Suryaa.co.in

Editorial

బాబు పర్యటనలో విషాదం

-కందుకూరు సభలో 8మంది కార్యకర్తలు మృతి
-కాల్వ గట్టున ద్విచక్రవాహనాలపై కూర్చున్న కార్యకర్తలు
-వాహనాలతో సహా కాల్వలో పడిపోయిన విషాదం
-కాల్వ ఉంది జాగ్రత్త అని ముందే హెచ్చరించిన చంద్రబాబు
-బాబు రోడ్‌షో తర్వాత పోటెత్తిన జనం
-ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి పోటెత్తిన జనం
-8 మంది మృతి, మరికొందరికి తీవ్రగాయాలు
-ఆర్తనాదాలు, హాహాకారాలతో ప్రతిధ్వనించిన కందుకూరు
-ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న వారిని పరామర్శించిన బాబు
-మృతుల కుటుంబాలకు 10 లక్షలు, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తామన్న బాబు
-20 మందిని కాపాడిన మల్లికార్జున్
కావలి సభ రద్దు
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఉద్వేగపూరిత ప్రసంగం చేస్తున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా అరుపులు, ఈలలు, కేకలతో మార్మోగుతోంది. అంత ఉత్సాహంలోనూ.. ‘‘అక్కడ కాల్వ ఉంది జాగ్రత్త’’ అని చంద్రబాబు హెచ్చరించారు. కానీ అంతలోనే జరగాల్సిన విషాదం జరిగిపోయింది. ద్విచక్ర వాహనాలపై కూర్చుని బాబు ప్రసంగం వింటున్న కార్యకర్తలు, అలాగే వాహనాలతో సహా కాల్వలో పడిపోయారు. ఫలితంగా 8 మంది మృతి చెందగా, పదిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. దానితో చంద్రబాబు ఖిన్నుడయ్యారు. వారిని సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుల సన్నిహితులు, కార్యకర్తల రోదనతో ఆసుపత్రి ప్రతిధ్వనించింది. ఇవీ. చంద్రబాబునాయుడు కందుకూరులో నిర్వహించిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి జరిగిన సభలో విషాదదృశ్యాలు.

బుధవారం రాత్రి కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షో, బహిరంగసభలో పెను విషాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాలను స్టాండ్ వేసుకుని కూర్చుని చంద్రబాబు ప్రసంగం వింటున్న జనం,1
ఒక్కసారిగా వాహనాలతో సహా కాల్వలో వెనక్కి పడ్డారు. ఫలితంగా 8 మంది మృతి చెందగా, పదిమందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు. వారిని పార్టీ నేతలు సమీపంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యచికిత్స పొందుతుండగా 8 మంది మృతి చెందారు. మరికొందరు శ్వాస ఆడక ఇబ్బందులు పడ్డారు.

అంతకుముందు చంద్రబాబు రోడ్ షో ముగిసిన తర్వాత, కార్యకర్తలు భారీ స్థాయిలో ముందుకువెళ్లడంతో తోపులాట జరిగింది. ఆ సందర్భంగా పలువురు కార్యకర్తలకు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి, అంచనాలకు మించి జనం హాజరుకావడంతో, వారిని నియంత్రించడం పార్టీ వర్గాలకు కష్టమయింది.

ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు వారందిరినీ పరామర్శించారు. నేనున్నా భయపడవద్దని ధైర్యం చెప్పారు. మీ కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను కోరారు. అనంతరం మృతుల కుటుంబాలకు, ఒక్కొక్కరికి పదిలక్షల నష్టపరిహారం ప్రకటించారు.2 మృతుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. వారిని దగ్గరుండి చూసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ఇంటూరి రాజేష్, ఇంటూరి రాజేష్ బాధితులకు దగ్గరుండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు.

కాగా తర్వాత జరగాల్సిన కావలి సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలాఉండగా, కాల్వలో పడిన మరికొందరిని మల్లికార్జున్ తన ప్రాణాలకు తెగించి కాపాడి, అందరి అభినందన అందుకున్నారు. ఆయన దాదాపు 20 మంది ప్రాణాలు కాపాడారు.

కందుకూరులో జరిగిన విషాదంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, బీద రవిచంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, నక్కా ఆనంద్‌బాబు తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

 

LEAVE A RESPONSE