– పుట్టికి తాడు తెగిందో నేరుగా దిగువ ఉన్న సరళ సాగర్ ప్రాజెక్టులోకే
– కనిమెట్ట గ్రామ రైతు, మహిళ కూలీల ఆవేదన
– వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, కనిమెట్ట గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామమైన పాత జంగమయ్య పల్లి గ్రామాల ప్రజల ఆవేదన
ఈ రెండు గ్రామాల మధ్యన ఊకచెట్టు వాగు ఉండటంవల్ల తరుచు వాగులో నీరు ప్రవహిస్తుండటంతో పలుమార్లు వేసిన తాత్కాలిక మట్టి రోడ్లు కొట్టుకపోవడంవల్ల ఇరు గ్రామాల ప్రజలకు సంబంధాలు లేకుండా రాకపోకలు స్తంభించాయి.
అత్యవసర సేవలైన విద్యార్థుల చదువులు, గ్రామస్థుల అనారోగ్యాలతో పాటు మహిళల ప్రసవాల వైద్య సేవలు, నిత్యావసరాల సరుకులు, రైతులకు వ్యవసాయ పనిముట్లు, పంటలకు ఎరువు మందులు తెచ్చుకుటకు పట్టణాలకు సకాలంలో చేరుకోలేక పోతున్నారు.
రెండు గ్రామాల రైతులకు వాగుకు ఇరువైపుల వ్యవసాయ భూములు ఉండటంతో… వ్యవసాయ పనుల నిమిత్తం ఉదయం, సాయంకాలాల వేళలో (ఇదివరకే వంతెనను నిర్మిస్తున్నామని వాగులో ఇసుకను
తీయడం వల్ల ఏర్పడ్డ గుంతలు) ఇరవై అడుగుల లోతుగా ఉన్న వాగును దాటటానికి భద్రతలేని ప్లాస్టిక్ పుట్టిలో కూర్చుని తాడు సహాయతో లాగుతూ… ప్రాణాలను అరచేతులో పెట్టుకొని బ్రతుకు జీవుడా.. అంటు వాగును దాటుతున్నామని వ్యవసాయ రైతు, కూలీలు, గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
రెండు గ్రామాల మధ్యనున్న వాగుపై వంతెన నిర్మాణాన్ని త్వరలోనే చేపడుతామని ప్రజా ప్రతినిధులు, అధికారులు చెపుతున్నారే తప్ప… మా ఇబ్బందులను పట్టించుకోకుండాం లేదంటున్నారు. వాగును దాటు సమయంలో పుట్టికి కట్టిన తాడు తెగితే నీటి ప్రవాహానికి దిగువన ఉన్న సరళ సాగర్ ప్రాజెక్టులోకి కొట్టుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు.