Suryaa.co.in

Andhra Pradesh

దేశ ధర్మం కోసం నేటి యువత కృషి చేయాలి: గరికపాటి..

గరికపాటిన ఘనంగా సత్కరించిన బ్రాహ్మణ చైతన్య వేదిక

అమరావతి: గుంటూరు నగరంలో తెలుగు భాష ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ ప్రవచనకర్త సహస్ర అవధాని గరికపాటి నరసింహారావును బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో గుంటూరులో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా గరికపాటి మాట్లాడుతూ కులాలకు మతాలకు అతీతంగా తన ప్రవచనాలు ఉంటాయని కులమైన మతమైన ఇంటి గడప వరకే పరిమితం కావాలని గడప దాటిన తర్వాత ఎవరైనా కానీ సమాజ శ్రేయస్సు కోసం సమాజ సేవ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.

ఈ దేశంలో ప్రముఖంగా బ్రాహ్మణ సమాజం దేశం కోసం, ధర్మం కోసం సమాజం కోసం ఎన్నో త్యాగాలు చేశారని, అటువంటి త్యాగాలను నేటి యువత అందిపుచ్చుకొని దేశ ధర్మం కోసం పాటుపడాలని బ్రాహ్మణ యువతకు పిలుపునిచ్చారు. తాను వయసులో చిన్నవారిని పెద్దవారిని కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా గౌరవిస్తానని తన ప్రవచనాల్లో ధర్మం కోసం కొంత కటువుగా మాట్లాడటం జరుగుతుంది తప్పితే వేరే ఉద్దేశంతో కాదని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ చైతన్య వేదిక నాయకులు గరికపాటి నరసింహారావును దుశ్యాలువా పూలదండలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాస్తు పురుష ప్రసాద్, వేదాంతం హరినాథ్, వడ్లమూడి రాజా, వడ్డమాను ప్రసాద్, చిలుమూరు ఫణి, డాక్టర్ రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE