Suryaa.co.in

Andhra Pradesh

లంబసింగి కొండ రహదారికి అడ్డంగా కూలిన భారీ వృక్షాలు

చింతపల్లి-నర్సీపట్నం రాకపోకలకు అంతరాయం

చింతపల్లి జూలై 21 జనస్వరం: అల్పపీడనం ప్రభావంతో మన్య ప్రాంతంలో గడిచిన రెండు వారాల నుంచి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా లంబసింగి కొండ రహదారికి ఆనుకొని ఉన్న భారీ వృక్షాల ప్రాంతం తడిసి ముద్దయింది. రహదారి పక్కన ఉండే కొండ కోతకు గురై చింతపల్లి నర్సీపట్నం ప్రధాన రహదారి లంబసింగి కొండ రహదారిలో భారీ వృక్షాలు రహదారికి అడ్డంగా నేలకోలుతున్నాయి.

చింతపల్లి నర్సీపట్నం ప్రయాణించే ప్రయాణికులు చింతపల్లి ఎస్సై అరుణ్ కిరణ్ కి సమాచారం అందించారు. ఎస్సై అరుణ్ కిరణ్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ గెమ్మెలి సన్యాసిరావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది రహదారికి అడ్డంగా చెట్టు కూలిన ప్రాంతాన్ని సందర్శించి జెసిబి సహాయంతో కూలిన చెట్టును తొలగించారు. రహదారికి అడ్డంగా చెట్టు కూలడంతో సుమారు రెండు గంటల పాటు వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సంఘటనతో ప్రయాణికులు వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండ రహదారికి ఇరువైపుల నిక్షిప్తమై ఉన్న భారి వృక్షాలను తొలగించాలని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

LEAVE A RESPONSE