Suryaa.co.in

National

ట్రాఫిక్‌ జరిమానాలు, శిక్షలు ఇక కఠనం

న్యూఢిల్లీ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో అన్ని విభాగాలతో పాటు పోలీసు విభాగం కూడా అలర్ట్‌ అయింది. ఆయా జిల్లాల్లో ఎస్పీల ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ముమ్మర తనిఖీ చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యహరిస్తున్నాయి.

ప్రధానంగా ట్రాఫిక్‌లను ఉల్లంఘనలకు పాల్పడే వారికి జరిమానాలు వేయటమే కాకుండా.. తరచూ పట్టుబడేవారికి జైలు శిక్షతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి.

దేశంలో చాలా వరకు ప్రమాదాలు మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల, మైనర్లు వావనాలు నడపటం వల్లే జరుగుతున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించారు. కొత్త చట్టంలోని జరిమానాలు, శిక్షలు చూస్తుంటే సాధారణ పౌరులకే కాదు.. నిందితులకు కూడా గుండెదడ పుట్టుకొస్తోంది. ఆ వివరాలివి.

రెడ్ లైట్ ఉల్లంఘన

– మునుపటి జరిమానా: రూ.100
– ప్రస్తుత జరిమానా: రూ.500

అథారిటీ ఆదేశాలను ధిక్కరించడం

– మునుపటి జరిమానా: రూ.500
– ప్రస్తుత జరిమానా: రూ.2,000

లైసెన్స్ లేకుండా డ్రైవింగ్

– మునుపటి జరిమానా: రూ.500
– ప్రస్తుత జరిమానా: రూ.5,000

అతివేగం

– మునుపటి జరిమానా: రూ.400
– ప్రస్తుత జరిమానా: రూ.1000

ప్రమాదకరమైన డ్రైవింగ్

– మునుపటి జరిమానా: రూ.1000
– ప్రస్తుత జరిమానా: రూ.5,000

డ్రంక్ అండ్ డ్రైవ్..

– మునుపటి జరిమానా: రూ.2000
– ప్రస్తుత జరిమానా: రూ.10,000

రేసింగ్, స్పీడింగ్

– మునుపటి జరిమానా: రూ.500
– ప్రస్తుత జరిమానా: రూ.5,000

హెల్మెట్ ధరించకపోవడం

– మునుపటి జరిమానా: రూ.100
– ప్రస్తుత జరిమానా: రూ.1000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు

సీట్‌బెల్ట్ ధరించకపోవడం

– మునుపటి జరిమానా: రూ.100
– ప్రస్తుత జరిమానా: రూ.1000

అత్యవసర వాహనాలను అడ్డుకుంటే..

– మునుపటి జరిమానా: నిర్దిష్ట జరిమానా లేదు
– ప్రస్తుత జరిమానా: రూ.10,000

బైక్‌పై ట్రిపుల్ రైడింగ్

– ప్రస్తుత జరిమానా: రూ.1,200

ద్విచక్ర వాహనాలపై ఓవర్‌లోడ్

– మునుపటి జరిమానా: రూ.100
– ప్రస్తుత జరిమానా: రూ.2,000 + మూడు నెలలకు లైసెన్స్ రద్దు.

ఇన్సూరెన్స్‌ లేకుండా డ్రైవింగ్

– మునుపటి జరిమానా: రూ.1,000
– ప్రస్తుత జరిమానా: రూ.2,000

LEAVE A RESPONSE