– డేట్ అండ్ ప్లేస్ ఫిక్స్
– జిల్లా అభివృద్ధిపై మీడియా సమక్షంలో ఈనెల 12వ తేదీ చర్చకు సిద్ధమా?
– శివశక్తి డైరీ ద్వారా రైతులను పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటోంది
– దమ్ముంటే మిథున్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ చేస్తున్నాం
– మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
పెద్దిరెడ్డి కుటుంబం మదనపల్లిని కావాలనే జిల్లాగా చేయకుండా అడ్డుకున్నారు. పుంగనూరు, తంబళ్లపల్లికి పరిశ్రమలు రాకుండా అడ్డుకున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కరువయ్యేలా చేశారు. పెద్దిరెడ్డి అక్రమాలు, అవినీతి అంతా ఇంతా కాదు. జిల్లా అభివృద్ధిపై మీడియా సమక్షంలో ఈనెల 12వ తేదీ చర్చకు సిద్ధమా?
శివశక్తి డైరీ ద్వారా రైతులను పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుంటోంది. శివశక్తి డైరీ బాధితులతో చర్చించేందుకు మిథున్ రెడ్డి సిద్ధమా? ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ను దోచుకోవడం తప్ప జిల్లాకు చేసిందేమిటి? చిత్తూరు జిల్లాకు పట్టిన శని మిథున్ రెడ్డి. శివశక్తి డైరీలో బాధితులను 12వ తేదీ పిలిపిస్తాం.. వారికి మిథున్ రెడ్డి సమాధానం చెప్పాలని సవాల్ చేస్తున్నాం.
మదనపల్లిని కావాలనే జిల్లా చేయకుండా అడ్డుకున్నారు.. దీనిపై కూడా చర్చకు సిద్ధం. పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు పరిశ్రమలు రాకుండా పెద్దిరెడ్డి కుటుంబం అడ్డుకుంది. యువతకు ఉపాధి అవకాశాలు, పెద్దిరెడ్డి అక్రమాలు, అవినీతి.. జిల్లా అభివృద్ధిపై మీడియా సమక్షంలో ఈనెల 12వ తేదీ చర్చకు సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే మిథున్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ చేస్తున్నాం చర్చకు వస్తారా? అని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రశ్నంచారు.
టీడీపీ రాజంపేట పార్లమెంట్ ఇన్ ఛార్జ్ గంటా నరహరి :
ఈ నాలుగు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు తెలపాలి. కలెక్షన్లే పరమావధిగా ఎంచుకుని రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టులతో కుమ్మక్కై రాష్ట్రాన్ని దోచేశారు. రాజంపేట పార్లమెంటును వదిలేసి రాష్ట్రమంతా తిరుగుతూ.. దేశంలోని డబ్బంతా దాచడమే పనిగా పెట్టుకున్నారు. జగన్ పాదయాత్ర సమయంలో మదనపల్లె నుండి బెంగళూరుకు రైల్వే లైను వేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ హామీగానే మిగిలిపోయింది. శాండ్, మైన్ ను శేఖర్ రెడ్డికి అప్పగించి కలెక్షన్ కింగ్ గా మారారు. 2024లో చంద్రబాబునాయుడు తప్పక ముఖ్యమంత్రి అవుతారు.
మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ :
లోకేష్ పాదయాత్ర 520 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఉమ్మడి జిల్లాలు తంబళ్లపల్లికి రావడం జరిగింది. చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి సంపూర్ణ ఆదరణ లభించింది. ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి వైసీపీ పెద్దలు ఓర్వలేక పోతున్నారు. వైసీపీ నాయకులు చేసే పనులు ప్రజలకు చూపరు. మట్టి, ఇసుక ఎక్కడికి పోతోందో సమాధానం చెప్పరు. ఇన్నాళ్లుగా పాపాఘ్ని నదిలో నుండి తవ్విన ఇసుక ఎంత? దాన్ని ఎక్కడికి తరలించారో ప్రజలకు సమాధానం చెప్పాలి. కాంట్రాక్టు పనుల బిల్లుల కోసం పనిచేస్తున్నారే తప్ప ప్రజా సేవకోసం మాత్రం కాదు. మోటార్లకు మీటర్లు పేరున రైతులను భయభ్రాంతానికి గురి చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి ఇబ్బందులు పెడుతున్నారు.