– అన్ని వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్ పెట్టి వ్యవస్థలను ఎలా నాశనం చేయవచ్చో ఒక కేస్ స్టడీ
– నేరాలు-ఘోరాలు చేసి స్టేలు తెచ్చుకుని ఎలా బయట పడొచ్చో ఒక కేస్ స్టడీ
– వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు
పేదల సంక్షేమాన్నిఅవహేళన చేస్తారా..?
పేదలకు జరుగుతున్న మేలును ఏదో ఒక విధంగా అవమానించి, ఆటంకపరిచి, సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని వృద్ధ నక్క చంద్రబాబు తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నాడు. మా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 4 పోర్టులు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 10 హార్బర్లు నిర్మాణంలో ఉన్నాయి.మొత్తంగా 20 నూతన నిర్మాణాలను చేపట్టి మత్స్యకారులకు జగన్ గారు గొప్ప మేలు చేస్తున్నారు. ఈరోజు మూలపేటలో పోర్టుకు శంఖుస్థాపన కూడా చేశారు. ఇంతగా మంచి చేస్తున్న ముఖ్యమంత్రి ని బటన్ నొక్కే ముఖ్యమంత్రిగా అవహేళన చేయడం బాధ కలిగిస్తోంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినవాడు, ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినవాడు చంద్రబాబు. ప్రజలందరినీ మతం, కులం, ప్రాంతం పేరుతో విడదీసి పరిపాలించాలని దుష్ట ఆలోచన చేసిన వాడు చంద్రబాబు. ఇప్పటికీ తన పన్నాగాలను మానుకోకుండా ముఖ్యమంత్రిగారిని తూలనాడటం, వారి డైలీ ఆర్టిస్టులైన అడ్డ గాడిదలతో మాట్లాడించడం పరిపాటిగా మారింది.రూ. 2.08 లక్షల కోట్లు దళారీలు లేకుండా పేదవాడి ఖాతాలో డబ్బు పడే కార్యక్రమం వారి అవహేళనగా మారింది.దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రిని బటన్ నొక్కే ముఖ్యమంత్రి అనడం నిజంగా శోచనీయం.
నీ విజనరీ మైండ్ ఏమైంది..?:
ఆ రోజున ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయవచ్చు అన్న ఆలోచన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు నీకెందుకు రాలేదు చంద్రబాబు…? దళారీ వ్యవస్థ లేకుండా ప్రజలకు డబ్బు నేరుగా వారి ఖాతాలో పడే ఆలోచన నీ విజనరీ మైండ్‌కి ఎందుకు తట్టలేదు..?మేం చేస్తున్న సామాజిక న్యాయంలో కుల, మత, ప్రాంత భేదాలకు తావు లేదు. ఏదో ఒక్క సామాజిక వర్గానికే సాయం చేయాలన్న ఆలోచన మాకు లేదు.ఎన్నికల్లో నాకు ఓట్లేసిన వారికి మాత్రమే పథకాలు పంచుదామన్న ఆలోచన అంతకంటే లేదు. చంద్రబాబు పెట్టిన జన్మభూమి కమిటీల వంటి దళారీ వ్యవస్థ మా దగ్గర అసలే లేదు.ఇంతటి సుపరిపాలన భారతదేశ రాజకీయాల్లో ఒక యువకుడైన వ్యక్తి చేస్తున్నప్పుడు అభినందించాల్సింది పోయి నీ బుద్ధిని, దిగజారుడు రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ప్రతి గ్రామంలో అభివృద్ధిని పంచిపెట్టాడు. ప్రతి గ్రామంలో కనిపిస్తున్న సచివాలయం, రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్ లు.. ఇవన్నీ అభివృద్ధిగా చంద్రబాబు అండ్ కోకు ఎందుకు కనిపించలేదో ఇప్పటికీ అర్ధం కాని ప్రశ్న.నాడు-నేడు పేరుతో స్కూళ్లను, ఆసుపత్రులను బాగుచేస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అభివృద్ధిలా కనిపించడం లేదు..?
యుద్ధ సామాగ్రే లేదు…ఇక యుద్ధమేం చేస్తావ్ బాబూ..?:
మాతో యుద్ధం చేయడానికి చంద్రబాబు దగ్గర యుద్ధ సామాగ్రే లేదు.2014–19 వరకు చంద్రబాబు పరిపాలనలో గ్రామాల్లో జరిగిన అభివృద్ధి- సంక్షేమం లెక్కలు తీద్దాం2019 నుం.చి ఇప్పటి వరకూ జగన్ గారి హయాంలో ఏమేమి అభివృద్ధి జరిగిందో కూడా లెక్కలు తీద్దాం. నీ హయాంలో సామాజిక న్యాయం లేదు…ఇంటింటా అభివృద్ధి లేదు.యువకుల జీవితాల్లో అభివృద్ధి లేదు..మహిళలను నిలువునా మోసం చేశావ్. నీ హయాంలో సకాలంలో వర్షాలేవు..బాబొస్తే వరుణ దేవుడు కూడా పారిపోయాడు. అందుకే గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తున్న జగన్ ని తూలనాడుతున్నావ్..అక్కసు వెళ్లగక్కుతున్నావ్. నువ్వు ఒక మాట అంటే మేం పదిమాటలు అనగల సామర్ధ్యం, శక్తి ఉన్నాయని నీకు తెలుసు..మేం మాట్లాడాలనే, మా చేత కూడా బూతులు తిట్టించుకుని సానుభూతి డ్రామాలు పండించుకోవాలన్నదే నీ కుతూహలం. నీకు పోరాటం చేయడానికి అంశమే లేదు..నీతో మేం చర్చించడానికీ ఎటువంటి అంశమూ లేదు. నీ దగ్గర స.త్తాలేదు…చేవ లేదు…రోజూ పచ్చ బ్యాచ్ ప్రెస్మీట్లతో అబద్ధాలను వల్లెవేసుకుంటున్నారు. జగన్ ని ఒక్కరినే టార్గెట్ చేసి ఆయనపైనే మరకవేసి, ఆటంకపరచాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు.
చంద్రబాబు చీకటి యుద్ధాన్ని నమ్ముకున్నాడు:
నీ సెల్ఫీ చాలెంజ్‌ని మేం స్వీకరిస్తున్నాం…నువ్వు ఎక్కడ ఇళ్లపట్టాలిచ్చావో సెల్ఫీ దిగు..మేం ఎక్కడ ఇచ్చామో సెల్ఫీ పెడతాం. నీ వద్ద యుద్ధానికి సామాగ్రి లేదు…అందుకే నువ్వు చీకటి యుద్ధాన్ని నమ్ముకున్నావఆ చీకటి యుద్ధంలో ప్రజల్ని ఏమార్చడం, మభ్యపెట్టడం, భయభ్రాంతులను చేయడం బాబుకు అలవాటుగా మారింది. ప్రజా మద్దతు లేని నువ్వు జగన్ గారి స్థాయిని తగ్గించాలని కుటిల రాజకీయాలతోప్రయత్నం చేస్తున్నావ. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసినట్లు, రథాలను తగలబెట్టి మతగొడవలు పెట్టాలనే ప్రయత్నాలన్నీ ఒక పథకం ప్రకారమే చేస్తున్నావు. రాష్ట్రానికి పట్టిన శని, పిశాచి బాబే:. ఒక పథకం ప్రకారం జగన్మోహన్రెడ్డి గారిపై మచ్చ వేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. దానిలోని భాగమే వివేకానందరెడ్డి గారి కేసు..దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అవినాష్‌రెడ్డి వరకూ తీసుకొచ్చావు. నారా చంద్రబాబు రాజకీయజీవిత చరిత్రలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలు.ఆయన ఏం చేశాడో ఇతరులు కూడా అదే చేస్తారని ఆయన నమ్ముతున్నాడు.ఈ రాష్ట్రానికి పట్టిన శని …పిశాచి, నీచ నికృష్ట రాజకీయ దుష్టుడు చంద్రబాబే.నీ చెండాలపు రాజకీయపు చెత్త వ్యవహారాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
ఏ తప్పూ చేయని తమ్ముడి కోసం నిలబడటం నేరమా..?
వైఎస్సార్ చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి అండగా జిల్లా రాజకీయాలు నడుపుతున్నారనే అవినాష్‌రెడ్డిని దెబ్బతీయడం కోసమే మీరు చేసిన ఈ కుట్ర. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని రాజకీయంగా దెబ్బతీయడం కోసమే నువ్వు, నీ మీడియా చేసిన కుట్రే ఈ సంఘటన. ముఖ్యమంత్రి సొంత బాబాయిని తన సొంత సోదరుడే హత్య చేయించాడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు.నా తమ్ముడు మంచి వాడు, తప్పు చేయడు, చేయలేదు అని చెప్పడం తప్పా..? తన సొంత ఎంపీని, తమ్ముడిని నిరపరాధి అని, తన తమ్ముడి కోసం నిలబడటం నేరమా..?అలా ఏ రాజ్యాంగంలో రాసి ఉంది..ఆ నేరం ఎవరు చేశారని చెప్పించాలని నీ ప్రయత్నం..? మేం ఫలనా వాళ్లు నేరం చేసి ఉంటారని మా అనుమానాలు చెప్తుంటే..వాటిపై విచారణ చేయాల్సిన బాధ్యత సీబీఐపై లేదా..? ఒక ప్రతిపక్ష నాయకుడిగా మేం చెప్తున్న అంశాలపై నువ్వెందుకు ప్రశ్నించవు..?
అప్పుడు నువ్వే సీఎంగా ఉండి ఏం చేశావ్ బాబూ?
హత్య జరిగిన రోజు నువ్వే ముఖ్యమంత్రివి కదా..? హత్య జరిగిన మూడు నెలల తర్వాత ఎన్నికలొచ్చాయి..ఆ మూడు నెలల కాలంలో నువ్వేం పీకావ్ అని ప్రశ్నిస్తున్నాం..నువ్వెందుకు విచారణ చేయలేదు.నిజంగా భాస్కరరరెడ్డి, అవినా«ష్‌రెడ్డి ప్రమేయం ఉంటే నువ్వెందుకు ఆ రోజు వారిని అనుమానితులుగా చెప్పలేదు..? ఆ మూడు నెలల కాలంలో నీ ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీ, కడప జిల్లా ఎస్పీలు నీకేం చెప్పారు..? ఎమ్మెల్సీ ఎన్నికలే ప్రాతిపదికగా తీసుకుంటే టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిని గెలిపించడానికి నీ క్యాబినెట్ మంత్రి ఆదినారాయణరెడ్డిని పెటింది నువ్వే కదా..బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డిలే హత్యానేరం చేశారని మేం ఆరోపించినప్పుడు ఆ కోణంలో ఎందుకు విచారణ జరగలేదు..?అన్ని కోణాల్లో విచారణను మేం ఆహ్వానిస్తున్నాం..నిజంగానే దోషులు బయటపడాలని కోరుతున్నాం.హత్యచేసిన వ్యక్తి బయటకు రావాలని, అన్ని కోణాల్లో విచారణ చేయమని కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా తన సొంత తమ్ముడు అలా చేయడని బలంగా నమ్ముతున్నాం.
ఎన్టీఆర్ చావుకు నీవే కారణం కదా.. మరి, విచారణ ఎందుకు జరగలేదు..?
కుటుంబ సభ్యులిచ్చిందే సాక్ష్యంగా ఆధారమైతే…సునీతమ్మ చెప్పిందే ఆధారంగా తీసుకుంటే..ఎన్టీఆర్ చావుకు నువ్వే కారణమని లక్ష్మీపార్వతి ఆరోపించింది. ఆ కోణంలో ఎందుకు విచారణ జరగలేదు..? కనీసం భోజనం కూడా పెట్టకుండా చంపేశారని లక్ష్మీపార్వతి చెప్పారు. నీ అంత నీచ నికృడు మరొకడు లేడని, దుర్మార్గుడు అని, అందుకే వెన్నుపోటు పొడిచాడని నీ గురించి స్వయంగా నీకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ చెప్పాడు కదా.. నువ్వే ఎన్టీఆర్‌ని చంపావని రోశయ్య కూడా ప్రకటన చేశారు. ఇవన్నీ నీ జేబు పత్రికలు మాత్రం రాయలేదు.
బాబు కుట్రలపై కేస్ స్టడీ చేయాలి:
కేస్ స్టడీ చేద్దాం..రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో జరిగిన అనేక ఘోర నేరాలపై కచ్చితంగా కేస్ స్టడీ చేసి తీరాలి.మేము కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడం అనే అంశాన్ని కేస్ స్టడీగా స్వీకరించాలని కోరుతున్నాం.ఎలా వెన్నుపోటు పొడిచి, సొంత మామను పదవీచ్యుతుడ్ని చేయవచ్చో కూడా కేస్ స్టడీ చేయాలి.ఎలా మీడియాను మేనేజ్ చేయవచ్చో, ఏ విధంగా ఎమ్మెల్యేలను కొనవచ్చో కూడా కేస్ స్టడీ చేయాలి. అంతర్జాతీయ జడ్జిలకు కూడా దొరకకుండా నేరాలు చేయవచ్చని నువ్వు నిరూపించావ్ చంద్రబాబు.ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్, భారతదేశ రాజకీయ ముఖచిత్రంలో వ్యవస్థలను ఎలా వాడుకోవచ్చో, ఎలా ధ్వంసం చేయవచ్చో నిరూపించిన చంద్రబాబు జీవితం అందరికీ ఒక కేస్ స్టడీ.
నారా చంద్రబాబు సోనియా గాంధికి కొమ్ము కాసి ఏ విధంగా రాష్ట్ర విభజనకు తోడ్పడ్డాడో దాన్ని కూడా కేస్ స్టడీ చేయాలి. చాలా నిశ్శబ్ధంగా తాను ఎంచుకున్న పదిమందికి ఈ రాష్ట్రాన్ని ధారాదత్తం చేసి ఏ విధంగా సహజసంపదను దోచిపెట్టాడో కూడా ఒక కేస్ స్టడీగా తీసుకోవాలి.నారా చంద్రబాబు రాజకీయాల్లోకి రాక ముందు ఆస్తుల విలువ, ఈ రోజు వారి ఆస్తుల విలువలను కూడా కేస్ స్టడీగా తీసుకుని విచారణచేయవచ్చు. ఎంతో అనురాగబంధంతో ఉండే ఒక కుటుంబాన్ని నిట్టనిలువునా చీల్చవచ్చని నువ్వు చేసిన తీరును కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని న్యాయకోవిదిలు, పత్రికాధినేతలు కేస్ స్టడీ చేయాలి. లోకేశ్ రాజకీయ రంగప్రవేశం, ఆయన రాజకీయ ప్రయాణం…ఆయన చదువుపై ఒక కేస్‌స్టడీ జరగాలి.ఆయన చదువుకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఎలా జరిగిందో అదో కేస్ స్టడీ. రామలింగరాజు పూర్తిగా నాశనం అవ్వడం మన కళ్లారా చూశాం..అదో కేస్ స్టడీ. ప్రభుత్వ సహకార బ్యాంకులు, అర్బన్ బ్యాంకులను ఎలా ద్వంసం చేయవచ్చో కూడా అదో కేసు స్టడీ. థాయ్‌ల్యాండ్ అనే నీ జాయ్ ల్యాండ్‌కు జనాల డబ్బును ఎలా తరలించావో అది కూడా ఒక కేసు స్టడీ. ఎన్టీఆర్ మద్యనిషేధం చేస్తే.. చంద్రబాబు దాన్ని మళ్ళీ ఎలా తీసుకొచ్చాడో ఒక కేసు స్టడీ. భారతదేశంలోని అన్ని వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్ ను పెట్టి ఎలా నాశనం చేయవచ్చో ఒక కేసు స్టడీ..
ఇలా జాతీయ ఉగ్రవాదానికి కారణం చంద్రబాబే.. చంద్రబాబు మాత్రమే చేయగిలిన నేరాలు, ఘోరాలు ఈ దేశంలో ఏ ఒక్కరూ చేయలేరు. ఇన్ని చేసినా స్టేలు తెచ్చుకుని ఎలా బయట ఉండొచ్చని నేర్చించడం ఒక కేస్ స్టడీ.ఆయన చేసిన రాజకీయ దురాగతాలు, దళితులపై దాడులు ఎవరూ చేయలేదు.ఆయన ఇచ్చినన్ని అబద్దపు హామీలు ఎవరూ ఇవ్వలేదు..అయినా ఇంకా నువ్వు రాజకీయ నాయకుడిగా ఉండటం కేస్ స్టడీ.ఒక దొంగ ముఖ్యమంత్రిగా ఎలా వెళ్లొచ్చు…తనకు చెందని రాజకీయ పార్టీని ఎలా సొంతం చేసుకోవచ్చో ఆయన మాత్రమే నిరూపించాడు.. దానిపైనా ఒక కేస్ స్టడీ.. ఆ పార్టీ అధ్యక్షుడివి అయ్యి…ఆ పార్టీ స్థాపించిన వారి కొడుకులు, కూతుళ్లను సర్వనాశనం చేసిన తీరుపై కేసు స్టడీ చేయాలి.మంగళగిరి ఉట్టిని ఎక్కడానికి నీ పొట్టిగాడికి ఎందుకు చేతకాలేదు..? అతను ఎందుకు ఉట్టి ఎక్కలేకపోయాడో కేస్ స్టడీ చేయాలి. ప్రపంచంలో మేధావిని అని చెప్పుకుంటున్న వ్యక్తి తన కొడుకును ఎలా గెలిపించుకోలేకపోయాడో కూడా కేస్ స్టడీగా తీసుకోవాలి.చంద్రబాబు అంటే..తొక్కడానికి పెడల్ లేని బైక్…మైక్ లేని మైకేల్ జాక్సన్. టీడీపీ గాడిదలు రోజుకొకరు వచ్చి వాగుతున్నారు..వీళ్లను మాట్లాడిస్తున్న అడ్డగాడిద నారా చంద్రబాబునాయుడు.
నీ కుటిల రాజకీయాలకు ఈ రాష్ట్రంలో తావు లేదు చంద్రబాబు:
రూ. 2.08 లక్షల కోట్ల డబ్బు బటన్ నొక్కితే నేరుగాప్రజల ఎకౌంట్లలో పడింది.. ఇవన్నీ చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. కుట్రలు చేస్తున్నావు. అందుకే, నువ్వు చచ్చేదాక ఈ రాష్ట్రం బాగుపడదని అనాల్సిన దుస్థితి నేడు ఈ రాష్ట్రానికి వచ్చింది. నీ కుటిల రాజకీయాలకు ఈ రాష్ట్రంలో తావు లేదు చంద్రబాబు. రాష్ట్రంలోని అత్యధిక ప్రజలు జగన్ గారే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రార్ధనలు చేస్తున్నారు.పేదవాడి ప్రార్ధన దేవుడు వింటాడు…నువ్వు పెంచి పోషించే కార్పొరేట్ శక్తుల ప్రార్ధనలను దేవుడు వినడు.
అసలు చంద్రబాబుకు 175 చోట్లా అభ్యర్థులే లేరు…
పులివెందులలో కూడా గెలుస్తాడా..? సంతోషం..మేం ఆ చాలెంజ్ స్వీకరిస్తున్నాంచంద్రబాబుకు ఖలేజా ఉంటే ముందు కుప్పం సంగతి చూసుకోమనండి.మా లక్ష్యం 175.. ఆ దిశగా త్రికరణశుద్ధిగా పనిచేస్తున్నాం.మేం ఒకటే అడుగుతున్నాం..నీకు 175 నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా..?అలా ఉంటే ఇక పవన్ కళ్యాణ్ సాయం ఎందుకు..? ఒక్కడివే పోటీకి రావచ్చుగా? జగన్ వ్యక్తిగత ఇమేజ్ను టార్గెట్ చేస్తూ దుష్ట చతుష్టయం రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నాయి..
ఒక అగంతకుడు కత్తి తీసుకుని ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ని పోడిస్తే అవహేళన చేస్తారా..అదే కత్తి మెడమీద తగిలితే ఆ రోజు ప్రాణహాని జరిగి ఉండేది. మీ మాదిరిగా దిగజారుడు రాజకీయాలు జగన్ గారు ఏనాటికీ చేయడు..చేయబోడు.
బాధితులను ముద్దాయిలుగా చిత్రీకరించడంలో దిట్ట బాబు
జగన్ బాధితుడైతే… ఆయన్నే ముద్దాయిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.అది కోడికత్తి కేసైనా.. వివేకా హత్య కేసైనా బాధితులుగా ఉన్నది జగన్ గారి కుటుంబమే..ఈ రోజు మీరంతా దోషిగా చూపిస్తున్న అవినాష్‌రెడ్డి గారు కూడా బాధితుడే.ఇదేమీ విడ్డూరమో కానీ ఈ రాష్ట్రంలో బాధితులనే ముద్దాయిలుగా చేస్తూ సినిమాలో స్క్రీన్‌ప్లే రాసినట్లు పథకం ప్రకారం జరుగుతోంది. జగన్ ని రాజకీయంగా ఎదుర్కోలేనివారే కుట్రలు చేస్తున్నారు.వారికి అన్ని మార్గాలూ మూసుకు పోయాయి…అందుకే ఇలాంటి రాజకీయ కుట్రలు చేస్తున్నారు. శాశ్వతంగా పడిపోయిన టీడీపీని, జాకీలు పెట్టి లేపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ…తెలుగు దేశం పార్టీ ఒక ముగిసిన అధ్యాయం.ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి.. భారత ప్రధాని, ఇతర మంత్రులను కలవడానికి సమయం, సందర్భం ఏముంటుంది..? రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లొచ్చు.