Suryaa.co.in

Tributes paid to B R Ambedkar
Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి పాలన ఆసాంతం మానవహక్కుల హననమే

• ముఖ్యమంత్రి అమలుచేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగంలో ప్రజలు నిత్యం భయాందోళనలతో దేవుడిని తలుచుకుంటూ బతుకుతున్నారు.
• పోలీసులను లొంగదీసుకొని, తాయిలాలుఇస్తూ, వారిఅండతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకప్రజలు నిత్యం భయంభయంగా దేవుడిని తలుచు కుంటూనే బతుకుతున్నారని, అధికారంలోకి రాకముందు ప్రతిసారీ దేవునిదయ అని జగన్ ఎందుకన్నాడో ఇప్పుడుప్రజలకుపూర్తిగా బోధపడిందని, ముఖ్యమంత్రి అమలుచేస్తున్న రాజారెడ్డి రాజ్యాంగందెబ్బకు, ఆ దేవుడులేకుంటే ఏరోజు తమజీవితాలు ఏమవుతాయోన న్న భయాందోళలనలతో బతుకతున్నారని టీడీపీ అధికారప్రతినిధి పిల్లి మాణిక్యరావు తెలిపారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
జగన్ తనకంటూ ప్రత్యేకంగా రాజారెడ్డి రాజ్యాంగం ఏర్పాటుచేసుకున్నాడు. దానిప్రకారం ఆయనకుఏదైనా కావాలంటే దానికోసం అవసరమైతే కాలర్ పట్టుకోవడం, కాళ్లుచేతులు తీసే యడం, గొంతులు తీయడం వంటివిచేయడంతోపాటు, అనువుగానిచోట కాళ్లుపట్టుకోవడం కూడాచేస్తున్నాడు. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే, ఇప్పుడు వారిని తనమంత్రులతో బూతులుతిట్టిస్తున్నాడు. అమరావతికి భూము లిచ్చిన రైతులు, మహిళలను పోలీసులతో బూటుకాళ్లతో తన్నించడం, మహిళలను జుట్టు పట్టి ఈడ్పించడం వంటివి చేశాడు.
3లక్షల ఉద్యోగాల గురించి నిరుద్యోగులు,యువత ప్రశ్నిస్తే వారిపై రేప్ కేసులు పెట్టించాడు. తనకు అన్యాయంజరిగిందని దళితజడ్జీ వాపోతే, ఆయన్ని రాష్ట్రంనుంచి తరిమితరిమి కొట్టేలాచేశారు. మాస్క్ లు లేవని, వైద్యం ఎలాచేయాల నిప్రశ్నించిన పాపానికి దళితవైద్యుడు డాక్టర్ సుధాకర్ పెడరెక్కలు విరిచి, నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. చివరకు ఆయనే తనకుతానుగా చనిపోయేలా చేశారు. ఈ విధంగా అనేకఘటనలు రాష్ట్రంలో మానవహక్కుల హననానికి అద్దం పడుతున్నాయి.
ముఖ్యమంత్రి ఇంటిసమీపంలో యువతిపై అత్యాచారంజరిగినా, తనసొంత నియోజకవర్గంలో దళితమహిళనాగమ్మను అత్యాచారంచేసి, హత్యగావించినా ఎక్కడా రాజ్యాంగంప్రకారం మానవహక్కులు అమలుకాని దుస్థితి. విజయవాడలో మహిళలపై అత్యాచారంజరిగినా, రాజమహేంద్రవరంలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినా రాష్ట్రంలో మానవహక్కులకు రక్షణ లేదు. గుంటూరుసమీపంలో స్వాతంత్ర్యదినోత్సవం నాడే దళితయువతిని దారుణంగా పొడిచిచంపడంతో మానవహక్కులను ఈప్రభుత్వం నడిరోడ్డుపై హత్యగావింపబడింది.
కులం చూడం, మతం చూడం అనే మాటను ముఖ్యమంత్రి హత్యలు, అత్యాచారాలకుపరిమితం చేశాడు. నడిరోడ్డుపై పోలీసులు సహకారంతోనే రాష్ట్రంలో దారుణాలు జరుగుతున్నా, మానవ హక్కులు ఠాణాల్లో హరించబడుతున్నాకూడా ప్రభుత్వంలో, పాలకుల్లో చలనంలేదు. దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా ఏపీ డీజీపీ లెక్కలేనన్నిసార్లు కోర్టుమెట్లుఎక్కారు. స్వయం గా ప్రతిపక్షనేత అయినచంద్రబాబుగారి ఇంటిపై, అధికారపార్టీ ఎమ్మెల్యే చెప్పిమరీ దాడిచేస్తే, దానిపర్యవసానంగా డీజీపీ కోర్టుముందు నిలబడ్డారు.
చంద్రబాబుఇంటిపై ఆయనపార్టీ ఎమ్మెల్యేలే దాడిచేశారు.. వారితో ఆయనే దాడిచేయించుకున్నారని స్వయంగా హోంమంత్రే చెప్పడం రాష్ట్రంలోని మానవహక్కులదుర్వినియోగానికి నిదర్శనం. రాష్ట్రంలో డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగం తాముఅమలుచేయమని, జగన్మోహన్ రెడ్డి చెప్పిందే అమలు చేస్తామని స్వయంగా వైసీపీఎమ్మెల్యేనే అన్నారంటే పరిస్థితి ఎలాఉందో అర్థమవు తోంది. పత్తిపాడు

నియోజకవర్గంలో మాజీజడ్పీటీసీ సభ్యురాలిఇంటిపై పెట్రోల్, మారణాయు ధాలతో దాడిచేస్తే, హోంమంత్రి స్వయంగా వెళ్లిపరిశీలించి, వారిపైవారే దాడిచేసుకున్నారని, అక్కడేమీ జరగలేదని చెప్పడం మానవహక్కుల ఉల్లంఘన కిందకురాదా? పోలీస్ అధికారు లను లొంగదీసుకొని, వారికి తాయిలాలు ఇస్తూ, వారి అండతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడు పుతున్నారు.
తాముచేస్తున్నవాటిని, తమప్రభుత్వతప్పులను ఎత్తిచూపుతున్నాడని స్వయంగా అధికారపార్టీ ఎంపీకే కోటింగ్ (పోలీస్ దెబ్బలు) ఇచ్చేస్థాయికి రాష్ట్రంలోని రాజారెడ్డి రాజ్యాంగం వెళ్లింది. అధికారపార్టీ ఎంపీ అని కూడాలేకుండా సహచరఎంపీలే దమ్ముంటే రా చూసుకుందామనే పరిస్థితిని చూస్తున్నాం. చాలామంది బోషడీకేలు, ముఖ్యమంత్రిని ఎవరో బోషడీకే అన్నారని, పోలీస్ అమరవీరులసంస్మరణ సభలో నోటికొచ్చినట్లు మాట్లాడారు. స్వయంగా లేనిదాన్ని తనకు, తనతల్లికి ఆపాదించుకొని మరీ రాష్ట్రముఖ్యమంత్రే బోషడీకే అనే పదానికి కొత్తఅర్థంచెప్పి, సిగ్గులజ్జ లేకుండా ప్రవర్తించాడు.
రాష్ట్రంలోని మంత్రులు, వైసీపీ ఎమ్మల్యేలు బూతులపంచాంగం విప్పుతుంటే, అసెంబ్లీలో హద్దుమీరిప్రవర్తిస్తుంటే, ఎంపీలు పార్లమెంట్ లో బూతులపురాణం పఠిస్తుంటే, అవేవీ ముఖ్యమంత్రికి కనిపించడంలేదా? బోష డీకే అనేపదానికి అర్థంవెతికిన ముఖ్యమంత్రి, తనపార్టీ ఎంపీలు పార్లమెంట్ లో తోటిఎంపీని పట్టుకొని లం..కొడకా అంటే ఎందుకు చూస్తూఊరుకున్నాడు? అధికారపార్టీఎంపీలకే జగన్ ప్రభుత్వంలో రక్షణలేకపోతే, ఇకసామాన్యప్రజలపరిస్థితి ఎలాఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రంలో ప్రజలెవరూ స్వేచ్ఛగా జీవించే పరిస్థితి మచ్చుకైనా కనిపించడం లేదు.
పశ్చిమగోదావరి కొవ్వూరునియోజకవర్గం, మలకపల్లి గ్రామంలో గడ్డంశ్రీను అనే దళితుడిని అత్యంత దారుణంగా చంపేశారు. ఆఘటన పూర్వాపరాలు తెలుసుకోవడానికి రాష్ట్రఎస్టీఎస్టీ కమిషన్ ఛైర్మన్ అక్టోబర్ 28న ఆప్రాంతంలో పర్యటించి , అసలు వాస్తవాలు తెలసుకొని, నిందితులైన ఇద్దరు వైసీపీనేతలు కొమ్మరాజు ముత్యాలు, కొమ్మరాజు సత్యనారాయణలను తక్షణమే అరెస్ట్ చేయాలని స్వయంగా జిల్లాఎస్పీకి చెప్పారు. నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై మృతుడికుటుంబసభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, నేడు న్యాయస్థానం స్వయంగా నేడు, (అంతర్జాతీయమానవహక్కుల దినోత్సవంనాడు) పోలీసులకు చీవాట్లుపెట్టింది.
స్వయంగా రాష్ట్రఎస్టీ, ఎస్సీ కమిషన్ ఛైర్మన్ చెప్పినా ఎందుకు నిందితులను అరెస్ట్ చేయలేదని పోలీస్ వారిని నిలదీసింది. ఇలాంటి అనేకఘటనలు బయటకు రాకుండానేఈప్రభుత్వంలో మరుగునపడుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతబాగా అమలవుతున్నాయో, జగన్మోహన్ రెడ్డి అనేనేరస్తుడి పాలనలోఎలా ఉన్నాయో ప్రజలంతా ఆలోచించాలి. నేరస్తులముఠా ఏలుబడిలో ప్రజలెవరూ స్వేఛ్చగా, సుఖసంతోషాలతో జీవించే పరిస్థితిలేదని అంతర్జాతీయమానవహక్కుల దినోత్సవంనాడు ప్రశ్నిస్తున్నాం. టీడీపీ అధికారంలోకి వస్తేతప్ప, ఏపీ ప్రజలు గుండెలపై చెయ్యేసుకొని ప్రశాంతంగానిద్రపోయే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాం.

LEAVE A RESPONSE