( రాజేష్)
చంద్రబాబు వంద రోజుల పాలన వైఫల్యా లంటూ ఎవరో వాట్సాప్ ఫార్వార్డు పంపారు.అసలేం బాలేదు అంటూ…
నాకు తోచిన, నాకున్న పరిమిత అవగాహన ప్రకారం సమాధానం ఇద్దామనుకున్నాను. వంద రోజులు పూర్తి అయ్యాక ఏమి జరుగుతుందో ఒకసారి సమీక్షించుకుందాం. నిప్పు కోడి తన తలని ఇసుకలో కప్పెట్టుకుని ఏమీ జరగలేదని జరగడంలేదని భావిస్తే అంతకంటే భావ దారిద్ర్యం ఇంకా ఉండదు.
రహదారులు
నిర్మాణం ఊపందుకోలేదు. వానాకాలంలో రహదారులు వేసే టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఇసుక
వానలు, వరదలు, నీటి మట్టాలు తగ్గాక ఇసుక లభ్యత పెరుగుతుంది. ధరలు తగ్గుతాయి. ప్రతి వానాకాలంలో ఇలాంటి కొరత సహజం.
మద్యం
జగన్ పాపాల కోరల నుండీ విడిపించుకుని, కొత్త మద్యం అందుబాటులో కి తేవడానికి కోర్టు కేసులు ఇతరత్రా సమస్యలు రాకుండా పరిష్కారం చేయడానికి, కసరత్తు చేయడానికి ఈ సమయం అయ్యింది. దసరా వస్తోంది. సరదా తెస్తోంది.
జీతాలు
ఎప్పుడొస్తాయో ఎదురు చూస్తూ నెలల తరబడి ఎదురు చూసిన పరిస్థితులు నుండి.. మొదటి నాలుగు ఐదు రోజుల్లో జీతాలు.
ఫీజు రీయింబర్స్ మెంట్
ఒక్కొక్కటి సరిజెసుకుంటూ వస్తున్నారు. ఓపిక కావాలి.
ఆరోగ్యశ్రీ
బకాయిలు సరిచూసుకుంటూ ఎమర్జెన్సీ నిధులు విడుదల చేస్తున్నారు.
రాజధాని
పనులు అన్నీ పక్కా ప్రణాళికతో పట్టాలెక్కిస్తున్నారు. మొదలెట్టాక నిర్విరామంగా నిరంతరాయంగా పూర్తి చేయడానికి పక్కా రూట్ మ్యాప్ రెడీ.
పాలన
హాట్ టూట్ అంటే పాలన జరిగిపోదు. పక్కాగా తప్పు చేసిన వాళ్ళని బాధ్యులను చేస్తూ, చట్టపరంగా చర్యలు తీసుకుంటూ సమర్ధులను, నమ్మకస్తులనూ వడపోసి కీలకమైన బాధ్యతలు ఇచ్చుకోవాలి. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి.
నామినేటెడ్ పోస్టులు: పార్టీ కసరత్తు అరవై పైగా కార్పోరేషన్ ల్లో పూర్తి. ఇక విడతలో వారీగా విడుదల. బదిలీల్లో సాధ్యమైనంత పారదర్శకతకు పెద్ద పీట వేశారు.
రైతులకు
వర్షాలు సమృద్ధిగా పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నా అక్టోబరు- డిసెంబరు కాలాల్లో ఆ ప్రాంతాలకు వానలు కురవడానికి అవకాశం.
మహిళలకు
దీపావళి నుండి దీపం పథకం కి అడుగులు, సంక్రాంతికి తల్లికి వందనం ప్రారంభానికి సన్నాహాలు.
యువతకు నిరుద్యోగులకు
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పై కసరత్తు, కంపెనీలు నెలకొల్పడానికి అనువైన వాతావరణం కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం.
ఆర్థిక పరిస్థితి
చాలా వరకూ మెరుగయ్యింది. ఇంకా సరిదిద్ద వలసిన అంశాలు ఉన్నాయి.
లోపాలు వెతకాలంటే అన్నిటికీ వంకలు పెట్టవచ్చు. కానీ మన వంతు ప్రయత్నం మనం చేయడమే. 74 సంవత్సరాల వయస్సులో, ఆయన పడుతున్న కష్టాన్ని ప్రతిపక్ష నాయకుల గొంతుకులకు ఇంధనం అవ్వకండి.
పరిస్థితి మనం అనుకున్నంత కష్టంగా ఏమీ లేదు. ఐదేళ్ళు నానా దరిద్రాలు చేసి పోతే భరించిన జనం, ఐదు నెలలు కూడా వేచి చూడరు అనుకోవడం అమాయకత్వం. జనవరిలో పరుగులు పెట్టనున్న ఆంధ్రప్రదేశ్ గ్రోత్ స్టోరీలో మనందరం భాగస్వాములవుదాం.