కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి

– సాకే శైలజనాథ్

విజయవాడ : కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు. హడావిడిగా చేసిన జిల్లాలు, జిల్లాల పేర్ల వెనుక రాజకీయ మతలబులు పక్కన పెడితే కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు ఎందుకు పెట్టరని శైలజనాథ్ ప్రశ్నించారు.

నిజాయితీపరుడు..పరిపాలనలో..రాజకీయ జీవితంలో ఆదర్శ ప్రాయంగా ఉన్న దామోదరం సంజీవయ్య పేరును ప్రభుత్వం తక్షణమే కర్నూలు జిల్లాకు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టారని, కడప పేరును వైఎస్సార్ జిల్లాగా పెట్టిన ప్రభుత్వం ఆయా ప్రాంతాల ప్రాశస్త్యాన్ని తగ్గించకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply