Suryaa.co.in

Telangana

మునుగోడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ

– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరుపై వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించాం.మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆరెస్, బీజేపీ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ధన స్వామ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలోని ఒక గ్రామంల ఓట్ల కోసం మంత్రి మల్లారెడ్డి రూ. 12 లక్షలు ఇస్తానని చెప్పి 2 లక్షలు ఇచ్చి వెళ్తుంటే ఇంకా 10 లక్షలు ఇంకెప్పుడు ఇస్తారని ఆ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకొని నిలదీశారు.బాధ్యత కలిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా స్వామ్యాన్ని అపహస్యం చేస్తూ ఖూనీ చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంతో సంపాదించిన కోట్ల రూపాయలను విచ్చలవిడిగా మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్లను కొనడానికి ఉపయోగిస్తున్నారు.మిడతల దండులాగా కేంద్రం నుండి మంత్రులు, బీజేపీ నాయకత్వం, కోట్ల రూపాయల సంచులతో మునుగోడులో దిగుతున్నారు.కార్లు, బైకులు, బంగారు ఆభరణాలు ఇస్తామని బిజెపి, లక్షల రూపాయలు ఇస్తామని టిఆర్ఎస్ పార్టీలు మునుగోడు ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయి. బిజెపి మంత్రులు, టిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేసిన డబ్బులతో మునుగోడుని కొనుగోలు చేస్తామంటే… మునుగోడు ప్రజలను అవమాన పరిచినట్టే.. విలువ కట్టలేని ఓటును బీజేపీ, టిఆర్ఎస్ లుఇష్టా రాజ్యంగా డబ్బులతో ఓట్లు కొంటున్నారు.. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి మీ ఓటు విలువైనది. విలువ కట్టలేనిదని గమనించండి.

విచ్చలవిడిగా ధనస్వామ్యానికి తెరలేపిన టీఆరెస్,బీజేపీ పైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకొని కట్టడి చేయాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ
సిగ్గు,శరం వదిలి టీఆరెస్, బీజేపీ లు డబ్బు,లిక్కర్ తో ప్రభావితం చేస్తున్నారు.టీఆర్ఎస్ కార్యకర్తలే వాళ్ళ మంత్రి ని 12 లక్షలు ఇస్తానని 2 లక్షలు ఇచ్చి ఎలా వెళతారని అడ్డుకున్నారు.బీజేపీ కేంద్రంలో దోపిడీ చేసిన సొమ్ము మునుగోడు లో పెడుతున్నారు..మునుగోడు ఓటర్లు తెలివైన వారు.మిమ్మల్ని ఎవరు కొనలేరు.మిమ్మల్ని బయపెట్టాలని బెదిరించాలని చూసిన కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కి ఓటేసి గెలిపించాలి.

వారి స్వలాభల కోసం తెచ్చిన ఎన్నిక : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి
మునుగోడు ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు ధన అధికార బలాన్ని వాడుతున్నారు.కాంగ్రెస్ నాయకులను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు.లేకపోతే బెదిరింపులకు గురి చేస్తున్నారు.ముఖ్యమంత్రి నుండి మంత్రులు, కేంద్రం నుండి మంత్రులు మునుగోడు గ్రామలని దత్తత తీసుకొని ఒక మహిళ గా నన్ను ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు.మునుగోడు ప్రజలు కు విజ్ఞప్తి ఇలా ధన బలం చూపెట్టే వారు రేపు ప్రజాసేవ చేయరు.వారి స్వలాభల కోసం తెచ్చిన ఎన్నిక.ధన ,అధికార బలం ఎంతున్న ..మునుగోడు ఓటరు మహాశయులు నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా.

LEAVE A RESPONSE