లే నమ్మడం లేదని వార్త. చంద్రబాబు మీద పార్టీ నేతలకే నమ్మకం లేదని, చంద్రబాబు కోసం రాధాకృష్ణ, రామోజీరావు ఎన్ని రహస్య సమావేశాలు పెట్టినా గట్టెక్కించలేరని వార్త. కాబట్టి నాలుగు ఓట్లు వేయించడానికి అయినా అద్దె కుమారుడు, ప్యాకేజీ కుమారుడు అవసరం అనుకుని మీరే జోలె పట్టుకుని వాళ్లు చుట్టూ తిరుగుతున్నావ్ అని ఆ పత్రికలో వచ్చిన వార్త.” ఇన్ని వార్తలు చూసిన చంద్రబాబు గారు… కుక్కలు, పందులతో ఒక్కోరోజు ఒకే మాటను ఎన్నిచోట్ల మాట్లాడించాడంటే… ఆంధ్ర రాష్ట్రం అంతా గంజాయి, మత్తు పదార్థాలతో నిండిపోయిందని దేవినేని ఉమా లాంటి వాళ్ళతో కూడా మాట్లాడించాడు. మీకు సిగ్గు, లజ్జ ఉందా? ఆంధ్ర రాష్ట్ర యువతరాన్ని అవమానపరుస్తారా?
ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని అపహాస్యం చేసేలా మాట్లాడతారా? మీరు ఇలానే మాట్లాడిస్తే.. సహించేది లేదు. ఇప్పటికే దారుణమైన రాజకీయ క్రీడతో ఆంధ్రరాష్ట్రాన్ని అట్టడుగు స్థాయికి తీసుకు వెళ్లారు. లేని అమరావతిని అభూత కల్పనతో సృష్టించారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదాను మీ రాజకీయ లబ్ధి కోసం తాకట్టు పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే పేద ప్రజలకు అన్నం పెడుతున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. దాని ఫలాలే వరుసగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు. మీకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే, పార్టీ మీద నమ్మకం ఉంటే బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయాలి కదా? ఎందుకు వదిలేసుకున్నారు. ఎందుకు మీ ప్యాకేజీ స్టార్ ఎన్నికల్లో నిలబడలేదు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఇలాగే వ్యవహరిస్తావేమో అని మీ పార్టీ క్యాడరే మిమ్మల్ని నమ్మడం లేదు. ఏ రాజకీయ పార్టీకి అయినా, నాయకుడికి అయినా ఎన్నికలే పరమావధి. అలాంటిది మీకు అవకాశం వచ్చినా ఎందుకు పోటీ చేయలేదు.
ఆంధ్రరాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని మీరు భావించి ఉంటే.. బద్వేల్ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు. గంపగుత్తుగా అయినా, మీరు కట్ట కట్టుకుని కలిసి వచ్చినా.. ఎలా వచ్చినా… మా నాయకుడు, మా సింహం మాత్రం సింగిల్‌గానే వస్తాడు. మీ నాయకత్వం పడిపోయిందని, మీకు ముసలితనం వచ్చిందని, మీ పార్టీని లోకేష్ నాశనం చేశాడని మీ పార్టీ నాయకులే అంటున్నారు. చివరకు కమ్యూనిస్ట్ పత్రికలు కూడా అవే చెప్పాయి.
మీడియా ముందుకొచ్చి బూతులు మాట్లాడుతున్న పట్టాభి ముందుగా సర్పంచ్ ఎన్నికల్లో వార్డు మెంబరుగా గెలవాలి. నోటిని అదుపులో పెట్టుకోవాలి. మీ మాటలు మా గుండెల్లో గుచ్చుకుంటున్నా… ప్రజా బలంతో ప్రజా ప్రతినిధులుగా గెలిచిన మేము ఓపికతో నిజాయితీ, నిబద్ధతతో ..సంస్కారబద్ధమైన రాజకీయపార్టీ, నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టే మీరు బతికిపోతున్నారు. చవకబారు, నేలబారు, ఇన్‌డైరెక్ట్ రాజకీయాలకు జగన్ మోహన్ రెడ్డిగారు వ్యతిరేకం. మా రూట్ స్టైయిట్‌గానే ఉంటుంది. ఏదైనా చెప్పే చేస్తాం. నాలుకను ఇష్టం వచ్చినట్లు వాడేముందు నారా చంద్రబాబు నాయుడు సమూహం జాగ్రత్తగా ఉంటే మంచిదని హెచ్చరిస్తున్నాం. స్పృహలో ఉండి మాట్లాడితే మంచిది.
రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు అందించిన ముఖ్యమంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మీకు నోరు ఎలా వస్తుంది? మీది ఒక జన్మేనా? మీరు మనుషులేనా? మీది ఒక రాజకీయ పార్టీయేనా? మీ నాయకుడు ఒక నాయకుడేనా? బుద్ధి ఉండాలి కదా? గౌరవ ముఖ్యమంత్రిగారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చేరాయి. అది మీరు జీర్ణించుకోలేక పోతున్నారు. అందుకే మీ ఉక్రోషం.
రాష్ట్ర జనాభాలో 80శాతం మంది ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదవర్గాలు మూకుమ్మడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుమారుడికి మద్దతుగా ఉన్నారు. అదే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ప్రస్ఫుటంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వ పటిమ కనబడింది.
ఇప్పటికైనా ఓటమిని టీడీపీ విశ్లేషించుకుంటుందని, నిర్మాణత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నాం. ఉగ్రవాదులుగా గుంపులుగా కూర్చుని బండ బూతులు తిడితేనే బాగా ఉంటుందని నేర్పించిన నాయకుడి నాయకత్వంలో తెగ బలిసి, దోపిడి దొంగల ముఠాగా తయారు అయ్యారు. అయ్యన్న, నక్కా ఆనంద్ బాబు, బండారు సత్యనారాయణ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడిన మాటలకు వారే సిగ్గుపడాలి.