Suryaa.co.in

Andhra Pradesh

రాక్షసుల్ని తరిమేందుకు ప్రజలు యుద్ధం చేస్తున్నారు

-అరాచక శక్తి బారి నుండి తమను తాము కాపాడుకునేందుకు సిద్ధమయ్యారు
-ఓటర్లు చూపిన చొరవ ప్రజాస్వామ్యాన్ని ఫరిడవిల్లేలా చేసింది
-గులకరాయి బ్యాచ్ అరాచకాల నుండి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం
– పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

పుత్రకామేష్టి యజ్ఞాన్ని విఘ్నం చేసేందుకు మారీచ సుబాహులు ప్రయత్నించినట్లుగా రాష్ట్రంలో రాక్షస పరిపాలనకు స్వస్తి పలికేందుకు, అరాచక పాలన అంతం కోసం, దుర్మార్గ పాలనను రాష్ట్రం నుండి తరిమికొట్టడం కోసం, అప్రజాస్వామిక, రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించని పాలకుడిని ఓడించడం కోసం రాష్ట్రంలో ఓటరు మహాశయుల ఆధ్వర్యంలో యజ్ఞం జరుగుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు.

రాష్ట్రంలో తానే ఉండాలి, తన అరాచకాన్ని కొనసాగించాలని జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలను తిప్పికొడుతూ ఓటర్లంతా హీరోలుగా నిలబడ్డారు. అరాచక వాదిని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు తెల్లవారు జాము నుండే క్యూలైన్లలో నిలబడ్డారు. ఓటమి తధ్యమని తెలిసి.. ప్లాన్ బి ప్రకారం అరాకాలు, దాడులు, దౌర్జన్యాలు, పోలింగ్ బూతుల్లో విధ్వంసం, రిగ్గింగుకు తెరలేపారు. ఎంతగా తెగించి కుట్రలకు పాల్పడినా.. వారి ఆటలు సాగలేదు. రాష్ట్రంలో లక్షలాది మంది క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు.

ఓటర్లందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం.. ప్రజాస్వామ్య పాలనకు నాంది పలకండి. అసాంఘిక శక్తిని అధికార పీఠం నుండి కూలదోయడం కోసమే ఎన్డీఏ కూటమి ఏర్పాటైంది. మా అధినేత నారా చంద్రబాబు నాయుడి తరఫున అభ్యర్ధిస్తున్నా ప్రజల కోసం ఒక్క రోజు శ్రమించండి. అరాచక శక్తుల్ని సహించేది లేదని ఎన్నికల కమిషన్ తేటతెల్లం చేసింది. అరాచక వాదుల్ని తరిమికొట్టే యుద్ధంలో ప్రజలంతా భాగస్వాములుగా నిలిచినందుకు అభినందనలు. ధన్యవాదాలు. ప్రజాస్వామ్య బద్దంగా మన పోరాటం చేద్దాం. దుర్మార్గుల్ని రాష్ట్రం నుండి తరిమికొడదాం.

గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ బూతుల్లో పవర్ కట్స్ లేకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఈ గులకరాయి బ్యాచ్ ఎన్ని అరాచకాలకైనా దిగుతారు. నిన్నటి వరకు విజ్ఞప్తి చేశాం. ఈ రోజు హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో ఇంతగా అరాచకాలు జరుగుతున్నా చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు. ఎందుకు పవర్ కట్స్ విషయంలో చొరవ తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలి.

LEAVE A RESPONSE