విజయవాడ : త్రిపుర గవర్నర్ ఇంద్రసేన రెడ్డి కు మాజీ కేంద్ర మంత్రి , విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆత్మీయ స్వాగతం పలికారు.. విజయవాడలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు మరియు విజయవాడ ఉత్సవ్, తదితర కార్యక్రమాలకు విచ్చేసిన గవర్నర్ ఇంద్రసేన రెడ్డి తాడిగడప లోని ఎమ్మెల్యే సుజనా చౌదరి క్యాంపు కార్యాలయంకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ గవర్నర్ ఇంద్రసేనారెడ్డి కు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు, గవర్నర్ తో కొద్దిసేపు ముచ్చటించారు… వివిధ అంశాలపై చర్చించారు.