బాబును ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేసిన టీటీడీ బోర్డు మెంబర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
అమరావతి: రాష్ట్ర సచివాలయంలో టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేసి ఘనంగా సత్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. చంద్రబాబు నాయుడుతో తనకు ఉన్న అనుబంధాన్ని చిత్ర రూపంలో మేమంటూ గా అందించి శ్రీవారి లడ్డు ప్రసాదం చంద్రబాబుకు అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వయంగా చంద్రబాబు జ్ఞాపికలో ఉన్న ఫోటోలు ఒక్కొక్కటిగా తిలకించి ఎప్పుడు ఎక్కడ తీయించుకున్న విషయాలను నెహ్రూ ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. 74 సంవత్సరాల వయసులో నాకు ఆ భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేయాలని ఈరోజు ఆయనను కలవడం జరిగిందని ఆయనతో గత 40 సంవత్సరాలుగా నాకున్న అనుబంధాన్ని చిత్ర రూపంగా తీర్చిదిద్ది ఒక ఫోటో ఫ్రేమ్ లో నిక్షిప్తం చేసి అందించామని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు.