Suryaa.co.in

Telangana

రాష్ట్రంలో బీజేపీకి సంపూర్ణ మద్దతు

-వచ్చే ఫలితాల్లో సరికొత్త శక్తిగా అవతరణ
-సికింద్రాబాద్‌లో విజయం నాదే
-రేవంత్‌ స్థాయి తెలుసుకుని మాట్లాడాలి
-మజ్లిస్‌ కార్యకర్తల్లా కాంగ్రెస్‌ శ్రేణులు
-బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వైఫల్యాలపై కార్యక్రమాలు
-తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం సంతోషంగా ఉంది. ఓట్లేసిన తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతలు. 65 శాతానికి మించి పోలింగ్‌ శాతం జరిగే అవకాశాలు ఉన్నాయి. 2019 ఎన్నికల కంటే అత్యధికంగా పోలింగ్‌ శాతం పెరిగింది. గ్రామీణ ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు బీజేపీకి లభించింది. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా మద్దతు మాకే ఉందని అనుకుంటున్నాం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు రెచ్చగొట్టినా మా కార్యకర్తలు సంయమనం పాటించారు. రాజకీయ ప్రత్యర్థులే తప్ప మాకు శత్రువులు లేరు. డబుల్‌ డిజిట్‌ స్థానాలతో తెలంగాణలో బీజేపీ ఒక కొత్త శక్తిగా నిలవబోతోంది.

పసుపు బోర్డు, సమ్మక్క సారక్క యూనివర్సిటీ, కృష్ణా బోర్డు వంటి హామీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తాం. బీఆర్‌ఎస్‌ వైఫల్యాలు, కాంగ్రెస్‌ గ్యారంటీలపై రెండంచల కార్యక్రమాలకు సిద్ధమవుతాం. రేవంత్‌ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. రేవంత్‌ మాటలను ప్రజలే కాదు..వారి పార్టీ నాయకులే పట్టించు కోలేదు. ఎవరి స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడితే బావుం టుంది. ఎవరు ఏంటనేది జూన్‌ 4న తెలుస్తుంది. సికింద్రాబాద్‌లో తప్పకుండా గెలుస్తున్నా. అక్కడక్కడా అధికారులు కొంతమందితో కుమ్మక్కై ఓటర్లను ఇబ్బందులకు గురి చేశారు. అర్బన్‌ ఏరియాలో ఉన్న ఓటర్‌ లిస్టును పూర్తిస్థాయిలో సంస్కరించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా దిగజారిపోయింది. రాహుల్‌ గాంధీ ప్రదాని అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి పెళ్లి చేసుకుందామని డిసైడ్‌ అయ్యారు. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఆయన ఉన్నంతవరకు బీజేపీకి ఢోకా లేదు. ఏడు అసెంబ్లీలలో పర్యటించి నప్పుడు మజ్లిస్‌ పార్టీకి కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో సహకరించింది. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త ల్లా వ్యవహరించకుండా మజ్లిస్‌ కార్యకర్తల్లా వ్యవహరించారు.

LEAVE A RESPONSE