సాదుకుంటారా?….. పిసికి సంపుకుంటారా?

-మీ చేతుల్లోనే తెలంగాణ ప్రజల భవిష్యత్
-గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించలేని అసమర్ధ, అకమ పాలన కావాలా?….
-నిజాయితీగా పనిచేస్తన్న మోదీ పాలన కావాలా?
-ప్రజల కోసం పనిచేసే హీరో కావాలా… ప్రజలను పీడిస్తున్న విలన్లు కావాలా?
-మునుగోడు ప్రజలారా…. మీరే తేల్చుకోండి
-మునుగోడు ఓటర్లకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఝప్తి
-కేసీఆర్ పాలనను బొంద పెట్టేదాకా పోరాడాలని పిలుపు

‘‘తెలంగాణ ప్రజల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. కేసీఆర్ రాక్షస పాలనలో నలిగిపోతున్న తెలంగాణ పేదలను సాదుకుంటారా? గొంతు పిసికి సంపుకుంటారా? గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించలేని అసమర్ధ, అక్రమ పాలన కావాలా? నిజాయితీగా పనిచేస్తున్న మోదీ పాలన కావాలా? ప్రజల కోసం ఎమ్మెల్యే పదవిని త్యజించి మంచి కోసం పోరాడుతున్న హీరో కావాలా? ప్రజలను పీడిస్తున్న విలన్ కావాలా?… మీరే తేల్చుకోండి’’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మునుగోడు ప్రజలకు విజ్ఝప్తి చేశారు. గడీల పాలనలో బందీ అయిన తెలంగాణ తల్లిని విముక్తిరాలిని చేసేదాకా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

మునుగోడు ఎన్నికల్లో భాగంగా సంస్థాన నారాయణపూర్ మండలంలో ప్రచారం నిర్వహించిన బండి సంజయ్ కు ప్రజలు భారీ ఎత్తున స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శివాలయం నుండి రామాలయం దాకా మునుగోడు బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి రోడ్ షో నిర్వహించిన బండి సంజయ్ కు కార్యకర్తలు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిన బండి సంజయ్ రామాలయం వద్ద భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అందులోని ముఖ్యాంశాలు…..

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ప్రజల కోసం పనిచేసే హీరో… మిగిలిన పార్టీ అభ్యర్థులు ప్రజలను ఇబ్బంది పెట్టే విలన్లు. మరి హీరో కావాలా? విలన్లు కావాలా? ఆలోచించాలి. టీఆర్ఎసోళ్లు వస్తే మహిళలు ఇంట్లోకి వెళ్లి తలుపులు మూసుకునే దుస్థితి వచ్చింది.

రాజగోపాల్ రెడ్డి ఏనాడూ మోసం చేయలేదు. దగా చేయలే.. కమీషన్లు తీసుకోలే.. ఒక్కసారి ఆలోచించండి. అబద్దాలాడితే శివాలయం వద్ద మూడో కన్ను తెరిచి కొడతారట కదా… కేసీఆర్ ను అక్కడికి తీసుకుపోదాం… శివుడు టీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని ఆ బాధ్యతను మీకు అప్పగించారు. మరి మీ సత్తా చూపండి.

నారాయణపూర్ లో కేసీఆర్ ఆనాడు రాచకొండ గుట్టపై హెలికాప్టర్ లో వచ్చిండు. ఫిల్మ్ సిటీ పెడతా.. టూరిజం హబ్ చేస్తానన్నడు.. గిర్రగిర్ర తిరిగి కింద పడ్డడు. ఆ తరువాత ఢిల్లీ పోయి రాచకొండ పరిధిలోని భూములను గుంజుకోవాలని అధికారులను ఆదేశించిండు..

అందుకే కోమటిరెడ్డి రాజీనామా చేసిండు.. ఇచ్చిన హామీలెందుకు ఇవ్వలేదని నిలదీసేందుకు రాజీనామా చేసిండు… చర్లగూడెం రిజర్వాయర్ ను పూర్తి చేసేందుకు, బాధితులకు పరిహారం అందించేందుకే రాజీనామా చేసిండు. పుట్టపాక చేనేత కార్మికులను పట్టించుకోవడం లేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసిన కేసీఆర్ ను నిలదీసేందుకే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిండు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామావల్లే గట్టుప్పల్ మండలం ఏర్పాటైంది. రోడ్లు వస్తున్నయ్. గొర్లకు పైసలిస్తున్నరు.. ఎందుకు రాజీనామా చేశావని మొరుగుతున్న కుక్కలకు ఇదే మా సమాధానం.

పోలీసులారా… ఇప్పుడైనా కనువిప్పు కలగాలి. ఈరోజు ఎంతోమంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైన రోజు. మీ ద్వారా కేసీఆర్ మమ్ముల్ని కొట్టిస్తున్నారు. జైళ్లకు పంపిస్తున్నడు. కేసులు పెట్టిస్తున్నడు. కొంతమంది పోలీసులు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతుంటే పైనున్న అమర వీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి.

రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. తెలంగాణలో నిజాయితీ కలిగిన ప్రభుత్వం రాబోతోంది. పోలీసులు ఒక్కసారి ఆలోచించండి. మీకు రావాల్సిన టీఏ, డీఏ, సరెండర్ లీవ్ క్యాష్ ఇవ్వని కేసీఆర్ కు పోలీసుల దమ్ము ఏందో చూపాలని కోరుతున్నా… మీకోసం మేం పనిచేస్తున్నం. రాబోయే రోజుల్లో నక్సలైట్లు వచ్చినా, ఉగ్రవాదులొచ్చినా ‌మీకు అండగా ఉండేది బీజేపీయేనని పోలీసులు గుర్తించాలి.

మునుగోడు ప్రజలారా….. తెలంగాణలోని పేదలంతా ఆర్తనాదాలు పెడుతున్నరు. టీఆర్ఎస్ పాలనలో పీడిస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీకి ఓటేయద్దని కోరుతున్నరు. బీజేపీకే ఓటేయాలని ప్రార్థిస్తున్నారు.

ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడానికి 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలసహా గుంట నక్కలన్నీ గుంపులు గుంపులుగా వచ్చాయి. టీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.40 వేలు ఇస్తున్నరు. ఆ డబ్బును తీసుకోండి. హుజూరాబాద్, దుబ్బాకలో ఇట్లనే చేసిండ్రు. ప్రజలు ఏం చేసిండ్రు… డబ్బులు తీసుకుని ఓటు బీజేపీకే ఓటేశారు.

కేసీఆర్… నీకు సిగ్గు, లజ్జా ఉంటే …. నీలో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే శివాలయం వద్దకు రా… గొర్ల పైసలియ్యోద్దని నేను ఈసీకి లేఖ రాయలేదని ప్రమాణం చేస్తా… నువ్వు, నీ కుటుంబంతో రా… ప్రమాణం చెయ్..

గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్… ఏళ్ల తరబడి కష్టపడి కూలీనాలీ డబ్బులతో కోచింగ్ తీసుకుని పరీక్ష రాస్తే… సరిగ్గా నిర్వహించలేని మూర్ఖుడు కేసీఆర్… మైనర్ బాలికలపై రేప్ జరిగినా, ఆత్మహత్య చేసుకున్నా స్పందించని మూర్ఖుడు కేసీఆర్… కేసీఆర్ నిర్లక్ష్యంవల్ల 34 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నరు. వాళ్లకు క్షమాపణ చెప్పాల్సిందే..

ఇప్పుడే లారీ అసోసియేషన్ వాళ్లు రోడ్ ట్యాక్స్ వేశారు.. రాజగోపాల్ రెడ్డికి వాళ్లు మద్దతివ్వగానే అటు పోవద్దంటూ.. సమస్యను పరిష్కరించారంటే ఆ ఘనత రాజగోపాల్ రెడ్డిదే.. తెలంగాణ యువత, ప్రజల భవిష్యత్ మీ చేతుల్లో ఉంది. వాళ్లను చంపుతారా?… ఆదరిస్తారా? మీరే ఆలోచించండి. పిసికి చంపుతారా? కాపాడుకుంటారా? ఆలోచించండి. తెలంగాణ తల్లి రోదిస్తోంది. గడీల పాలన నుండి విముక్తి కల్పించాలని ఏడుస్తోంది. స్పందించండి. ప్రతి ఒక్కరూ గడపగడపకూ తిరగండి. టీఆర్ఎస్ ను బొంద పెట్టండి. పువ్వు గుర్తుకు ఓటేయించండి.

చివరగా ఒక్క మాట.. ‘‘తెలంగాణ ప్రజల భవిష్యత్ మీ చేతుల్లోనే ఉంది. కేసీఆర్ రాక్షస పాలనలో నలిగిపోతున్న తెలంగాణ పేదలను సాదుకుంటారా? గొంతు పిసికి సంపుకుంటారా? గ్రూప్-1 పరీక్ష కూడా నిర్వహించలేని అసమర్ధ, అక్రమ పాలన కావాలా? నిజాయితీగా పనిచేస్తున్న మోదీ పాలన కావాలా? ప్రజల కోసం ఎమ్మెల్యే పదవిని త్యజించి మంచి కోసం పోరాడుతున్న హీరో కావా

Leave a Reply