Suryaa.co.in

Telangana

గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ..టీఆర్ఎస్ రాజకీయ నాటకాలు

– ప్రధాని మోదీ వాఖ్యలను ఖండించిన NSUI
– నిజాం కాలేజ్ ముందు మోదీ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్ బషీర్ బాగ్ చౌరస్తాలో నిజాం కాలేజ్ ముందు NSUI నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. రాజ్యసభలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రధాని చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డ NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మురి వెంకట్. కాంగ్రెస్ హయంలో చేసిన తెలంగాణ రాష్ట్ర విభజన తీరు వల్ల తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయని మోడీ మాట్లాడడం పై ఆగ్రహం. బిజెపి నాయకుల పై దాడులు చేస్తాం. గల్లీ లో కుస్తీ, ఢిల్లీ లో దోస్తీ అన్న విధంగా..సీఎం కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలు ఆడుతున్నారు. టి ఆర్ ఎస్ ప్రజాప్రతినిదు లపై కూడా దాడులు చేస్తాం. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ఆందోళన చేస్తున్న NSUI నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

LEAVE A RESPONSE