Suryaa.co.in

నేడు ఇంటికొక ఇంజనీర్ ఉన్నారంటే అది చంద్రబాబు ఘనతే
Andhra Pradesh

నేడు ఇంటికొక ఇంజనీర్ ఉన్నారంటే అది చంద్రబాబు ఘనతే

– జగన్ రెడ్డి పాలనలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురవుతోంది
– టీడీపీ ‍హయంలోనే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
– ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేసిన విధ్యార్దులపై తప్పుడు కేసులు సిగ్గుచేటు
– టీడీపీ అధికారంలోకి రాగానే విధ్యార్ధులపై పెట్టిన ‎ అక్రమ కేసులు ఎత్తివేస్తాం
– టీడీపీ జాతీయ కార్యాలయంలో అట్టహాసంగా టీ.ఎన్. ఎస్. ఎఫ్ ప్రమాణ స్వీకారం
టీడీపీ ‍హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో విద్యారంగంలో ‎విప్లవాత్మక మార్పులు తెస్తే జగన్ రెడ్డి రెండున్నరేళ్లలోనే విద్యారంగాన్ని నాశనం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో టీ.ఎన్. ఎస్. ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మాణం ప్రణవ్ గోపాల్ అధ్యక్ష్యతన టీ.ఎన్.ఎస్.ఎఫ్ (తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్) ప్రమాణస్వీకారం అట్టహాసంగానిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అచ్చెన్నాయుడు మాట్లాడుతూ……
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో పాఠశాలల అభివృద్దితోపాటు ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ, ప్రతి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. నేడు ప్రతి ఇంటిలో ఒక ఇంజనీర్ ఉన్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు విట్, ఎస్.ఆర్ఎం వంటి ప్రఖ్యాత విద్యాసంస్ధలు రాష్ట్రానికి తీసుకువచ్చారు.
కానీ జగన్ రెడ్డి ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారు. ప్రజల హక్కుల్ని కాలరాస్తూ, వారి జీవన విధానాన్ని పాడుచేస్తున్నారు. విద్య వ్యవస్ధను నాశనం చేశారు. నాడు నేడు పేరుతో
tnsf1వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అమ్మఒడి పేరుతో రూ. 14 వేలు ఇచ్చి నాన్న బుడ్డితో రూ. 36 వేలు లాక్కుంటున్నారు. పేద పిల్లలు సైతం విదేశాల్లో చదవాలన్న సంకల్పంతో చంద్రబాబ నాయుడు విదేశీ విద్య ప్రవేశపెడితే .. జగన్ రెడ్డి విదేశీవిద్య రెండవ విడత నిదులు నిలిపివేయటంతో విదేశాల్లో చదువుతున్న పేద విద్యార్దులు దేశం కానీ దేశాల్లో నానా అవస్ధలు పడుతున్నారు.
నిరుద్యోగ భృతి రద్దు చేసి 6 లక్షలమందికి ద్రోహం చేశారు. స్టడీ సర్కిల్స్ నిర్వీర్యం చేశారు. జీవో 77 తో పీజు రీయంబర్స్ మెంట్ రద్దు చేసి పేద విద్యార్దులను ఉన్నత విద్యను దూరం చేస్తున్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పి జాబ్ లెస్ క్యాలెండర్ విడుదల చేశారు. జగన్ రెడ్డి తెస్తానన్న ఉద్యోగ విఫ్లవం అంటే వాలంటీర్ ఉద్యోగాలతోనేనా? చట్ట వ్యతిరేకంగా గ్రామ, వార్డు సచివాలయ పంచాయితీ కార్యదర్శుల్ని మహిళా పోలీసులుగా నియమించారు, కోర్టు చివాట్లు పెడుతుందని తెలిసి జీవో వెనక్కి తీసుకున్నారు. జగన్ కి ఇలాంటి తుగ్లక్ ఆలచోనలు ఇచ్చేది ఎవరు? జగన్ కంటే తెలివిలేదు. మరీ డీజీపీకి తెలివిలేదా?
స్యాతంత్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్ర అప్పు రూ. 3 లక్షల కోట్లు అయితే జగన్ రెడ్డి రెండున్నరేళ్లలోనే రూ. 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రభుత్వానికి ఆదాయం లేక ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. నిత్యవసరధలు పెంచారు, గతంలో ఎప్పుడో కట్టిన ఇళ్లకు పట్టాలిస్తాం అంటూ రూ. 5 వేల కోట్లు బలవంతంగా వసూలు చేస్తున్నారు. రాజధాని అమరావతి నిర్వీర్యం చేసి యువతకు ఉపాధి లేకుండా చేశారు. అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న రైతుల్ని అడగడుగునా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న జగన్ రెడ్డి మళ్లీ మరోసారి బిల్లు తెస్తారంటా. ఎన్ని బిల్లులు తెచ్చినా అమరావతే రాజధానిగా కొనసాగుతుంది.
ఈ సంధర్భంగా అచ్చెన్నాయుడు విద్యార్ధుల సమస్యలపై టీ.ఎన్.ఎస్.ఎఫ్ చేస్తున్న పోరాటాల్ని అభినందించారు.కోవిడ్ సమయంలో ప్రభుత్వం మూర్కంగా 10వ తరగతి పరీక్షల నిర్వహణకు సిద్దమైతే టీ.ఎన్.ఎప్ఎస్ పోరాటంతో దిగివచ్చింది. ఎయిడెడ్ ‎విద్యాసంస్ధల విలీనంపై ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి
tnsf2కారణం విద్యార్దులు, టీఎన్.ఎన్ ఎప్ పోరాటమే.. రాష్ట్రంలో ఏ విద్యార్ధికి అన్యాయం జరిగినా టీఎన్.ఎస్. ఎప్ అండగా ఉండాలి. విద్యార్దుల సమస్యలపై పోరాడుతుంటే పోలీసులు, తప్పుడు కేసులు ప్రభుత్వం బెదిరింపులకు గురిచేస్తోంది. టీడీపీ అధికారంలోకి రాగానే కేసులన్నీ ఎత్తివేస్తామని భరోసా ఇచ్చారు.
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష మాట్లాడుతూ….. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తుంటే విధ్యార్ధు నుంచి వృద్దుల వరకు అందరిపై తప్పుడు కేసులు పెడుతూ ప్రభుత్వం వేధిస్తోంది. జగన్ రెడ్డి వైఖరి వల్ల ప్రజలకు పోలీసులంటే గౌరవం, భయం లేకుండా పోయింది. తుగ్లక్ పాలన వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి పోయింది. టీడీపీ పాలనలో అభివృద్దిలో నెం. 1 గా ఉన్న రాష్ట్రం నేడు డ్రగ్స్ , మహిళలపై అత్యాచారాలు, దాడుల్లో నెం.1గా ఉంది. రాష్ట్రానికి పరిశ్రమలు లేవు, మహిళలు, విద్యార్ధులు అన్ని వర్గాలను మోసం చేశారు.
జగన్ తీరుతో రాష్ట్ర పరువుపోతోంది. ఏపీవారమని చెప్పుకోవడానికీ సిగ్గుగా ఉంది. చంద్రబాబుకి ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు, కానీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్రానికి అవసరం. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు టీఎన్.ఎస్. ఎఫ్ కృషి చేయాలి. టీ.ఎన్. ఎస్. ఎస్ చేస్తున్న పోరాటాలకు పార్టీ అండగా ఉంటుంది.
ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ….రాజకీయంగా ఎదగాలనుకునేవారికి విధ్యార్ధి దశే పునాది. నేడు ఉన్న రాజకీయనాయకుల్లో చాలామంది విద్యార్ధి నాయకులే. ప్రతి ఒక్కరూ వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. మహిళలు కూడా రాజకీయాల్లో రాణించాలి. అంకితభావం, నిజాయితీతో పనిచేసినపుడే భవిష్యత్తులో ఉన్నతస్ధాయికి ఎదగగలరు. రాజకీయాల్ని ఫ్యాషన్ కాకుండా ప్రజాసేవకు పాడుపడేందుకు ఉపయోగించుకోవాలి.
మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్ మాట్లాడుతూ….చంద్రబాబు నాయుడు యూనివర్సిటి నుంచే విధ్యార్ధి నేతగా అందరి మన్ననలు పొందుతూ. రాజకీయ నేతగా ప్రజల మన్ననలు పొందుతూ ముఖ్యమంత్రి స్ధాయికి ఎదిగారు. ఎన్టీఆర్ చెప్పినట్టు కృషి, పట్టుదల ఉంటే ఏధైనా సాధించగలరు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అప్పటివరకు ధనవంతులకే పరిమితైన రాజకీయాలు… టీడీపీ ఆవిర్భావంతో విద్యార్ధులు, సామాన్యులు, డాక్టర్లు ఎందరో ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయనేతలుగా ఎదిగారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రయ్యే నాటకి కరెంట్ బిల్లులు, ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థితిలేదు.
కానీ అనతికాలంలోనే చంద్రబాబు రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ది చేస్తే జగన్ రెడ్డి వచ్చి నాశనం చేశారు. చంద్రబాబు నాయుడు విధ్యార్ధుల కోసం విదేశీ విద్య వంటి పధకాలు రద్దు చేసి విద్యార్ధులకు ద్రోహం చేశారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పధకాలు నిలిపివేసిన జగన్ రెడ్డి… గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు ఓటీఎస్ ఎలా వసూలు చేస్తారు? వైసీపీ అరాచక పాలనను అంతం చేసి చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూని పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ…విధ్యార్దులు రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు టీఎన్.ఎస్.ఎప్ మంచి వేదిక. రాజకీయాలై ఆసక్తి ఉన్నవారు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. రాజకీయాల్లోకి విద్యార్ధులు వచ్చినపుడే రాజకీయాల్లో నిజాయితీ, నైతిక విలువలు ఉంటాయి.జగన్ రెడ్డి లాంటి నేరస్తులు రాజకీయాల్లోకి రావటం వల్ల రాజకీయాల్లో నైతిక విలువలు అంతరించిపోతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు టీ.ఎన్.ఎస్. ఎఫ్. నాయకులు మాట్లాడుతూ..జగన్ రెడ్డి పాలనలో విద్యారంగాన్ని నాశనం అయింది. విద్యార్ధుల సమస్యలపై పోరాడుతున్న తమపై తప్పుడు కేసుల పెట్టి పోలీసులతో బెదిరిస్తున్నారు. తాము జగన్ లా అవినీతికి పాల్పడటం లేదు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు, వైసీపీ పాలనను అంతంచేసి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాడుతామని అన్నారు.

LEAVE A RESPONSE