– ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొన్న నేతలు
మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా మునుగోడు మండలంలోని వివిధ గ్రామాలలో పర్యటించి టి.ఆర్.ఎస్. పార్టీ ఎం.ఎల్.ఏ అభ్యర్థి అయిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తనయులు రామేశ్వర్ గౌడ్ , కిరణ్ గౌడ్ , కిషోర్ గౌడ్ , త్రినేత్ర గౌడ్
సీఎం కేసీఆర్ , డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఆదేశాల మేరకు మునుగోడు మండలంలోని పలు గ్రామాలలో గౌడ సంఘాల కుటుంబాలను కలిసి, టి.ఆర్.ఎస్ పార్టీ ని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని డిప్యూటీ స్పీకర్ తనయులు కోరారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని, మా ఓటు టి.ఆర్.ఎస్ పార్టీ కి వేస్తామని స్థానిక కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ , కంది శైలజ , సునీత , లింగాని ప్రసన్న లక్ష్మి , టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.