పొదలకూరు పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు

టీడీపీ మండల అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబుపై బనాయించిన అక్రమ కేసు విషయంలో విచారణ నిలిపేయాలని ఆదేశం.ఇటీవల నేదురుపల్లి పర్యటనలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి చేసిన విమర్శలకు దీటుగా కౌంటర్ ఇచ్చిన మస్తాన్ బాబు. టీడీపీ నేత మస్తాన్ బాబు వెల్లడించిన విషయాలకు ఓర్చుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసిన వైసీపీ నేత రమణారెడ్డి.

సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటించకుండా, ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేసి మస్తాన్ బాబును అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన ఎస్సై కరిముల్లా. కుటుంబసభ్యులతో కలిసి బైక్ పై సంగంలో శుభకార్యానికి వెళుతుండగా మార్గమధ్యలో నేదురుపల్లి వద్ద దౌర్జన్యంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం.

చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ మస్తాన్ బాబు సతీమణితో పాటు గ్రామస్తులు, స్థానిక యువత గట్టిగా నిలదీయడంతో వెనక్కితగ్గిన ఎస్సై కరిముల్లా. పొదలకూరు పోలీసులు తనపై అక్రమ కేసు బనాయించారని, ఆ కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన మస్తాన్ బాబు.

ఎస్సై కరిముల్లా చట్టప్రకారం నడుచుకోలేదని, మేజిస్ట్రేట్ అనుమతి లేకుండా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని మస్తాన్ బాబు తరఫు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్టు. విచారణ ప్రక్రియపై స్టే మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

Leave a Reply