– భారీగా పాల్గొన్న కార్యకర్తలు నాయకులు
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధర్నాలు నిర్వహించారు.
జిల్లా, మండల కేంద్రాల్లో నిర్వహించిన రైతు ధర్నాల్లో పాల్గొనేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా తరలివచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్, సిద్దిపేట జిల్లాలో హరీశ్‌రావు, ఖమ్మంలో పువ్వాడ అజయ్, నిర్మల్‌లో ఇంద్రకరణ్ రెడ్డి, సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి, వనపర్తిలో నిరంజన్ రెడ్డి, హైదరాబాద్‌లో తలసాని శ్రీనివాస్ యాదవ్, మహముద్ అలీ, వరంగల్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదించారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు.
కేంద్రానికి వ్యతిరేకంగా రైతుల నినాదాలు..
-తెలంగాణ కు ఒక న్యాయం …
పంజాబ్ కు ఒక న్యాయమా…?
-తెలంగాణ భారతదేశంలో భాగం కాదా…?
-తెలంగాణ రైతులు పండించిన వరి ధ్యాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనదు..?
-తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎఫ్‌సీఐ ద్వారా కొనుగోలు చేయాలి..
-తెలంగాణ రైతులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇంత కక్ష ఎందుకు…?
-కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి..
-తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొంటుందా…? కొనదా…? స్పష్టం చేయాలి..!
-రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయమంటే… కార్లు ఎక్కించి చంపుతారా…? ఇది ఎక్కడి న్యాయం..?
-తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి..
-రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత…. విధి…!
-రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వైఖరి కి వ్యతిరేకంగా పోరాడుదాం !!
-కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం !!
-కేంద్ర ప్రభుత్వామా కళ్ళు తెరువు.. తెలంగాణ రైతుల వరి ధాన్యం కొను..
-కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతికి వ్యతిరేకంగా పోరాడుదాం..
-పంజాబ్ రైతుల వద్ద వరి ధాన్యం కొంటూ.. తెలంగాణ రైతుల వద్ద ధాన్యం ఎందుకు కొనరు.. కేంద్ర ప్రభుత్వమా ఇదెక్కడి న్యాయం..?
-తెలంగాణ రైతులను దగా చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పై పోరాడుదాం !!
-తెలంగాణ రైతుల ఐక్యత వర్ధిల్లాలి ..!
-పోరాడుదాం.. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం… !! పోరాడుదాం.. !!
-కార్పోరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడుదాం…పోరాడుదాం..
-రైతులను వంచిస్తున్న రాష్ట్ర బిజేపీ నాయకుల వైఖరిని ఎండగడదాం..!! తెలంగాణ రైతులను రక్షించుకుందాం..!!
-బీజేపీ అంటేనే… భారతీయ ఝూటా పార్టీ..
-ఢిల్లీ పెద్దల్లారా.. అన్నం పెట్టే రైతన్నలకు సున్నం పెడతారా..! వరి ధాన్యం కొనకుండా వంచిస్తారా..?
-పైకి దేశ భక్తి ..! లోపల కార్పోరేట్ భక్తి…!!
-బీజేపీ నేతల్లారా..ఇదేనా మీద్వంద్వ నీతి..
-రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలి…
-రైతులను వంచించడమే దేశ భక్తా…! సిగ్గు..సిగ్గు .!!
-తెలంగాణ రైతులు పండించిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలి..!!
-రాష్ట్ర బీజేపీ నేతలకు తెలంగాణ రైతులపై ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వరి ధాన్యాన్ని కొనిపించాలి.