Suryaa.co.in

Andhra Pradesh

ఉక్రెయిన్ నుండి ఇప్పటి వరకూ 363 మంది విద్యార్ధులు రాష్ట్రానికి చేరిక

• ఇప్పటి వరకూ 770 మంది ఎపి విద్యార్ధులు ఉక్రెయిన్ లో రిజిష్టర్ అయ్యారు
• ఉక్రెయన్ లో ఉన్న చివరి విద్యార్ధి వరకూ సురక్షితంగా రాష్ట్రానికి చేర్చేందుకు కృషి
-తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

• 1902 డిడికేటెడ్ హెల్పలైన్,0863-2340678 హెల్పలైన్ కు సమాచారం ఇవ్వాలి
• ఎపితో సమన్వయానికై కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి గిరిధర్ ను నియమించిన కేంద్రం
– టిఆర్అండ్బి ముఖ్యకార్యదర్శి యం.టి.కృష్ణబాబు

అమరావతి,5 మార్చి:ఉక్రెయిన్ నుండి ఇప్పటి వరకూ 363 మంది విద్యార్ధులను రాష్ట్రానికి సురక్షింతగా తీసుకురావడం జరిగిందని ఉక్రెయిన్ సంక్షోభంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ అధ్యక్షులు,టిఆర్అండ్బి ముఖ్యకార్యదర్శి యం.టి.కృష్ణబాబు వెల్లడించారు.ఈమేరకు శనివారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ లో ఉన్న రాష్ట్రానికి సంబంధించిన చిట్ట చివరి విద్యార్ధి వరకూ సురక్షితంగా రాష్ట్రానికి చేరేలా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని కావున తల్లి దండ్రులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటి వరకూ 770 మంది విద్యార్ధులు ఉక్రెయిన్ లో ఉన్నట్టు రిజిష్టర్ కాగా ఇప్పటికే 363మందిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురాగా మిగతా వారందరినీ తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర విదేశాంగశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.మన రాష్ట్రంతో సమన్వయం చేసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి గిరిధర్ అర్మనియాస్(Giridhar Armaneas)ను నోడల్ కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించిందని కృష్ణబాబు తెలిపారు.

ఉక్రెయిన్ లో ఉన్న రాష్ట్రానికి చెందిన విద్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు వీలుగా నాలుగు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు ప్రతినిధులను నియమించిందని టాస్క్ ఫోర్సు కమిటీ అధ్యక్షులు కృష్ణబాబు చెప్పారు. హంగేరికి ఎపిఎన్ఆర్టి ప్రభుత్వ సలహాదారు మేడపాటి వెంకట్ ను,పోలండ్ కు యూరప్ ప్రత్యేక ప్రతినిధి రవీంద్ర రెడ్డిని,రొమేనియాకు ఎపి ఎన్ఆర్టి డిప్యూటీ సలహాదారు చంద్రహాస రెడ్డిని, స్లొవేకియాకు నాటా ఎపి రిప్రజెంటేటివ్ పాండుగయల రత్నాకర్ ను పంపడం జరిగిందని తెలిపారు.ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు విద్యార్ధులను సురక్షితంగా తీసుసువచ్చేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ నిరంతరం కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.అంతేగాక ఢిల్లీ,ముంబాయి,బెంగుళూర్,చెన్నె, హైదరాబాదు,విశాఖపట్నం విమానాశ్రయాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి విద్యార్ధులకు స్వాగతం పలికి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

ఈనెల 3వతేదీ నుండి కేంద్ర ప్రభుత్వం అధిక సంఖ్యలో విమానాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉక్రెయిన్ నుండి భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేసిందని ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు పేర్కొన్నారు.బుడాపెస్ట్ వద్ద సుమారు 2వేల మంది భారతీయులు ఉండగా వారిలో సుమారు 1100మందిని శనివారం భారత్ కు తరలించేందుకు చర్యలు తీసుకుందని తెలిపారు.మిగతా వారిని ఆదివారం భారత్ కు తరలించనుందని చెప్పారు.రానున్న మూడు నాలుగు రోజుల్లో అధిక సంఖ్యలో ఉక్రెయిన్ నుండి భారతీయులను ఇండియాకు తీసుకవచ్చే ప్రక్రియ జరుగుతుందని అన్నారు.

హంగేరీ సరిహద్దులో 2వేల మంది వరకూ విద్యార్ధులు చేరుకున్నారని మరో 2వేల మంది వరకూ అక్కడికి చేరుకోనున్నారని వారందరినీ త్వరగా ఇండియాకు తరలించేందుకు కేంద్ర విదేశాంగశాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు.ఈనెల 9వతేదీ నాటికి ఎక్కువ శాతం మందిని ఉక్రెయిన్ నుండి భారతీయులను ఇండియాకు తీసుకువచ్చే ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు.

ఉక్రెయిన్ లో ఎపికి చెందిన విద్యార్ధులు 770 మంది ఉన్నట్టు ఇప్పటి వరకూ రిజిష్టర్ కాగా ఆజాబితాను కేంద్ర విదేశాంగ శాఖకు,ఎంబసీకి అందించడం జరిగిందని కృష్ణబాబు తెలిపారు.జిల్లాల వారీగా పరిశీలిస్తే అనంతపురం జిల్లాకు సంబంధించి 42 మంది,చిత్తూరు 119,తూర్పు గోదావరి 79,గుంటూరు 85,కృష్ణా 112,కర్నూలు32,నెల్లూరు 34,ప్రకాశం 35, శ్రీకాకుళం 18,విశాఖపట్నం 117,విజయనగరం 13,పశ్చిమ గోదావరి 43,వైయస్సార్ కడప జిల్లాకు సంబంధించి 41 మంది విద్యార్ధులు ఉన్నట్టు గ్రీవియన్స్ ద్వారా రిజిష్టర్ కాగా ఇప్పటికే 363మంది విద్యార్ధులను రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందని కృష్ణబాబు పేర్కొన్నారు.

ఈ సమావేశంలో టాస్క్ ఫోర్సు కమిటీ సభ్యులు డా.ఎ.బాబు మాట్లాడుతూ ఉక్రెయిన్ తమ పిల్లలుంటే వెంటనే 1902 హెల్ప్ లైన్ కు లేదా 0863-2340678 హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులకు విజ్ణప్తి చేశారు.టాస్క్ ఫోర్సు కమిటీ మెంబర్ కన్వీనర్ గితేశ్ శర్మ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన ప్రతి విద్యార్ధిని ఉక్రెయిన్ నుండి సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని ఈవిషయంలో దేశంలో మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పారు.ఈమీడియా సమావేశంలో ఎపిఎన్ఆర్టి సొసైటీ సిఇఓ కె.దినేష్ కుమార్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE