కేసీఆర్ సీఎంగా కొనసాగడం తెలంగాణ సమాజానికి అరిష్టం

– విరుచుకుపడ్డ తెలంగాణ బీజేపీ నేతలు

ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పార్టీ నేతలు వీరేందర్ గౌడ్, నర్సింహారెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్ తదితరులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు..

రాజ్యాంగాన్ని తిరగరాయాలంటూ సీఎం కేసీఆర్ చేసిన బరితెగింపు వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం అసహ్యించుకుంటున్న తరుణంలో ఈరోజు చర్చను డైవర్ట్ చేసేందుకే టీఆర్ఎస్ నేతలు నిరసనల పేరుతో డ్రామా చేస్తున్నరు.చరిత్రను తెరగమరుగు చేసేందుకు సీఎం చేస్తున్న కుట్రలను ఎండగట్టేందుకు బీజేపీ చేస్తున్న పోరాటాలపై ప్రజల్లో చర్చ జరగకుండా టీఆర్ఎస్ చేస్తున్న డ్రామాలను ప్రజలంతా గమనిస్తున్నరు.

ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది? ఆయన దిష్టిబొమ్మలను ఎందుకు దగ్దం చేస్తున్నారో టీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి? మోదీ తెలంగాణను వ్యతిరేకించారా? బిల్లు వద్దన్నరా? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ ఈ దేశానికి చేసిన ఇబ్బందులను మాత్రమే ప్రస్తావించారు కదా..కాంగ్రెస్ విధానాన్ని ఎండగడితే కేసీఆర్, టీఆర్ఎస్ నేతలకు వచ్చిన నొప్పేంటి? తెలంగాణ సమాజానికి కేసీఆర్ సీఎంగా కొనసాగడం అరిష్టం ఒక ఓటు- రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని మొట్టమొదట కాకినాడ తీర్మాం చేసింది బీజేపీ మాత్రమే.

బీజేపీ మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు పార్లమెంట్ లో చర్చ జరిపి విభజించాం. 2000 సంవత్సరంలో బీజేపీకి సంఖ్యాబలం లేనందునే తెలంగాణ ఇవ్వలేకపోయాం. ఎన్డీఏ ఛైర్మన్ గా చంద్రబాబు అడ్డుకున్నందునే తెలంగాణ ఇవ్వలేకపోయాం.ఆనాడు ఎక్కడా గొడవ జరగలేదు.. పార్లమెంట్ లో తలుపులు మూసి, మైక్ కట్ చేయలేదు. చర్చ జరిపి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేశాం. తెలంగాణ బిల్లు సమయంలో పెప్పర్ స్ప్రే పార్లమెంట్ కొట్టించింది కాంగ్రెస్ నేతలే కదా…పెప్పర్ స్ర్పె కొట్టి ఎంపీలను ఇబ్బంది పెట్టినా ఎదురొడ్డి తెలంగాణ బిల్లు పెట్టేలా చేసి మద్దతిచ్చింది సుష్మా స్వరాజ్.పార్లమెంట్ లో మీరు బిల్లు పెట్టకుంటే… మేం వచ్చాక బిల్లు పెడతామని హెచ్చరిస్తే కాంగ్రెస్ భయపడి తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సంగతి మర్చిపోయినవా?

పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు ఓటింగ్ లో కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదు. ఢిల్లీలో 48 గంటల దీక్ష అని చెప్పి దొంగ దీక్ష చేసింది నువ్వు కాదా? కేసీఆర్… ఉద్యమ ద్రోహులను నీ సంకలో చేర్చుకుంది నిజం కాదా?నీ కేబినెట్ లో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులున్నరో చెప్పగలవా?బలిదానాలు చేసిన శ్రీకాంతాచారిసహా అమరవీరుల ఆత్మఘోష విన్పిస్తలేదా?తెలంగాణ ఉద్యమ కారులు నీ ద్రోహాన్ని ఎండగట్టేందుకు బీజేపీలో చేరుతున్న విషయం మీకు తెల్వదా? తెలంగాణలో ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ఇబ్బంది పెడుతున్నరు.

కృష్ణా నీటికి ఏపీ తరలించుకుపోతుంటే కనీసం స్పందించకుండా ఫాంహౌజ్ కే పరిమితమైన కేసీఆర్ బీజేపీని విమర్శించే నైతిక హక్కుందా? నీ పాలనలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా పట్టించుకోని దుర్మార్గుడు కేసీఆర్ సమస్యలను దారి మళ్లించడానికి రోజుకో కొత్త డ్రామాలాడుతున్నరు కేసీఆర్.

ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ… టీఆర్ఎస్ పతనం ఎప్పుడో ఖరారైంది. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం తేవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నడు. కల్వకుంట్ల రాజ్యాంగం రావాలా? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా? ప్రజలు అలోచించాలి. కల్వకుంట్ల రాజ్యాంగంలో ఉద్యోగాలు రావు, డబుల్ బెడ్రూం ఇండ్లు రావు, దళితులకు మూడెకరాలు రావు, దళితులు ఎన్నటికీ సీఎం కాలేరు.కల్వకుంట్ల రాజ్యాంగంలో అంబేద్కర్ విగ్రహాలుండవు.. కేసీఆర్ విగ్రహాలే కల్వకుంట్ల రాజ్యాంగంలో ఉంటాయి.కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు… క్షమాపణ చెప్పే వరకు ఉద్యమాలు కొనసాగిస్తాం.

Leave a Reply