Suryaa.co.in

Telangana

జీపీఏ చేసుకొని వృద్ధుడి ఇల్లు అమ్మేసిన రిపోర్టర్లు

– వృద్ధుడికి 14 లక్షలకు శఠగోపం
– 8 మంది రిపోర్టర్లపై నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు

సమాజంలో విలేకరులు అంటే ఎనలేని గౌరవం. అందునా జర్నలిస్ట్ లీడర్స్ అంటే అందరికి హడల్. రిపోర్టర్ అని చెబితే చాలు తిమ్మిని బమ్మీని చేస్తారు. రాంగ్ గా ఉన్న రైట్ ను చేస్తారు. రైట్ గా ఉన్న రాంగ్ చేస్తారు. వారు వచ్చారు అంటే చాలు జిల్లా అధికారి అయినా, పోలీస్ ఆఫీసర్ అయినా జీ హుజూర్ అనాల్సిందే.

అలాంటి జర్నలిస్ట్ లు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బరి తెగించారు. తన ఇంటిని అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్న నిజామాబాద్ నగరం కంటెశ్వర్ విద్యుత్ నగర్ కు చెందిన వృద్ధుడు, ఒక సీనియర్ జర్నలిస్ట్ ను సంప్రదించారు. ఆయన , కొందరు కలిసి వృద్ధుడి ఆస్తిని జిపిఎ చేసుకున్నారు. ఒక వ్యక్తికి అమ్మివేసారు. అతని వద్ద నుంచి ఇంటికి సంబందించిన డబ్బులు అన్ని నొక్కి వేసారు.

14 లక్షల వరకు ఇవ్వకుండానే చుట్టూ తిప్పుకున్నారు. తెలివిగా రెండు సంవత్సరాల నుండి రేపు మాపు అంటూ తిప్పుకున్నారు. అంతే కాకుండా వృద్ధుడికి డబ్బులు మొత్తం చెల్లించినట్టు సంతకలు చేసుకున్నారు. ఆలస్యంగా తాను మోస పోయిన విషయం తెలుసుకున్న వృద్ధుడు, నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. బాధితుని . ఫిర్యాదు మేరకు 8 మంది పై చీటింగ్ కేసు నమోదు అయింది. అందులో ప్రధాన మీడియా లో పని చేస్తున్న నలుగురు జర్నలిస్ట్ ల పేర్లు ఉన్నాయి. వారు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో కీలక బాధ్యత లో ఉన్నవారు కావడం విశేషం.

గతంలో పలువురుని మోసం చేసిన, బలవంతపు వసూళ్లు చేసిన కేసులో ప్రధాన ముద్దాయి లు గా ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తి ని 14 లక్షలు మోసం చేసిన వారి గురించి ఇటు పోలీస్, అటు మీడియా సంస్థ లు నోరు మేదపకపోవడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

LEAVE A RESPONSE