Home » ఓడిపోతున్నామనే భయంతో సజ్జల ఎన్నికల కమిషన్‌పై నిందలు

ఓడిపోతున్నామనే భయంతో సజ్జల ఎన్నికల కమిషన్‌పై నిందలు

-జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి దుకాణాలు బంద్ ఇక
-ఓటింగ్ వేయడానికి వచ్చిన జనసునామిని చూసి ఓర్వలేక సజ్జల రామకృష్ణా రెడ్డి కళ్లు బైర్లు కమ్మాయి
-హిట్లర్‌ కు ఏ గతి పట్టిందో అదే గతి జగన్ రెడ్డికి పట్టబోతుంది
-ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం
-భారీ మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుంది… ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా నెరవేరుస్తాం
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

పోలింగ్ కేంద్రాల వద్ద జన సునామీని చూసి ఓర్వలేక సజ్జల రామకృష్ణారెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సోమవారం మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ…”ఎన్నికల పోలింగ్ సమయం ముగిసినా కూడా 3,500 బూత్ లో ఇంకా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదరైనా పట్టుదల, అంకిత భావంతో దేశ విదేశాల నలుమూలల నుండి భారీ ఎత్తున ఓటర్లు తరలివచ్చారు. జనసునామీని చూసి ఓర్వలేక సజ్జల రామకృష్ణా రెడ్డి కళ్లు బైర్లు కమ్మాయి. ఓటమి భయం సజ్జల రెడ్డి ముఖంలో స్పష్టంగా కనపడుతుంది.

సజ్జల రెడ్డి మాటల్లో డొల్ల తనం బట్టబయలైంది. బేలగా ఎన్నికల సంఘం మీద నిందలు వేస్తున్నారు. అధికారులు బదిలీలపై బురద జల్లుతున్నారు. కౌంటింగ్ ఏజెంట్లను నిలబెట్టుకోవడానికి బడాయి కబుర్లు చెబుతున్నారు. జగన్ రెడ్డి, సజ్జల రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి దుకాణాలు బంద్ ఇక. ఇక నుంచైనా బేలా మాటలు, అబద్దపు మాటలు మానేయాలి. ఇప్పటికి కూడా ప్రజలను మభ్య పెట్టాలని దయ్యాలు వేదాలు వల్లిచ్చినట్లు సజ్జల రెడ్డి మాట్లాడుతున్నారు. ఉదయాన్నే చిత్తూరు జిల్లా పెద్దిరెడ్డి నియోజకవర్గం బోరగమంద గ్రామంలో మా ఏజెంట్లను అపహరించారు. సజ్జల రెడ్డి మాటలు విన్నందుకు స్థానిక ఎస్సై సస్పెండ్ అవుతున్నారు.

మాచర్లలో అధికార వైసీపీ ఎన్నో దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు చేశారు. ఉరవకొండ 129 బూత్‌లో పోలింగ్ అధికారులతో వైసీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలంలో మా ఏజెట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కడప జిల్లా చాపాడు మండలంలో మా ఏజెంట్లను పోలింగ్ కేంద్రం నుంచి బయటలాగేశారు. శ్రీశైలం 4,5 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు సజ్జలకు కనపడలేదేమో.

దాచేపల్లిలో పోలింగ్ బూత్‌ల వద్ద వైసీపీ కార్యకర్తలు మా కార్యకర్తలపై దాడులు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం మాగల్లు, సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలంలో, మైదుకూరు నియోజకవర్గంలో మా కార్యకర్తలపై వైసీపీ చేసిన దాడులు, పయ్యావుల కేశవ్ స్వగ్రామంలో వైసిపీ నాయకుల కవింపు చర్యలతో పాటు వైసీపీ అభర్థి విశ్వేశ్వర్ రెడ్డి పోలింగ్ ప్రక్రియను నిలిపివేశాడు. గ్రామాన్ని అభివృద్ధి చేయలేదంటూ నెల్లూరు జిల్లా కమ్మవారిపాలెం గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. అలాంటిది నిస్సిగ్గుగా అభివృధి చేశామని సజ్జల చెప్పుకుంటున్నారు.

అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లెలో టిడిపి ఏజెంట్ పై ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అనుచరులు దాడి చేశారు. మాచర్ల నియోజకవర్గంలో కంభంపాడులో గొడ్డళ్లు, వేటకొడవళ్లు, రాడ్లతో వైసీపీ మూకలు రహదారి పైకి వచ్చి హల్ చల్ చేశారు. విజయవాడ : వైసీపీ కనుసన్నల్లోనే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు. నరసరావుపేటలో భారీ కాన్వాయ్తోళ పోలింగ్ కేంద్రాల సందర్శిస్తున్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దుర్మార్గాలు చేశాడు. తాడిపత్రిలో పెద్దారెడ్డి చేసిన దౌర్జన్యాలకు గృహ నిర్భందం చేయాల్సి వచ్చింది. దర్శి మండలంలో 5 పోలింగ్ బూత్‌ల్లో దౌర్జన్యాలు చేసి సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి, మా ఏజెంట్లను బయటకు పంపించి వైసీపీ నాయకులు రిగ్గింగ్ చేశారు. ఇదేమిటని ప్రశ్నించిన మా అభ్యర్ధి లక్ష్మి, ఆమె భర్తపై దాడికి దిగారు.

ఆ ఐదు బూత్‌లలో రీపోలింగ్ కావాలని దర్శి ఎస్పీ, కలెక్టర్‌కు మా అభ్యర్ధి లక్ష్మి ఆర్వోకు ఫిర్యాదు చేశాం. రేపు ఎన్నికల ప్రధానాధికారితో సమావేశంలో కూడా దీనిపై ఫిర్యాదు చేస్తాం. తెనాలిలో వైకాపా ఎమ్మెల్యే శివకుమార్ చేసిన అరాచకం రాష్ట్రం మొత్తం చూసింది. క్యూ లైన్‌లో వెళ్లమన్నందుకు ఐటి ఉద్యోగి ఓటర్‌పై దుర్మార్గంగా దాడి చేశారు. ఎమ్మెల్యేను ఓటరు కొట్టిన దెబ్బ వైసీపీ అరాచకానికి తగిలిన చెంప దెబ్బ. తాడేపల్లి కుట్రలు, కుతంత్రాలకు తగిలిని చెంప దెబ్బ. ఇదే ప్రభుత్వ పతనానికి పరాకాష్ట.

తిరువూరు నియోజకవర్గం కంభంపాడులో ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని బృందంపై వైసీపీ మూకల దాడి చేశారు. నరసరావుపేట టీడీపీ ఎంపి అభ్యర్ధి కృష్ణదేవరాయ కారుతో పాటు మరో 3 కార్లుపై దాడి చేశారు. గన్నవరం నియోజకవర్గం కొత్తమల్లపల్లిలో ఆళ్ల గోపాలకృష్ణపై వైసీపీ మూక దాడి చేసి, చొక్కా చించి, కారు అద్దాలు పగులగొట్టారు. చిలకలూరిపేట నియోజకవర్గం గంగన్నపాలెంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. డోన్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధిపై కూడా దాడులు చేసే హీన పరిస్థితుల్లో వైసీపీ ఉంది.

తాడిపత్రిలో ఎస్పీ కారునే వైసీపీ మూకలు దాడి చేసారంటే ఎంతలా వారికి పిచ్చెక్కిందో అర్థమవుతోంది. ఇలాంటివి సుమారు 120 సంఘటనలుపై సీఈవోకు ఫిర్యాదు చేశాం. వాటిని కప్పించుకోవడానికి ఈసీపై నిందలు వేస్తున్నారు. హిట్లర్‌, గ్లోబుల్‌కు ఏ గతి పట్టిందో అదే గతి జగన్ రెడ్డికి పట్టబోతుంది. ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఏ విధంగా ఉందో ఓటింగ్ సరళిని చూస్తుంటే తెలుస్తుంది. మండుటెండల్లు సైతం లెక్కచేయకుండా మహిళలు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. వారందికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఓటు పోయింది, తీసేశారు వంటి ఆందోళనలు ఈసారి తగ్గాయి.

ఓటర్ లిస్ట్‌లో జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలను పసిగట్టి ఎన్డీఏ కార్యకర్తలు కృషితో ఫ్యాక్ట్ ఓటర్ లిస్ట్‌ సాధ్యమైంది. వాస్తవాలకు విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు చేసిన నేరాలు, దాడులను కప్పిపుచ్చుకోవడానికి ఆ నిందలు మా కార్యకర్తలపై వేస్తున్నారు. ఇక మీ అబ్ధాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. 2019లో కంటే రికార్డు స్థాయిలో ఈ సంవత్సరం ఓటింగ సరళి పెరగనుంది. భారీ మెజారిటీ సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రానుంది.

జగన్ రెడ్డి కూడా ఓడిపోతున్నాడని తెలిసి లండన్ పారిపోవడానికి పన్నాగాలు పన్నుకున్నాడు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయనిచ్చిన వాగ్దానాలు అమరావతి, పోలవరం వంటి అన్నీ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు సంక్షేమాన్ని కూడా అందించనున్నారు. ఇకనైనా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారశైలి మార్చుకోవాలి” అని దేవినేని ఉమా హెచ్చరించారు.

Leave a Reply