వర్తమాన రాజకీయాలలో జగన్  ఓ సరికొత్త చరిత్ర

Spread the love

-జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది
-దావోస్ పర్యటనకు వెల్లి బాబు, లోకేష్‌ లు ఎంత మేర పెట్టుబడులు తెచ్చారో చెప్పాలి
-ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి

వర్తమాన రాజకీయాలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం ఓ సరికొత్త చరిత్ర అని, పొత్తుల్లేకుండా పోరాడి గెలిచిన నాయకుడిగా సత్తాచాటారని, వినూత్న పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా నిలిచారని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ఒంటరిగా సైన్యాన్ని నడిపించి అఖండ విజయాలు సాధించిన పరాక్రమవంతులు ఏడుగురు అని ప్రపంచ చరిత్ర చెబుతోందని, వారిలో అలెగ్జాండర్ ద గ్రేట్, అశోక చక్రవర్తి, మహారాణా ప్రతాప్ వంటి వారున్నారని అన్నారు.  అదే కోవకు చెందిన జగన్ వర్తమాన రాజకీయాలలో ఓ సరికొత్త చరిత్ర అని కీర్తించారు.

జగన్ దావోస్ పర్యటనపై టీడీపీ విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని, 2019 జనవరిలో లోకేష్ టీం జూరిచ్ నుంచి దావోస్ కు ట్రిప్పుకు 10 వేల డాలర్ల చెల్లించి హెలికాప్టర్ల లో వెల్లిందని , ప్రస్తుత దావోస్ పర్యటనలో జగన్ రోడ్డు మార్గాన ప్రయాణించారని తెలిపారు. దావోస్ పర్యటన అనంతరం లోకేష్ టీం 10 రోజులు అమెరికాలో తిరిగొచ్చిందని గుర్తుచేశారు. ఆ మొత్తం పర్యటనకు సంబంధించిన ఖర్చులు సంగతి త్వరలోనే బయటపెడతామని అన్నారు.

దావోస్ పర్యటనకు ఎగబడి వెల్లిన బాబు, లోకేష్ లు రాష్ట్రానికి ఎన్ని వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఆ పర్యటకు బాబు, లోకేష్ లు చేసిన ఖర్చు ఎలాగూ ప్రభుత్వం లెక్క తీస్తుందని అన్నారు.

Leave a Reply