Suryaa.co.in

Telangana

తెలంగాణలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టి.కె.శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌గా ఉదయ్‌కుమార్‌కు అదనపు బాధ్యతలు కేటాయించారు.

పురపాలక శాఖ ఉపకార్యదర్శిగా ప్రియాంక, హాకా ఎండీగా చంద్రశేఖర్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ ఎండీగా శ్రీనివాస్‌రెడ్డి, రవాణా, ఆర్అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్‌రాజ్‌ బదిలీ అయ్యారు.

LEAVE A RESPONSE