Suryaa.co.in

Telangana

రవాణా శాఖ యూనిఫాం ఉద్యోగులు కొత్త లోగోను ధరించాలి

– జనవరి 1 నుండి జనవరి 31 వరకు జరిగే జాతీయా రోడ్డు భద్రతా మాసాన్ని విజయవంతం చేయండి
– ఆర్టీసీ లో పెండింగ్ పనులు పూర్తి చేయాలి-రవాణా శాఖ ఆర్టీసీ అధికారులతో జూమ్ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ 

హైదరాబాద్‌: రవాణా శాఖ- ఆర్టీసీ లో తాజా పరిస్థితి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంత వరకు అమలయ్యాయి రేపటి నుండి జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసం కార్యక్రమాన్ని గ్రామగ్రామాన విజయవంతం చేసి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడానికి తీసుకోవల్సిన చర్యల పై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూమ్ సమావేశాన్ని నిర్వహించారు. జూమ్ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ పాల్గొన్నారు.

జనవరి 1 నుండి జనవరి 31 వరకు జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసం విజయవంతం చేసి రోడ్డు భద్రత పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న 97 ఆర్టీసీ డిపో లు ,62 రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలు తో అవగాహన కల్పిస్తూ బానర్ ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ఐఏఎస్, ఐపీఎస్ లు భాగస్వామ్యం అయ్యేలా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు.

విద్యా శాఖ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాలలో రోడ్డు భద్రతా పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో కార్యక్రమాలు చేపట్టాలని డీజీపీ జితేందర్ కి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. రెవిన్యూ పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో లో కూడా గ్రామీణ స్థాయి నుండి ఈ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలునిచ్చారు.

ఆర్టీసీ లో కొత్త బస్సుల యాక్షన్ ప్లాన్ పై అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ లో కొత్తగా నియామకం కానున్న ఉద్యోగాల భర్తీ ,ఇప్పటికే పెద్దపల్లి ఏటూరు నాగారం లకి మంజూరు చేసి ఆర్టీసీ బస్సు డిపోల పురోగతి పై అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ లో కారుణ్య నియామకాలు పెండింగ్ లేకుండా చూసుకోవాలని సూచించారు.మధిర ,కోదాడ , హుజూర్ నగర్ ,మంథని , ములుగు బస్ స్టేషన్ లో పునరాభివృద్ది తదితర వాటిపై మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, జేటిసి లు , డీటీసి లు ,ఆర్టీవో లు , ఆర్టీసీ ఈడీ లు , ఆర్ఎం లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE