కేసీఆర్ తప్పకుండా జైలుకు పంపిస్తాం

Spread the love

– టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్

‘ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి మా దగ్గర ఉంది.. తప్పకుండా జైలుకు పంపిస్తాం.. బీజేపీ
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకం.. బీజేపీని బొందపెట్టాల్సిందే : టీఆర్ఎస్ రాజ్యాంగాన్ని మార్చాలి.. కేసీఆర్ : రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ ’
బీజేపీ.. టీఆర్ఎస్ ఆడుతున్న అందర్ – బాహర్ గేమ్ కు ఇవి కొన్ని శాంపుల్స్ మాత్రమే. రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తోంది. ఇన్నేండ్లలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలను మోడీ ఏమైనా చేసిండా?? ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడైనా అడిగిండా?? చౌరస్తాలో కొట్టుకుందాం.. ఇండ్లలో కల్సుందాం.. అనే రకంగా తెలంగాణ ప్రజలను కేసీఆర్-మోడీ అండ్ కో మోసంజేస్తున్నారు.

ఇన్నేండ్లసంది.. ఐటీఆర్, ఖాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యరం ఉక్కు పరిశ్రమ గురించి కేసీఆర్ ఎన్నడైనా ఎక్కడైనా అడిగిండా…?? ఇప్పుడు ప్రధానిహోదాలో మాట్లాడుతున్న మోసకారి మోడీ.. 2014 ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు.. ఇచ్చిన హామీలు ఏమైనా తెలంగాణకు జేసిండా?? కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అనేక ప్రాజెక్టుల్లో కేసీఆర్ అవినీతి చేశాడని కాంగ్రెస్ పార్టీ 2016 నుంచి నినదిస్తోంది. ఆధారాలు ఇస్తాం.. సీబీఐ విచారణ జరిపించని కేంద్రప్రభుత్వాన్ని కోరుతోంది. దానిపై ఇంతవరకూ ఎక్కడా స్పందించని కాషాయ, నేతలు.. ఒక్కసారిగా కేసీఆర్ ను జైలుకు పంపుతాం అంటూ పెట్రేగిపోతోంది.

బీజేపీకి అంత ఉంటే.. వెంటనే కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మోదీ ప్రభుత్వాన్ని, బండి సంజయ్ అండ్ కో ను డిమాండ్ చేస్తున్నా. బీజేపీ-టీఆరఎస్ పార్టీలు ఒకే రకమైన ఆలోచనతో కలిసి పనిచేస్తున్నాయి. బయటకు మాత్రం శత్రువుల్లా.. కనిపిస్తూ.. లోలోపల కలిసి ఒకరికోసం ఒకరంటూ పనిచేస్తున్నాయి.

ఈ రెండు పార్టీల నాకుడు.. జోకుడు వ్యవహారం వల్లే తెలంగాణకు విభజనచట్టం ప్రకారం రావాల్సిన ఏవీ రాలేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీమీద.. విభజిత రాష్ట్రాలకు చట్టం ప్రకారం ఇవ్వాల్సిన అన్ని అంశాలను పక్కన పెట్టి.. డైవర్షన్ స్కీమ్ లెక్కన కొత్త వివాదాలకు తెరలేపుతన్నాయి.

కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఇచ్చింది.. రెండు రాష్ట్రాలకు సమానంగా చెందాల్సిన అన్ని అంశాలకు సబంధించి.. కొత్తగా ఏర్పాటు చేయాల్సిన వ్యవస్థపైనా చట్టం రూపొందించింది.. ఇన్నేండ్లు అధికారంలో ఉన్న మీరు వాటిపై ఏంజేశారో చెప్పుకోలేక.. చెప్పుకోనికి ఏమీలేక.. మీడియా హైప్ కోసం కోట్లాడుతున్నట్లు డ్రామాల్జేస్తున్నారు.

నిజంగా తెలంగాణ మీద మోదీ-కేసీఆర్ లకు చిత్తశుద్ది ఉంటే.. వెంటనే విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా..కేసీఆర్ అవినీతిపై వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని పత్రికా ముఖంగా డిమాండ్ చేస్తున్నా.

Leave a Reply