Suryaa.co.in

Andhra Pradesh

బొత్స భాషకు ట్రాన్స్లేటర్ కావాలి

-బీజేపీ అధికార ప్రతినిధి ఆర్ డి విల్సన్ ఎద్దేవా

నిత్యం అవినీతిలో మునిగి తేలే బొత్స సత్యనారాయణ కి ట్రాన్స్లేటర్ కావాలని బిజెపి అధికార ప్రతినిధి ఆర్ డి.విల్సన్ ఎద్దేవా చేశారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచమంతా ఆరాధించే మోడీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన బోత్స ను రాష్ట్ర ప్రజలు క్షమించరన్నారు. నిత్య అవి నీతి లో ఓలలాడే బొత్స సత్యనారాయణ కు ప్రధాని నిందించే హక్కు లేదన్నారు.

జగన్మోహన్ రెడ్డి పాలన అంతిమ దశకు వచ్చిందని ఓటమి అంచులో చేరిన జగన్ ని దేవుడు కూడా కాపాడలేరన్నారు. బొత్స మెడపైన తుపాకి పెట్టి ప్రత్యర్థులు పైన విమర్శ బాణాలు ఎక్కించడం జగన్ బలహీనతకు నిదర్శనం అన్నారు. గత ప్రభుత్వం అమరావతి నిర్మాణం చేస్తే దానిని స్మశానంగా అభివర్ణించిన బొత్స మొన్నటి వరకు ఉదయం సెక్రటేరియట్లో ఉన్నాడన్న విషయం మర్చిపోకూడదు అన్నారు.

LEAVE A RESPONSE